కాసుల వర్షం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
అమీర్‌ఖాన్ కథానాయకుడుగా రూపొందిన దంగల్ ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. ఈ చిత్రం భారతీయ మార్కెట్లోనే కాక విదేశీ మార్కెట్లో కూడా మంచి వసూళ్లను రాబడుతోంది. గత డిసెంబర్ 23న విడుదలైన ఈ చిత్రం 31నాటికి మొత్తం రూ.239.01 కోట్లు వసూలు చేసిందని తెలుస్తోంది. దంగల్ సినిమా ప్రపంచవ్యాప్తంగా రికార్డులు సృష్టిస్తూ దాదాపుగా 250 కోట్ల వసూళ్లకు శరవేగంగా పరిగెడుతోందని బాలీవుడ్లో విశే్లషకుడు తరుణ్ ఆదర్శ్ లెక్కగట్టారు. అంతర్జాతీయంగా కూడా మంచి షేర్ సంపాదించిన ఈ చిత్రానికి సంబంధించిన మరికొన్ని థియేటర్ల రిపోర్టులు అందాల్సి వుందని వారు పేర్కొన్నారు. భారతీయ రెజ్లెర్ వీరుడు మహావీర్‌సింగ్ పోగట్ జీవితాన్ని ఆధారంగా తీసుకుని రూపొందించిన ఈ చిత్రంలో అమీర్ఖాన్తోపాటుగా సాక్షితన్వార్, ఫాతిమా సనాషేక్, సన్య, అపర్శక్తి ఖురానా ప్రధాన పాత్రల్లో నటించారు.
ఎంతో నచ్చింది : పవన్‌కల్యాణ్
దంగల్ చిత్రం షేర్ మార్కెట్లో సూపర్‌హిట్‌గా నిలవడంతో టాలీవుడ్ నటుడు పవన్‌కల్యాణ్ అమీర్‌ఖాన్‌పై ప్రశంసలు కురిపించారు. అద్భుతమైన జీవిత కథతో ఆయన రూపొందించిన ఈ చిత్రం ఇంత విజయవంతమవడం ఆనందంగా వుందని ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సినిమాను తాను చూశానని, తన అభిప్రాయాన్ని పంచుకోకపోతే మనస్సాక్షి ఒప్పుకోదనిపించి చెబుతున్నానని ఆయన అన్నారు. అమీర్‌ఖాన్ తన అద్భుతమైన నటనతో ప్రపంచవ్యాప్తంగా అనేక మంది హృదయాలను ఆకట్టుకున్నారని, ఇలాంటి నటుడు మన దేశంలో ఉండడం మనకు గర్వకారణమని, దర్శకత్వ ప్రతిభ సినిమాలో ప్రతిచోటా కనిపిస్తోందని, మహిళలంతా సాధికారత దిశగా పనిచేయాలన్న విషయాన్ని ఈ దంగల్ సినిమా గుర్తుచేస్తోందని పవన్‌కల్యాణ్ ప్రశంసించారు.