Others

భగవదనుగ్రహానికి ఎల్లలులేవు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పరమేశ్వరుడు సర్వవ్యాపి, పూర్ణుడు మరియు నిత్యుడు. అందరిలోపలా, వెలుపలా వ్యాపించి ఉన్నాడు. అందరి అంతర్యామిగా అంతరాత్మ రూపములో అందరి హృదయ మందిరాలలో ఆవాసం చేస్తున్ననూ, ఆ పరమాత్మ గురించి కొంతమందికి మాత్రమే తెలుసు. మన వైద్య శాస్త్రం ప్రకారం చెప్పే గుండె, ఆధ్యాత్మికపరంగా చెప్పే హృదయము లేదని గ్రహించాలి.
హృదయ స్థానంలో హదృయకమలం ఉంది. దీని ఒక్కొక్క దళానికి ఒక్కొక్క గుణము ఉన్నట్లు స్వామి ముక్తానంద తెలిపియున్నారు. ఆగుణములు వరుసగా కామం, క్రోధం, మోహం, లోభం, ప్రేమ, లజ్జ, జ్ఞానం, వైరాగ్యం, ఆనందం, సర్వజ్ఞిత్వం మొదలైనవన్నారు. అంతేకాదు, హృదయంలో అంగుష్టమంత ఆకాశం ఉంది. ఇక్కడ ఒక దివ్యజ్యోతి వెలుగుతుంటుంది. ఎంతో భవ్యమైన హృదయాకాశపు జ్యోతిని దర్శనం చేసుకోవడంలోనే మునులు, యోగులు తమ జీవితములను పరిపూర్ణము చేసుకునేవారు.
ఉపనిషత్తుల ప్రకారము, మానవ శరీరాన్ని, బ్రహ్మపురంగా భావించి అందులో దహరము అనగా హృదయమనే ఆకాశమునందున్న పరమాత్మని అనే్వషించుటయే ‘దహరవిద్య’ అని అంటారు. ఈ ఉపనిషత్తులు తెలియజేసిన విద్యలు అనగా యోగ ఉపాసనలలో దహరవిద్య ఒకటి, చాలా ముఖ్యమైనది. ఇంకా విపులంగా చెప్పాలంటే ఆదిత్య మండలాంతర్వర్తిగా వేదములచే కీర్తింపబడుచున్న పురుషుడు బింబరూపము చేతను, జ్ఞానము చేతను, ద్వేషము చేతను హిరణ్మయుడు అనగా సువర్ణమయుడే ఆదిత్య మండల అంతర్గతుడు, బ్రహ్మాండ మధ్యవర్తియు ఐన కారణపురుషుని కార్యరూపము వేరయినది దేనిని ప్రాజ్ఞులు చెబుతున్నారో ఆ కార్యరూపమే మానవుల హృదయంనందు మరల ప్రతిబింబించినది. అంటే కారణరూపుడు హిరణ్మయ పురుషుని సువర్ణ తేజోమయ దేహమే మానవ హృదయమునందు ప్రతిఫలించుచున్నది. అందువలననే అన్ని విద్యలలోను దహరవిద్య ప్రధానమని ఉపనిషత్తులు తెలియజేస్తున్నాయి.
