Others

తొలి తెలుగు సాంఘిక చిత్రం ప్రేమవిజయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగు సినిమా రంగం, సాంఘిక చిత్రాల నిర్మాణం ప్రారంభించి 80 సంవత్సరాలైంది. 1935నాటి తొలి నిర్మాణ దశలో చిత్ర నిర్మాణం ఎన్నో బాలారిష్టాలను ఎదుర్కోవాల్సి వచ్చింది. నాడు చెన్నపురిగా సుపరిచితమైన మద్రాస్ సినీ రంగం, మూకీ చిత్ర నిర్మాణాల స్థాయి, పౌరాణిక ఇతివృత్తాలతో తెలుగు మేధావులను సినిమాల నిర్మాణంవైపు ఆకర్షిస్తోన్న సమయం. చిత్ర నిర్మాణానికి అవసరమైన సాంకేతిక ప్రజ్ఞ, కెమెరా, లైటింగ్, స్టూడియోల వంటి ప్రధాన సౌకర్యాలు ఇతర సామగ్రికి బొంబాయి మీద ఆధారపడేవారు. బెంగుళూరులోనూ సైలెంటు పిక్చర్ స్టూడియో వుండేది.

ప్రప్రథమ సాంఘిక చలన చిత్ర దర్శక నిర్మాతగా చరిత్ర సృష్టించిన నాటక కళాతపస్వి కృత్తివెంటి నాగేశ్వరరావు (1886-1956) తన స్వీయ చరిత్రలో తన నాటకం ‘న్యూ కాలేజి గరల్’, ‘ప్రేమ విజయం’ పేరిట తొలి సాంఘిక చిత్రంగా నిర్మాణ వివరాలు, వ్యయప్రయాసలు కొంత స్పష్టం చేశారు. వ్యాపారరీత్యా లాభార్జనకోసం ఎందరో మేధావులైన రాజమండ్రి పౌరులు మద్రాస్‌లో ఫిలిం కంపెనీలు పెట్టేవారు. సినిమాలు తీయటం ఆరోజులలో మంచి వ్యాపారంగా పరిగణించేవారు. కాకినాడ, రాజమండ్రి, విశాఖపట్నం వంటి పట్టణాలనుంచి మద్రాస్ తరలి వెళ్ళేవారు.
తొలి సాంఘిక తెలుగు సినిమా దర్శక నిర్మాత కృత్తివెంటి నాగేశ్వరరావు 1886 మార్చి 23న బందరులో జన్మించారు. రాజమండ్రిలో చిలకమర్తి లక్ష్మీనరసింహం స్థాపించిన స్కూలులో 1904 వరకు విద్యాభ్యాసం చేశారు. చిన్నతనంలోనే నాటక రంగంలో ప్రవేశించారు. తొలుత స్ర్తి పాత్రలు ధరించేవారు. 1901లో ప్రప్రథమంగా సీత, తరువాత శకుంతల, ద్రౌపది, చిత్రరేఖ, దమయంతి వంటి పాత్రలలో రాణించారు. రాజమండ్రిలో ఉర్దూ నాటకాలు ప్రదర్శించారు. పార్శి నాటకాలు, హిందుస్థానీ సంగీత సంప్రదాయంతో తెలుగు నాటక రంగాన్ని దశాబ్దాల తరబడి రంజింప చేసారు. 1908లో రాజమండ్రి హిందూ సమాజం, సత్యవోలు గునే్నశ్వరరావు కంపెనీలో నాటక ప్రదర్శనలతో జాతీయ ఖ్యాతిగడించారు.
దేశాభిమాని ‘కృత్తివెంటి’
1906 వందేమాతరం ఉద్యమ సందర్భంలో బిపిన్ చంద్రపాల్ రాజమండ్రి రావడం స్వాతంత్య్రోద్యమ చరిత్రలో చిరస్మరణీయమైనది. కృత్తివెంటి స్థాపించిన స్వదేశీ వస్తశ్రాలకు పాల్ శంకుస్థాపన చేసారు. జాతీయ విద్యాలయానికి శ్రీకారం చుట్టారు. బ్రిటిష్ పాలనను ప్రతిఘటించే విప్లవ రహస్య కార్యక్రమాలను రాజమండ్రి స్వాతంత్య్ర పోరాట సమితి బాలభారతికి కృత్తివెంటి సారథ్యం వహించారు. సొంత నాటక సమాజం స్థాపించి సుగుణమణి, గయోపాఖ్యానం, బొబ్బిలి, వేణీ సంహారం వంటి ఎన్నో నాటకాలతో ఆంధ్ర దేశాన్ని ఉర్రూతలూగించారు. తన జీవిత సర్వస్వం నాటక కళకే అంకితం చేసిన కృత్తివెంటి నటునిగా, నాటక సమాజ స్థాపకునిగా, దర్శకునిగా ఆంధ్ర నాటక రంగానికి అహర్నిశలు సేవలందించారు. కందుకూరి, చిలకమర్తి, శ్రీపాద, టంగుటూరి, గాడిచర్ల వంటి సంస్కరణవేత్తలు, సమరయోధులు, సాహితీవేత్తలయిన ప్రముఖ జాతి నేతల సాన్నిహిత్యం ఈ నాటక కళాతపస్వికి సన్నిహిత జీవితమైంది.
