సుజీత్‌తో ప్రభాస్?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాహుబలి ఘన విజయంతో జాతీయస్థాయిలో క్రేజ్ తెచ్చుకున్న ప్రభాస్ నటిస్తున్న ‘బాహుబలి-2’కోసం దేశంమొత్తం ఎదురుచూస్తోంది. అలాగే ఇంత భారీ ప్రాజెక్ట్ తరువాత ప్రభాస్ ఎలాంటి సినిమా తీస్తాడు. ఏ పెద్ద దర్శకుడికి ఛాన్స్ ఇస్తాడు అనే ఆసక్తికూడా అందరిలోనూ నెలకొంది. అయితే అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ప్రభాస్ ‘రన్ రాజా రన్’ ఫేమ్ సుజీత్‌కు ఛాన్స్ ఇచ్చిన సంగతి తెలిసిందే. సుజీత్ కూడా మరో ప్రాజెక్ట్ పెట్టుకోకుండా ప్రభాస్ సినిమాకోసం కొనే్నళ్లుగా కష్టపడుతున్నాడు. లేటెస్ట్‌గా డైరెక్టర్ సుజీత్ ఈ అంశంపై ట్విట్టర్ ద్వారా స్పందించారు. ‘ప్రభాస్ సినిమా అప్‌డేట్స్‌కోసం ఓపిగ్గా ఎదురుచూస్తున్న అభిమానులకు నా కృతజ్ఞతలు. ఈ సినిమాకు మంచి ఔట్‌పుట్ ఇవ్వాలని నేను మా టీమ్ కొనే్నళ్లుగా కష్టపడుతున్నాం. మీరెలాగు సపోర్ట్ చేస్తారని తెలుసు. దాంతోపాటే ఇంకాస్త ఓపిక, నమ్మకం ఉంచితే బాగుంటుంది. సినిమా మొదలయ్యాక ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ ఇవ్వడానికి ట్రై చేస్తాను’ అంటూ ప్రేక్షకులకు, అభిమానులకు తెలిపారు. అంటే ఈ సినిమా బాహుబలి-2 విడుదల సమయంలో ప్రారంభంఅయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.