ఆంధ్రప్రదేశ్‌

తిరుపతిలో ఒకరికి బ్రెయిన్‌డెడ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రేణిగుంట, నవంబర్ 2: బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి అవయవాలను విజయవంతంగా చెన్నై, విజయవాడకు వేరువేరుగా విమానంలో తరలించిన సంఘటన బుధవారం ఉదయం రేణిగుంట విమానాశ్రయంలో చోటుచేసుకుంది. తిరుపతిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో బ్రెయిన్ డెడ్‌తో మృతి చెందిన మురళి అనే వ్యక్తి అవయవాలు- మూత్రపిండాలు (కిడ్నీలు), కాలేయాన్ని (లివర్) వేరొకరికి దానం చేయడానికి కుటుంబ సభ్యుల ఆమోదంతో ఆసుపత్రి వైద్య సిబ్బంది అంతా సిద్ధం చేశారు. ముందస్తు ప్రణాళిక ప్రకారం ఆసుపత్రి సిబ్బంది హాస్పిటల్ నుంచి విమానాశ్రయానికి వేరువేరు సమయాల్లో ముందుగా ప్రత్యేక విమానంలో కాలేయాన్ని చెన్నైకి తరలించగా అనంతరం స్పైస్ జెట్ విమానంలో కిడ్నీని విజయవాడకు తరలించారు. అవయవాలు తరలించే సమయంలో ఎటువంటి ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా డిఎస్పీ నంజుండప్ప ప్రత్యేక పర్యవేక్షణలో సిఐ బాలయ్య, ఎస్‌ఐలు మధుసూధన్‌రావు, శ్రీనివాసులు, ఇతర పోలీస్‌సిబ్బంది ప్రత్యేక చర్యలు చేపట్టారు.