స్వాతంత్య్రోద్యమ కాలంలోనే నాగరికత, విద్య, స్వేచ్ఛ్భావాలతో నవ సమాజ ఆవిర్భావానికి సత్కృషి ఆరంభమైంది. 1932నాటికి నాటి దేశ, కాలపరిస్థితులను సమాజ నడవడికలో మంచి, చెడులను నాటకీయంగా విశే్లషించే ఇతివృత్తానికి ‘కృత్తివెంటి’ ప్రాధాన్యత యిచ్చే ‘కాలేజి గరల్’ నాటక ప్రదర్శన, నాటి సమాజాన్ని విశేషంగా ఆకర్షించింది. 1934లో మద్రాస్‌లో హిందూ నాటక సమాజం ప్రదర్శించిన ‘కాలేజి గరల్’ నాటి స్వరాజ్య, జస్టిస్, ఆంధ్రపత్రిక, కృష్ణాపత్రిక, సమదర్శిని, గోలకొండ వంటి పత్రికలు వేనోళ్ళ ప్రశంసించాయి. ఆంధ్రుల చారిత్రక, సాంఘిక జీవిత కథనాలు యితివృత్తాలుగా టాకీ సినిమాలు నిర్మించాలనే సంకల్పానికి కాలేజి గరల్ అంకురార్పణ చేసింది.
ఇండియన్ ఆర్టు సినీటోన్ నిర్మాణ సంస్థకు ‘కాలేజి గరల్’ను టాకీగా నిర్మించాలనే ఆలోచన రావడం, అదే ప్రేమవిజయం పేరిట ప్రప్రథమ సాంఘిక చిత్రంగా నిర్మితం కావడం జరిగింది. పీపుల్సు బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ సేలం బలరామమూర్తి, వైస్ ప్రెసిడెంట్ రాంబాబు, ప్రెసిడెంట్ కొమ్మిరెడ్డి కేశవరామమూర్తి బంధువర్గమే నిర్మాతలుగా వున్నారు.
తన స్వీయ చరిత్రలో కృత్తివెంటి నాగేశ్వరరావు వివరణ ప్రకారం, కాలేజి గరల్ కథనాన్ని తొలిగా కాళ్ళకూరి హనుమంతరావు చేత నాటకంగా రాయించారు. సినిమా తీసే ప్రసక్తి అనంతరం మార్పులు, సవరణలతో ‘ఎక్స్ కాలేజి గరల్’ పేరిట వేదుల సత్యనారాయణశాస్ర్తీచే మళ్ళీ రాయించి ప్రచురింపచేసారు. చెన్నపురి వెళ్ళి కంపెనీ రిజిస్ట్రేషన్ చేయించే తలంపులో వుండగా ప్రథమ రచయిత కాళ్లకూరి కోర్టుకు వెళ్ళారు. అందువలన న్యాయవాది దేవగుప్తాపు సూర్యప్రకాశరావు ‘నియో కాలేజి గరల్’ పేరిట సినిమా తీయటానికి పర్సంటేజ్ పద్ధతి నిర్ణయించి కాంట్రాక్ట్ రాయించారు. వేదుల డైలాగ్‌లు, పాటలు రాసారు. సైలంట్ పిక్చర్‌లు, టాకీలలో అనుభవంవున్న కొచ్చర్లకోట రంగారావు, నటీనట వర్గం అంతా మద్రాస్ చేరారు. కథలో ఎలక్షన్ సందర్భం ప్రవేశపెట్టి ప్రేమ విజయంగా ఖరారు చేసారు. ఒకటిన్నర నెలలు షూటింగ్, రీటేకులతో సినిమా పూర్తి అయింది. పీపుల్సు బ్యాంక్ స్వంత లాబరేటరీలో తయారై ప్రింటయిన ఆ కాపీ, తెరమీద వేసి చూస్తే సరిగ్గా కనపడలేదు. వినపడటం కూడా లేకపోవడంతో ద్వారకానాథ్ అనే నిపుణుడు బొంబాయి తీసుకువెళ్ళి ఆరు కాపీలు ప్రింట్ చేసుకొచ్చాడు. అందులో బొమ్మలు కనపడినా డైలాగ్‌లు వినపడక సగం పాడైంది. ప్రేమ విజయం ఆ విధంగా విడుదల చేసారు.
దర్శక నిర్మాత కృత్తివెంటి, వాడ్రేవు నియన్న అనే లాయర్ చేత నోటీసు యిస్తే సినీటోన్ యింటి అద్దె చెల్లించటమే గగనమైంది. చేతిలో పైసా లేకుండా మద్రాస్‌లో ఆయన ఎన్నో పాట్లుపడ్డారు. ఎంతో వేదన అనుభవించారు. 1937లో మళ్ళీ రాజమండ్రి చేరారు. సినీటోన్ సినిమాలతోపాటు పీపుల్సు బ్యాంక్ మూతపడటంతో కథ ముగిసింది. మళ్లీ మద్రాస్ చేరిన కృత్తివెంటి నాగేశ్వరరావు 1956 డిసెంబర్ 22న తాంబరం శానిటోరియంలో అత్యంత వేదనాయుతంగా అజ్ఞాతంగా తనువు చాలించారు.

-జయసూర్య