ఆత్మ ప్రకాశమునకు స్థానమైన దహరకాశము అనే పేరుగల హృదయము హృద పీఠమునకు కుడివైపున ఉన్నదని రమణమహర్షి తెలిపియున్నారు. ఆ హృదయమునుండి సుషుమ్నా నాడీ మార్గమున జ్యోతిస్సు (వెలుగు) సహస్రారమునకు ప్రవహించుచున్నదని వివరంగా తెలిపారు రమణులు. దీనినే ఇంకొంచెం విపులంగా, ‘‘అమ్మా! నీవు స్వయంగా సూర్యునియందు, మానవుల హృదయమందలి పరమ పురుషుని సన్నిధియందును హిరణ్మయ (అనగా జ్యోతిర్మయ) కాంతి దేహముతో ప్రతిఫలించి ఉన్నావు. భూమికి, సూర్యునకు మధ్యదేశమగు అంతరిక్షమునందు రసాధిదేవతగా ఉన్నావు. సూర్యునియందు లోకములకు జీవనాధారమైన వేడిమి, వెలుగు మొదలైనవానిని వెలువరించు రశ్మిదేవతగా ఉన్నావు. మానవుల యందు అనగా వారి హృదయాకాశములో భోక్తృత్వ సామర్థ్యముగల అగ్నిశక్తిగా ఉన్నావని ఆ ఉమాదేవిని శ్రీ కావ్యకంఠ వాసిష్ఠ గణపతిముని స్తుతించారు. మొదట అవ్యక్తుడగు పరమపురుషునికంటె వేరుగాని ఆ తల్లి చిత్ చిత స్వరూపిణి- తపస్స్వరూపిణి- మొట్టమొదటి రూపము మహేశ్వరి అనియు, పిమ్మట వేరు శక్తిగా జ్ఞానవతి అనగా సృష్టికి నిమిత్తమైన శక్తి- మహేశ్వరి రెండవ రూపముగను, తరువాత ఆకాశము శరీరముగాగల అదితియే మహేశ్వరి మూడవ రూపముగను, పిదప అంతరిక్షమునందలి జ్యోతిర్మయపురుషుని యందు జ్యోతిర్మయ స్ర్తి రూపధారిణి- మహేశ్వరి నాలుగవ రూపముగను, ఆ పిమ్మట సూర్యుని యందు మానవ హృదయములందు వేర్వేరుగా ఉమాదేవియై ఉన్నది. ఈ విధముగా ఉమాదేవి ఆరు రూపములతో విరాజిల్లుతున్నది. ఈ విధముగా ఉమాదేవి మొదటి మూడు రూపములు సృష్టికి ముందువనియు, తరువాతి మూడు రూపములు సృష్టికి అనంతరము ఉన్నవని గణపతిముని తెలిపారు. శ్రీరామకృష్ణ పరమహంస, కబీరుదాసు వంటివారు ఈ హృదయకాశము, మన దేహమునందు భౌతికముగా ఉండే గుండెకు దగ్గరగా ఎడమ వైపునే దాని స్థానమని చెప్పియున్నారు. పతంజలి మహర్షి యోగదర్శనమునందును, 15వ, 16వ శతాబ్దులలో వెలువడిన ‘హఠయోగ ప్రదీపిక’ యందును ఈ హృదయాకాశమును మన ఛాతీ మధ్యనే హృదయకేంద్రానికి స్థానాన్ని నిర్దేశించి, దానిని అనాహతచక్రము అని వ్యవహరించారు. అనేకమంది యోగులకు స్వతసిద్ధంగానే ఉత్తేజితమైన కేంద్రము కూడా అనాహత చక్రమేనని తెలిపియున్నారు. ఈ విధంగా వేరువేరు గురువులు, వేరువేరు గ్రంథములు హృదయకేంద్రమునకు వేరు వేరు స్థానము చెప్పడము జరిగింది.
ఏకాగ్ర ధ్యాన సమయములో సాధకులకు ఈ హృదయాగములో తప్పకుండా నిశ్చలంగా కనిపించే తెల్లటి రంగు కాంతి క్రమంగా కెంపువనె్నగా మారుతుంది. అటుపిమ్మట దట్టమైన ఊదారంగుగా పరిణమిస్తుందని యోగులు తెలిపియున్నారు. కనుక పరమాత్మ ప్రేమ ఎల్లలు లేనిది. పరిపూర్ణమైనది. ఈ విధముగా యోగులు హృదయకాశము ద్వారా క్రమంగా ఆత్మ విద్యను కరతలామలకం చేసుకొని అనుభవములోకి తెచ్చుకుంటారు.

- వేదాంతం ఉపేంద్ర శర్మ