ఆంధ్రప్రదేశ్‌

ఎస్‌పిడిసిఎల్‌లో 2660 పోస్టుల భర్తీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిఎండి హెచ్‌వై దొర వెల్లడి
విశాఖపట్నం, డిసెంబర్ 29: ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యమైన సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ (ఎస్‌పిడిసిఎల్) పరిధిలో అన్ని క్యాటగిరీలకు సంబందించి 2660 పోస్టులు భర్తీ కావాల్సి ఉందని సంస్థ సిఎంపి హెచ్‌వై దొర చెప్పారు. ఏపిఎస్‌ఇబి ఇంజనీర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం విశాఖలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ వీటిలో 900 ఇంజనీర్ల పోస్టులు భర్తీ కావాల్సి ఉందన్నారు. వీటికి సంబంధించిన ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపామన్నారు. గత కొనే్నళ్ళుగా వీటి భర్తీ జరగనందున ఉన్నవారిపైనే పనిభారం పడుతోందన్నారు. ప్రభుత్వ ప్రాధాన్యతలు మారుతున్నాయని, విండ్ పవర్, సోలార్ పవర్, ఇంధన పొదుపు వంటి అంశాలను పటిష్టంగా అమలు చేయాల్సి వస్తున్నందున తప్పనిసరిగా ఇంజనీర్ల పోస్టులు కొత్తగా రావాల్సి ఉందన్నారు. అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ల నుంచి డివిజనల్ ఎలక్ట్రిల్ ఇంజనీర్ల స్థాయి వరకు, అలాగే డిఇఇల నుంచి సూపరింటెండెంట్ ఇంజనీర్ల వరకు పదోన్నతులు కల్పించగలిగామన్నారు. ఈ ఏడాది ఇంజనీర్లకు శిక్షణ ఇచ్చే కార్యక్రమాన్ని చేపడుతున్నామన్నారు. ఇటీవల జరిగిన ముఖ్యమంత్రి సమీక్షా సమావేశంలో సైతం విద్యుత్ లైన్ల నష్టాలకు సంబంధించి ఈపిడిసిఎల్ ప్రథమ స్థానంలోను, ఎస్‌పిడిసిఎల్ ఐదవ స్థానంలో ఉండడాన్ని ప్రస్తావించారన్నారు. ఈ స్థాయిని మరింతగా తగ్గించాల్సిందిగా ఆయన సూచించారన్నారు. ఈ విషయంలో యునైటెడ్ కింగ్‌డమ్ (యుకె), యుఎస్‌ఏ, సింగ్‌పూర్‌ల్లో సాధించిన ఫలితాలను ముఖ్యమంత్రి ప్రస్తావించడాన్ని ప్రతిఒక్కరూ పరిగణనలోకి తీసుకుని లక్ష్యాలవైపు దృష్టిసారించాల్సిందిగా ఆయన సూచించారు. మీటర్డ్ సేల్స్ పెరిగినపుడే నష్టాలు తగ్గినట్టు అవుతుందని ఈ ఏడాది ఇదే లక్ష్యం కావాలని, అలాగే ఇంజనీర్ల పోస్టులను సాధించుకోవాల్సి ఉందన్నారు. రాష్ట్ర విభజనతో విద్యుత్ ఇంజనీర్ల పరిస్థితి ఆందోళనకరంగా మారిందని, ఆంధ్ర రాష్ట్రంలో ఇంజనీర్లకు ఎటువంటి సమయం ఇవ్వకుండానే ఆ రాష్ట్రం నుంచి రిలీవ్ చేయడం దురదృష్టకరమన్నారు.