ఆంధ్రప్రదేశ్‌

అవినీతి బోణీ చేసింది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), నవంబర్ 25: ఆంధ్రప్రదేశ్ నూతన సచివాలయంలో అవినీతి బోణి చేసింది. ఓ పేరు మోసిన సెక్యూరిటీ కంపెనీకి అనుమతి జారీ చేసేందుకు రూ.50వేలు లంచం తీసుకుంటూ సెక్షన్ ఆఫీసర్ అవినీతి నిరోధక శాఖ అధికారులకు దొరికిపోయాడు. ఈ సంఘటన సచివాలయంలో కలకలం రేకెత్తించింది. ఎసిబి అధికారులు తెలిపిన వివరాల ప్రకారం గుజరాత్‌కు చెందిన శివ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఏజెన్సీస్ అనే కంపెనీ దేశంలోని దాదాపు 6, 7 రాష్ట్రాల్లో సర్వీసులు అందిస్తోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కూడా ప్రభుత్వ శాఖల అనుమతి తీసుకుని సేవలు నిర్వహించింది. ఈ కంపెనీ నుంచి సిబ్బంది వివిధ బ్యాంకులు, ఇతర ప్రైవేటు, ప్రభుత్వ కార్యాలయాలకు భద్రత కార్యకలాపాలు అందించడం పరిపాటి. కాగా రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణలో తాజాగా సదరు కంపెనీ లైసెన్స్ పొంది సేవలు నిర్వహిస్తోంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో కూడా కొత్తగా లైసెన్స్ తీసుకోవాల్సి ఉంది. హోంశాఖలోని ఆర్మ్స్ అండ్ లీగల్ సెక్షన్ ఈ తరహా వ్యవహారాలకు సంబంధించి అనుమతులు జారీ చేస్తుంది. ప్రైవేట్ సెక్యూరిటీ సంస్థలకు హోంశాఖలోని స్పెషల్ సెక్రటరీ సంతకం చేయడం ద్వారా లైసెన్స్ మంజూరవుతుంది. దీంతో సదరు కంపెనీ 2015లో లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకుని 25వేల రూపాయలు ఫీజు కూడా చెల్లించింది. అయితే ఇందుకు సంబంధించి లాంఛనాలు పూర్తి చేయాల్సి బాధ్యత ఇక్కడ పనిచేసే సెక్షన్ ఆఫీసర్ కె శ్రీనాథ్‌పై ఉంది. ఆయన గతంలో ఇదే సెక్షన్‌లో హైదరాబాద్‌లో పని చేశారు. కార్యాలయం విజయవాడ తరలివచ్చాక ఇక్కడే ఓ ఇల్లు అద్దెకు తీసుకుని ఉంటున్నారు. అయితే లైసెన్స్ జారీకి లాంఛనాలు పూర్తి చేయాలంటే 50వేలు లంచం ఇవ్వాల్సిందిగా సదరు కంపెనీ వ్యక్తులను డిమాండు చేశారు. దీంతో ముట్టచెప్పేందుకు అంగీకరించిన కంపెనీ తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ బ్రాంచి మేనేజర్ ఎస్ గంగూలి ఏసిబి అధికారులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. వ్యూహాత్మకంగా అధికారులు శుక్రవారం సాయంత్రం సచివాలయంలోని హోంశాఖ కార్యాలయంలో ఫిర్యాది గంగూలి నుంచి 50వేలు లంచం తీసుకున్న సెక్షన్ ఆఫీసర్ శ్రీనాధ్ లైసెన్స్ పత్రాన్ని అప్పగించాడు. వెంటనే అక్కడే ఉన్న ఏసిబి అధికారులు దాడి చేసి శ్రీనాథ్‌ను అదుపులోకి తీసుకుని సొరుగులో పెట్టుకున్న పాత 500నోట్ల కట్టలను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరుస్తామని అధికారులు తెలిపారు. ఈ దాడుల్లో గుంటూరు ఏసిబి డిఎస్పీ దేవానంద్ శాంత్రో, విజయవాడ ఏసిబి డిఎస్పీ వి గోపాలకృష్ణ, సిఐలు శ్రీనివాస్, వెంకటేశ్వర్లు సిబ్బంది పాల్గొన్నారు.

చిత్రం... ఎసిబికి పట్టుబడిన శ్రీనాథ్