Others

నాకు నచ్చిన పాట--దేవ మహాదేవ ననుబ్రోవుము శివా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్వర్ణయుగం కాలంనాటి తెలుగు చిత్రాల్లో కర్ణాటక శాస్ర్తియ సంగీతానికి అనుగుణంగా వీలైతే అన్ని పాటలు లేదా కొన్ని పాటల బాణీలు ఉండేవి. అప్పట్లో ముద్రించే చిన్నసైజు పాటల పుస్తకాలపై -పాట దగ్గర ఫలానా రాగం అని ముద్రించేవారు కూడా. క్రమక్రమంగా తేలిక పాటలపై మనసు పెట్టుకొన్న ప్రేక్షకుల కోసం అలాంటి పాటలే పెడుతున్నారు. అప్పట్లో అన్నీ పౌరాణికాలు లేదంటే అప్పుడప్పుడు జానపదాలు. అలాంటి ఆణిముత్యాల్లో భూకైలాస్ ఒకటి.
రావణుని తల్లి కైకసి పరమ శివ భక్తురాలు. ఆమెపై చిత్రీకరించిన పాట ‘దేవ! మహదేవ ననుబ్రోవుము శివా’ అనే మొదటి పంక్తితో ప్రారంభమవుతుంది. తన కుమారులు ఎంత బలవంతులైనా, విశ్వవిజేతలైనా ఆ మహాదేవుడి అనుగ్రహం లేనిదే క్షేమం కలగదని ఆమె దృఢ విశ్వాసం. నేను దేవతలవంటి ‘కొమరులను కన్నాను.. దేవతామాతలతో సమయశము కన్నాను’ అంటూనే చివరకు ‘చల్లగా చూడుమా నా సుతుల గౌరీశ’ అని తన ఇష్టదైవానికి మొరపెట్టుకుంటుంది.
కైకసి మహాసాధు స్వభావురాలు. దైవభక్తిగల పతివ్రతా శిరోమణి. శివుని ఆత్మలింగాన్ని కోరిన మూఢ భక్తికలది. ఆ ప్రయత్నంలోనే రావణుడు తపస్సు చేయడంతో కథ మొదలవుతుంది. దక్షిణాది విదుషీమణులలో ఒకరైన యంయల్ వసంతకుమారి ఈ గీతాన్ని భక్తిరసస్ఫోరకంగా గానం చేశారు. సముద్రాల కలానికి, ఆవిడ గళం బంగారానికి తావి అబ్బినట్టుంటుంది. రాగ తాళాలతో సమతూకంగా ఉండే ఈ పాట ఆనాటి కర్ణాటక సంగీత ప్రియులను ఎంతగానో అలరించింది. అటువంటి పాటలే ఇతర చిత్రాలలోనివి కూడా నాటికి నేటికీ నిలిచి ఉన్నాయి.

-కాకుటూరి సుబ్రహ్మణ్యం