ఆంధ్రప్రదేశ్‌

57 వేల మందికి ‘మీ ఇంటికి-మీ రేషన్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, నవంబర్ 20: చౌక ధరల దుకాణాలకు వెళ్లి, సరకులను తీసుకువెళ్లలేని వారి కోసం అమలు చేస్తున్న మీ ఇంటికి మీ రేషన్ పథకం ఆశించిన ఫలితాలను ఇస్తున్నది. రాష్ట్రంలో 57 వేల మంది ఈ పథకం కింద లబ్ధిపొందుతున్నారు. ప్రజా సంక్షేమానికి పెద్ద పీట వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థపై దృష్టి సారించింది. సరకుల ప పంపిణీలో జరుగున్న అక్రమాలకు తెరదించేందుకు ఇ-పోస్ విధానాన్ని అమల్లోకి తెచ్చింది. రాష్ట్రంలోని 1.34 కోట్ల రేషన్ కార్డులు ఉండగా, 29 వేల చౌక దుకాణాల ద్వారా సరకులను సరఫరా చేస్తున్నారు. ఈ-పోస్ విధానంలో లబ్ధిదారులు చౌక ధరల దుకాణాలకు వెళ్లి ఆధార్, వేలిముద్రలను ఇవ్వాల్సి ఉంది. దీని వల్ల వికలాంగులు, వృద్ధులు, అనారోగ్యంతో బాధపడుతున్న వారు ఇబ్బంది పడుతున్న విషయం ప్రభుత్వం దృష్టికి వచ్చింది. కొంతమంది లబ్ధిదారుల సమస్యలను గుర్తించిన ప్రభుత్వం లబ్ధిదారుల ఇళ్ల వద్దకే రేషన్ సరఫరా చేసే కార్యక్రమాన్ని ప్రారంభించింది. రాష్ట్ర వ్యాప్తంగా 57,810 మంది ఇబ్బంది పడుతున్న విషయాన్ని గుర్తించింది. వారందరికీ ఇళ్ళ వద్దకే సరకులను సరఫరా చేస్తున్నారు. శ్రీకాకుళంలో 4662, విజయనగరంలో 325, విశాఖలో 7353 మంది, తూర్పు గోదావరిలో 3652, పశ్చిమ గోదావరిలో 9536, కృష్ణాలో 175 మంది ఉన్నట్లు గుర్తించారు. అనారోగ్య కారణాలతో రేషన్ షాపులకు వెళ్లలేని వారిని పరిశీలిస్తే, గుంటూరులో 8857, ప్రకాశంలో 3545, నెల్లూరులో 10,301 మంది, కడపలో 175, కర్నూలులో 4605, అనంతపురంలో 4097, చిత్తూరులో 527 మంది ఉన్నారు. రేషన్ సరకులను ఈ పథకం కింద లబ్ధిదారులకు జన్మభూమి కమిటీ సభ్యులు సరఫరా చేస్తున్నారు.