Others

నాకు నచ్చిన చిత్రం-- ఆ నలుగురు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సినిమా అంటే నాలుగు ఫైట్లు, ఆరు పాటలు, మితిమీరిన హింస, ద్వంద్వార్థాలు, హీరో హీరోయిన్ల శృంగార విన్యాసాలు, విదేశాల్లో లొకేషన్లు అన్న బ్రాండ్ ఇమేజ్‌తో తామర తంపరగా సినిమాలు వచ్చి తెలుగు ప్రేక్షకులను హింసిస్తున్న తరుణంలో వేసవిలో మంచు వెనె్నలలా వచ్చి ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్రవేసుకున్న ‘ఆ నలుగురు’ సినిమా అంటే నాకెంతో ఇష్టం. కుటుంబ విలువలు, ప్రేమానురాగాలు, మానవతా విలువల ఔన్నత్యాన్ని అద్భుతంగా ఆవిష్కరించిన ఈ సినిమాను చంద్రసిద్ధార్థ చక్కగా రూపొందించారు. మంచి కథాబలంతో నిర్మించిన ఈ సినిమాలో రఘురామయ్య పాత్రలో రాజేంద్రప్రసాద్ చక్కగా నటించారు.
మన జీవితంలో ఎంతటి ఉన్నత శిఖరాలను ఎదిగినా, మనకు కావలసింది, మన కట్టెను మోసే నలుగురు మనుషులే అన్న మూల సిద్ధాంతంపై తీసిన చిత్రం ఇది. ప్రతి డైలాగ్ హైలెట్‌గా ఉంటుంది. రాష్ట్రప్రభుత్వ నంది అవార్డు కూడా లభించింది. ముఖ్యంగా క్లైమాక్స్‌లో రఘురామయ్య అంత్యక్రియలకు వేలాదిగా జనం తరలి రావడం, తండ్రి ధనాన్ని దాచుకుని, పారిపోయిన అతని కొడుకులు పశ్చాత్తాప పడడం, యమకింకరులతో రాజేంద్రప్రసాద్ సంభాషణలు కంట తటిపెట్టిస్తాయి. టైటిల్ సాంగ్ జీవితపు నిత్య సత్యాలను చక్కగా విశే్లషించింది. నేటికీ ఈ సినిమా టీవీల్లో వచ్చినప్పుడల్లా చూసే ప్రేక్షకులు భావోద్వేగానికి లోనవుతారనడంలో సందేహం లేదు. మంచి నటన, సాహిత్యం, సంగీతం, కథాబలం, స్పందింపజేసే సంభాషణలతో తీసిన ఈ చిత్రం ఉత్తమ సినిమాల పట్టికలో మొదటి స్థానంలోనే వుంటుంది.
-ఎం.కనకదుర్గ, తెనాలి