తొలి సబ్‌మెరైన్ సినిమా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రానా, తాప్సీ, కె.కె.మీనన్, అతుల్ కులకర్ణి, నాజర్ తదితరులు ప్రధాన తారాగణంగా మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్, పివిపి సినిమా సంయుక్తంగా సంకల్ప్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘ఘాజీ’. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో నిర్మించిన ఈ సినిమా ఫిబ్రవరి 17న విడుదలవుతోంది. ఈ సందర్భంగా పాత్రికేయులతో దగ్గుబాటి రానా మాట్లాడుతూ,‘ముందుగా ఈ సినిమాకు సంబంధం లేని వ్యక్తి రామ్మోహన్‌కి కృతజ్ఞతలు చెప్పాలి. లోయర్ ట్యాంక్‌బండ్‌లో సబ్‌మెరైన్ సెట్ వేశారని ఆయన చెప్పగానే నేను వివరాలు సేకరించాను. అప్పుడు ఆ సెట్ ఘాజి అనే సినిమా కోసం వేశారని తెలిసింది. తర్వాత నేను ఘాజీ గురించి చదివాను. నేను ఈ సినిమాలో నటిస్తానని సంకల్ప్‌ను కలిశాను. ఈ సినిమా చేసే సమయంలో నాకు పరిచయం వున్న స్నేహితులు, కొంతమంది నిర్మాతలు ఏ సినిమా చేస్తున్నావని అడిగినప్పుడు ‘సబ్‌మెరైన్ సినిమా చేస్తున్నాన’ని చెబితే నన్ను పిచ్చోణ్ణి చూసినట్టు చూసేవారు. విశాఖ ఆర్‌కె బీచ్‌లో ఘాజీ సబ్‌మెరైన్‌ను చాలాసార్లు చూశా. దాని గురించి వివరాలు చాలామందికి తెలియదు. అతుల్ కులకర్ణి, కె.కె.మీనన్‌లు కేవలం నటులుగానే కాకుండా ఈ సినిమా విషయంలో రచయితలుగా కూడా సహకారాన్ని అందించారు. కరణ్‌జోహార్, టాండన్ ఈ సినిమాను హిందీలో రిలీజ్ చేయడానికి ముందుకు వచ్చారు. అమితాబ్ బచ్చన్ టీజర్ చూసిన తర్వాత వాయిస్ ఓవర్ చెప్పడానికి ఒప్పుకున్నారు. టీజర్ విడుదలైన రెండు గంటల్లోనే రెండు కోట్లమంది చూశారంటే సినిమా కోసం ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి సినిమాలో నటించే అవకాశం రావడం అరుదు, నిర్మాతలు ఓ క్వాలిటీ సినిమాను చేయడానికి ఒక్కటయ్యారు. భవిష్యత్తులో ఇలాంటి సినిమాలకు ఘాజీ నాంది పలుకుతుందని భావిస్తున్నా..’ అన్నారు. సంకల్ప్ మాట్లాడుతూ- ‘నా ఐడియాను నమ్మి ఈ సినిమా చేయడానికి నిర్మాతలు ముందుకువచ్చారు. రానా చేరికతో సినిమా రేంజ్ మరింత పెరిగిందన్నారు.
నిర్మాత ప్రసాద్ వి.పొట్లూరి మాట్లాడుతూ,‘- గతేడాది విడుదలైన క్షణం సినిమాను ప్రేక్షకులు ఎంతగానో ఆదరించారు. చాలా సినిమాలు చేసినా, ఘాజీని నిర్మించడం గర్వంగా ఉంది. తెలుగులోనే కాదు, ఇండియన్ సినిమాలోనే ఎవరూ టచ్ చేయని సబ్జెక్ట్ ఇది. రానా, తాప్సీ, సంకల్ప్, అతుల్‌కులకర్ణి, కె.కె.మీనన్, నాజర్ వంటి నటులతో ‘ఘాజీ’పై అంచనాలు పెరిగాయి’ అన్నారు.