రాష్ట్రీయం

జల్లికట్టుతో ‘హోదా’కు పోలికా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జనవరి 23:ప్రత్యేక హోదాకు జల్లికట్టుతో పోలికేమిటో అర్థంకావడం లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. తమిళనాడు జల్లికట్టు తరహాలో హోదా కోసం ఆందోళనకు సిద్ధమవ్వాలని కొన్ని పార్టీలు నిర్ణయించడంపై అసహనం వ్యక్తం చేశారు. వెలగపూడి సచివాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జల్లికట్టు అన్నది ఒక ఆట అని, దాన్ని చూసేందుకు విదేశీయులు వస్తుంటారని తెలిపారు. అది తమిళనాడులో పర్యాటకానికి సంబంధించిన అంశమన్నారు. హోదాతో దానికి పోలిక లేదన్నారు. ప్రత్యేక హోదా బదులు ప్యాకేజీ ఇస్తామంటే అన్నీ ఆలోచించి నిర్ణయం తీసుకున్నానని స్పష్టం చేశారు. ప్యాకేజీతో వచ్చే లాభాలేమిటని రాజకీయ పార్టీలను అడిగితే ఒక్కరూ చెప్పలేదని, కనీసం పత్రికలకైనా చెప్పాలన్నారు. పోలవరం నిర్మాణ బాధ్యతలకు ఎందుకు ఒప్పుకున్నారని ప్రశ్నిస్తున్నారని, కానీ కేంద్రం వద్ద అనేక ప్రాజెక్టులు ఉంటాయని, ఆ మహాసముద్రంలో ఇదీ ఒకటవుతుందన్నారు. నిర్మాణ బాధ్యతల్ని రాష్ట్ర ప్రభుత్వం నెత్తికెత్తుకోవడంతోనే జీవనాడి అయిన ఈ ప్రాజెక్టు సాకారం కానుందన్నారు. రాష్ట్ర విభజన సమయంలో తీరని అన్యాయం చేసిన నేతలు తనకు ఇప్పుడు లేఖలు రాయడం విచిత్రంగా ఉందని విమర్శించారు. తన పాలన గురించి మాట్లాడేవారికి కనీసం సర్పంచ్‌గా అయినా పనిచేసిన అనుభవం ఉందా? అని ప్రశ్నించారు. ఒకరికి దొంగలెక్కలు రాయడంలో, కొందరికి నేరాలు చేయడంలో అనుభవం ఉందన్నారు. కొందరికి కులాలు, మతాల పేరిట చిచ్చుపెట్టడం పనిగా మారిందని విమర్శించారు. హోదాకోసం ఆందోళన విషయంలో యువత బాధ్యతగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు.