ఆంధ్రప్రదేశ్‌

తల్లి ఒడి చేరిన శిశువు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ సిటీ, అక్టోబర్ 28: కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో ఒక రోజు వయసున్న ఆడ శిశువు అపహరణకు గురవ్వగా పోలీసుల జోక్యంతో గంటల వ్యవధిలోనే తల్లి ఒడికి చేరింది. రాజవొమ్మంగి మండలం కిండ్ర గ్రామానికి చెందిన గిరిజన మహిళ రెడ్డి లక్ష్మి ప్రసవం కోసం మంగళవారం కాకినాడ జనరల్ ఆసుపత్రి మాతాశిశు విభాగంలో చేరింది. బుధవారం ఆమె ఆడబిడ్డకు జన్మనిచ్చింది. కాగా గురువారం రాత్రి 9.30 గంటల ప్రాంతంలో బిడ్డకు పాలిచ్చిన లక్ష్మి, తన పక్కనే పడుకోబెట్టుకుని ఆదమరచి నిద్రపోయింది. కొద్దిసేపటికి మెలకువ వచ్చి చూసేసరికి బిడ్డ కనిపించలేదు. ఆందోళనకు గురైన ఆమె బంధువులతో కలిసి ఆసుపత్రి అంతా గాలించినా ఫలితం లేకపోయింది. అసుపత్రి వర్గాల నుండి శిశువు అపహరణ సమాచారం అందుకున్న కాకినాడ వన్‌టౌన్ సిఐ ఎఎస్ రావు హుటాహుటిన ఆసుపత్రికి చేరుకుని, బాధిత మహిళ నుంచి వివరాలు సేకరించారు. ఆసుపత్రి సిసి టివి పుటేజీలో ఓ మహిళ ప్లాస్టిక్ బకెట్‌లో శిశువును ఉంచి తీసుకెళుతున్నట్టు పోలీసులు గుర్తించారు. ఆ మహిళ పలివెల లక్ష్మి అని, ఈ నెల 24 ప్రసవం కోసం ఆసుపత్రిలో చేరిందని, అయితే ఆమెకు అబార్షన్ అయ్యిందని ఆసుపత్రి సిబ్బంది పోలీసులకు తెలిపారు. సిఐ శుక్రవారం వేకువజామున తన సిబ్బందితో కలిసి జగ్గంపేట మండలం ఎస్ తిమ్మాపురం గ్రామంలోని బంధువుల ఇంట్లో ఉన్న పలివెల లక్ష్మిని అదుపులోకి తీసుకున్నారు.