ఆంధ్రప్రదేశ్‌

బ్యాంకుకు బేడీలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యాడికి, జనవరి 24: బ్యాంకు సిబ్బంది నిర్లక్ష్యానికి పరాకాష్టగా నిలిచిన సంఘటన ఇది. పనివేళలు ముగిసిన అనంతరం బ్యాంకుకు తాళం వేయకుండా వెళ్లిపోయారు అనంతపురం జిల్లా యాడికిలోని సిండికేట్ బ్యాంక్ సిబ్బంది. అర్ధరాత్రి పెట్రోలింగ్ నిర్వహిస్తున్న ఎస్‌ఐ ఇది గమనించి వెంటనే తన వద్ద బేడీలు వేసి సిబ్బందికి ఉదయం కబురుపెట్టారు. వివరాలు ఇలా ఉన్నాయి. యాడికి మెయిన్‌బజార్‌లో ఓ అద్దె భవనంలో సిండికేట్ బ్యాంక్ నిర్వహిస్తున్నారు. సోమవారం సాయంత్రం బ్యాంకు పనివేళలు ముగిసిన అనంతరం చివర వచ్చే సిబ్బంది తాళాలు వేస్తారని ఎవరికి వారు వెళ్లిపోయారు. తలుపులు తెరిచి ఉండడం, పోపల విద్యుత్ దీపాలు, ఫ్యాన్లు తిరుగుతుండడంతో నోట్ల రద్దు నేపధ్యంలో సిబ్బంది రాత్రికూడా పని చేసుకుంటున్నారని భావించి అటుగా వెళ్లేవారు ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. విధి నిర్వహణలో భాగంగా యాడికి ఎస్‌ఐ కత్తి శ్రీనివాసులు సిబ్బందితో కలిసి పట్టణంలో గస్తీ నిర్వహిస్తూ అర్ధరాత్రి అటుగా వచ్చాడు. సిండికేట్ బ్యాంక్ తలుపులు తెరచి ఉండడం, లోపల విద్యుత్ దీపాలు, ఫ్యాన్లు తిరుగుతుండడంతో అనుమానం వచ్చి చూశారు. సిబ్బంది ఎవరూ లేకపోవడంతో ఆయన అవాక్కయ్యారు. వెంటనే బ్యాంక్ మేనేజర్‌కు నాలుగైదు సార్లు ఫోన్ చేసినా ఆయన స్పందించలేదు. దీంతో చేసేది లేక బ్యాంక్ ప్రధాన తలుపు, బయట జాళీ గేట్‌కు తన వద్ద ఉన్న సంకెళ్లు వేశాడు. మంగళవారం ఉదయం 8 గంటలకు మేనేజర్ దుర్గాప్రసాద్ ఫోన్‌లో మిస్డ్‌కాల్స్ చూసుకుని ఎస్‌ఐ కత్తి శ్రీనివాసులుకు ఫోన్ చేయడంతో ఆయన జరిగింది చెప్పాడు. వెంటనే మేనేజర్ సిబ్బంది హుటాహుటిన బ్యాంకు వద్దకు చేరుకున్నారు. పోలీసుల సమక్షంలో బేడీలు తొలగించి లోపలికి వెళ్లి పరిశీలించారు. ఎవరూ లోపలకి వచ్చిన ఆనవాళ్లు లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఈ సందర్భంగా మేనేజర్ దుర్గాప్రసాద్ మాట్లాడుతూ తాను సోమవారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ఖాతాదారులను కలిసేందుకు వెళ్లి అటునుంచి అటు ఇంటికి వెళ్లానన్నారు. ఫీల్డ్ ఆఫీసర్ రాకేష్‌తో పాటు మరో ఇద్దరు బ్యాంక్ సిబ్బంది విధుల్లో ఉన్నారన్నారు. కడుపునొప్పి రావడంతో రాకేష్ బయటకు వెళ్లాడని, ఇది గమనించక మిగిలిన ఇద్దరు ఇంటికి వెళ్లినట్లు విచారణలో తేలిందన్నారు. మామూలుగాసాయంత్రం 5.30 గంటలకు బ్యాంక్‌కు తాళాలు వేస్తామన్నారు. కాగా ఈ సంఘటనపై బ్యాంక్ ఎజిఎం పాణిగాయి, ఆర్‌ఓ సుధాకర్, సిఎం కోడండరామిరెడ్డి సిబ్బందిని విచారించారు. ల బ్యాంకు సిబ్బంది మరీ ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం పట్ల స్థానికులు ముక్కున వేలేసుకుంటున్నారు.

చిత్రం..బ్యాంక్ ప్రధాన ద్వారానికి బేడీలు వేసిన దృశ్యం