Others

నాకు నచ్చిన చిత్రం--కోడలుదిద్దిన కాపురం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామకృష్ణ ఎస్టేట్స్ పతాకంపై ఎన్టీఆర్ స్వీయ నిర్మాణంలో హీరోగా నటిస్తూ డి యోగానంద్ దర్శకత్వంలో తయారైన ఉత్తమ కుటుంబ కథాచిత్రం ‘కోడలుదిద్దిన కాపురం’. టైటిల్ రోల్‌లో మహానటి సావిత్రి నటించారు. కథానాయికగా చిన్నచిన్న కామెడీ తరహా పాత్రల నుంచి హీరోయిన్‌గా మారుతున్న తరుణంలో ‘వాణిశ్రీ’ ఎన్టీఆర్ బ్యానర్‌లో నటించడం విశేషం. దారితప్పిన రాజవంశ కుటుంబాన్ని సరిదిద్దే ఇల్లాలిగా సావిత్రి నటన అద్భుతం. బాధ్యత గుర్తించినా దారితప్పి క్లబ్‌లకు, తాగుడుకు బానిసలైన తన మామగారు, భర్తను.. పెళ్లయినా అత్తింటికెళ్లని ఆడబిడ్డను, ఇంటి బాధ్యతలు పట్టకుండా పూజలు పునస్కారాల పిచ్చితో దొంగబాబా చేతిలో మోసపోయే అత్తగారు, వంచన చేసే ఇంటి పనిపనివాళ్లతో పతనమవుతున్న కుటుంబాన్ని రక్షించుకొనే ప్రయత్నంలో మహానటి సావిత్రి కోడలు పాత్రలో అద్భుతమైన నటన ప్రదర్శించారు. వాస్తవంగా హీరోకన్నా కీలకమైన పాత్ర ఆమెది. కథానాయకుడు ఎన్టీ రామారావు తన తరహాలో నటించి మెప్పించారు. కుటుంబ యజమానులుగా నాగభూషణం, సూర్యకాంతం, దారితప్పిన పెద్ద కొడుకుగా జగ్గయ్య, ఆడపడుచుగా సంధ్యారాణి, తన భార్యను అత్తగారింటికి తీసుకెళ్లే ప్రయత్నంలో విఫలమయ్యే భర్తగా పద్మనాభం, సరుకుల్ని దొంగచాటుగా అమ్ముకునే వంట మాస్టారుగా రేలంగి, దొంగబాబాగా ఇంట్లో తిష్టవేసిన పాత్రలో సత్యనారాయణ.. ఇలా ఎవరికివారు తమ పాత్రలను సమర్థంగా పోషించి చిత్రాన్ని రక్తికట్టించారు. టివి రాజు సంగీత దర్శకత్వంలో చిత్రంలోని పాటలన్నీ ప్రజాదరణ పొందాయి. ఉన్నత కుటుంబ విలువలతో నిర్మించిన ఈ చిత్రం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే ద్వితీయ ఉత్తమ చిత్రంగా అవార్డు సాధించటమే కాకుండా ఎన్‌టి రామారావు 200వ చిత్రంగా 13 కేంద్రాల్లో శతదినోత్సవాలు, రజితోత్సవాలు జరుపుకుంది. అప్పుడప్పుడూ పాత సినిమాగా చానెల్స్‌లో వస్తూ, ఎప్పటికీ ఆనందాన్ని కలిగించే గొప్ప చిత్రమే ‘కోడలు దిద్దిన కాపురం’. నాకే కాదు, సంప్రదాయ సినిమాలను ఇష్టపడే ప్రతిఒక్కరికీ నచ్చే చిత్రమిది.

-పివిఎస్‌పి రావు