కొత్త లుక్‌లో జగన్నాథం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అల్లు అర్జున్ తాజాగా ‘సరైనోడు’ చిత్రంతో మంచి కమర్షియల్ విజయాన్ని అందుకున్నాడు. ఈ సినిమా తరువాత ఆయన నటిస్తున్న చిత్రం ‘దువ్వాడ జగన్నాథం డి.జె’. హరీశ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే జోరుగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ చిత్రంలో అల్లు అర్జున్ న్యూలుక్‌లో కన్పిస్తాడని తెలిసింది. త్వరలోనే ఈ లుక్‌కు సంబంధించిన స్టిల్ విడుదల చేస్తారట. మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కే ఈ చిత్రంలో కామెడీకి అధిక ప్రాధాన్యత వుంటుందని తెలిసింది. అల్లు అర్జున్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్‌రాజు నిర్మిస్తున్నారు. మొత్తానికి జగన్నాథంగా కొత్త లుక్‌తో తన అభిమానులను ఆకట్టుకోవడానికి సిద్ధమయ్యాడు బన్నీ.