రాష్ట్రీయం

ఆర్టీసీ కాంప్లెక్స్‌ల్లో మినీ థియేటర్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, నవంబర్ 7: ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ సంస్థ ఆదాయ వనరులను సమకూర్చుకునేందుకు కొత్త పుంతలు తొక్కుతోంది. సరకు రవాణా, కొరియర్ సర్వీసులకే పరిమితమైన ఆర్టీసీ నేడు మిని థియేటర్లు ఏర్పాటు చేయాలన్న ఆలోచనకు శ్రీకారం చుట్టింది. తద్వారా ప్రయాణికులకు వినోదంతోపాటు ఆర్టీసీకి గణనీయంగా ఆదాయం సమకూరగలదని భావిస్తోంది.
విజయవాడలో ప్రయోగాత్మకంగా ఈ విధానం చేపట్టడం ద్వారా సత్ఫలితాలు రావడంతో రాష్టవ్య్రాప్తంగా వీటిని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అందులో భాగంగా తొలి దశలో రాష్ట్రంలో 58 చోట్ల మిని థియేటర్లకు ప్రతిపాదనలు స్వీకరించింది. జయనగరం ఆర్టీసీ జోన్ పరిధిలో శ్రీకాకుళం, టెక్కలి, పాలకొండ, బొబ్బిలి, పార్వతీపురం, రాజమండ్రి, కాకినాడ ఆర్టీసీ డిపోల్లో మిని థియేటర్లకు ప్రతిపాదనలు పంపినట్టు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎ.రామకృష్ణ సోమవారం చెప్పారు.
వీటిలో శ్రీకాకుళం, రాజమండ్రి ఆర్టీసీ కాంప్లెక్స్‌లలో మినీ థియేటర్ల నిర్మాణానికి టెండర్లు పిలిచినట్టు తెలిపారు. ఆర్టీసీ బస్సుల్లో రిజర్వేషన్ సౌకర్యం ఉన్న వాటికి జిపిఆర్‌ఎస్ ట్రాకింగ్ సిస్టమ్ అమలు చేస్తున్నామని ఇడి రామకృష్ణ తెలిపారు.
దీనివల్ల ప్రయాణికులు జిపిఆర్‌ఎస్ సౌకర్యం ఉన్న బస్సులు ఎంత దూరంలో ఉన్నదీ ముందుగా తెలుసుకునే వీలుందన్నారు. ఆర్టీసీ సంస్థ ఆదాయ వనరులు సమకూర్చుకునేందుకు ఖాళీ స్థలాలను లీజుకి ఇవ్వడంతోపాటు ఇతర రకాలుగా ఆదాయ వనరులు సమకూర్చుకునే ప్రయత్నం చేస్తోందన్నారు.