డైలీ సీరియల్

ఎండిపోతున్న కాశ్మీరీ చినారులు.. 32

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మూలం:మధు కాంకరియా తెలుగు సేత : టి.సి.వసంత
**
ఈ వార్త తెలిశాక బత్రా సాహెబ్ తన యూనిట్‌ని మూడు భాగాలుగా చేసాడు. అందరికీ వేరు వేరుగా వాళ్ళ స్థానానికి వెళ్లిపొమ్మని ఆజ్ఞ ఇచ్చాడు. ఎందుకంటే ఇట్లా చేస్తే ఎవరికీ మేం పెద్ద ఆపరేషన్‌కి బయలుదేరాము అన్న అనుమానం రాదు. ఇటువంటి పెద్ద పెద్ద ఆపరేషన్ల సమయంలో కార్యకలాపాలని రహస్యంగా ఉంచడం ముఖ్యం. మేము వందమంది సైనికులు, పనె్నండుమంది ఆఫీసర్లు నడిచి మహానిష్ కొండకి చేరుకున్నాము. సాయంత్రం అయింది. దాదాపు 13 మంది ఉగ్రవాదులు కొండనెక్కుతున్నారు. మేం వాళ్ళని చూస్తూ ఉండిపోయాను. కొంచెం సేపయ్యాక వాళ్ళు అలసట తీర్చుకోవడానికి ఒక రాయిమీద కూర్చున్నారు. అప్పుడు మేం ఫైరింగ్ చేయడం మొదలుపెట్టాము. ఆపరేషన్‌లో మొట్టమొదట ఫైరింగ్ ఎవరు చేస్తారు అన్న విషయానికి ప్రాముఖ్యత ఉంటుంది. మొదటి రెండు మూడు క్షణాలు ఎవరైతే తనను తను సంబాళించుకుంటారో వాళ్ళే గెలిచినట్లు. ఫైరింగ్ శబ్దం వినిపించగానే వాళ్ళు నక్కి నక్కి కూర్చున్నారు. ఇక రెండు వైపులనుంచి ఫైరింగ్ మొదలయింది. ఈ ఆపరేషన్ దాదాపు ఏడు రోజుల దాకా నడిచింది. కమాండింగ్ ఆఫీసరు కర్నల్ బత్రాకి ఎంతో అనుభవం ఉంది. ఆయన మమ్మల్ని మిలిటెంట్ల దాకా వెళ్ళకుండా ఆపేవాడు. ఏడు రోజులు మేం స్నానం చేయలేదు. తిండి మాత్రం కొండ కింద నుండి సప్లై అయ్యేది. మేం లాకెట్ లాంచర్‌ని కొట్టి కొట్టి ఆ రాయినే పడదోసాము. మేం వాళ్ళ దగ్గర నుండి 2000 మీటర్ల దూరంలో ఉన్నాము. ప్రతీ గ్రూపులో ముగ్గురు నిద్రపోయేవాళ్ళు. ఇద్దరు మేల్కొనేవాళ్ళు. తరువాత మేము ఫ్లేమ్ ధ్రోయర్‌ని విసిరాము’’.
‘‘ఫ్లేమ్ థ్రోయర్ అంటే ఏమిటి?’’
‘‘గురి చూసి దీనిని వదులుతాము. లక్ష్యంపైన పడగానే దీనిలో నుండి నిప్పు బయటకి వస్తుంది. సర్! ఈ విధంగా ఆ రాతి బండను పడదోసాము. చివరికి 24 గంటలలలో అటువైపు నుండి ఏ గుళ్ళూ పేలిన శబ్దాలు వినిపించలేదు. వాళ్ళు చనిపోయి అయినా ఉండాలి లేకపోతే వాళ్ళ దగ్గర ఉన్న మందుగుండు సామాను అయిపోయి అయినా ఉండాలి.
మేం అక్కడికి వెళ్ళి చూస్తే 18 సం. నుండి 30 సం.ల వయసుగల యువకుల శరీరాలు అగ్గివలన కొంత కాలిపోయాయి. ఎర్రగా బుర్రగా ఉన్నారు. ఎక్కువగా అందరూ జీన్స్ ధరించి ఉన్నారు. ఒకరిద్దరు పఠాన్ సూట్ వేసుకుని ఉన్నారు. వాళ్ళ దగ్గర ఎ.కె.47, ఒక శాటిలైట్ ఫోను దొరికాయి. ఆ శవాల పక్కన నిల్చుని మేం అందరం ఫొటోలు దిగాం. మీడియాని పిలిచాము. వాళ్ళకి చూపించాము. ఆ తరువాత పోలీసులకు అప్పగించాము’’.
సైనికుడు చెబుతున్నంతసేపు సిద్ధార్థ నోరు తెరుచుకుని విన్నాడు. తెలియని భయం బిగుసుకుపోయాడు. ‘బాప్ రే, తన అన్నయ్య ఎంత భయంకరమైన, అపాయకరమైన లోకంలో ఉన్నాడు.
క్వార్టర్‌కి వెనక్కి తిరిగి వచ్చాక కూడా సిద్ధార్థ స్థిమితంగా ఉండలేకపోయాడు. ఇప్పటివరకు ఇంకా అన్నయ్య రాలేదు. లాండ్‌లైన్‌కి ఎన్నోసార్లు ఫోను చేశాడు. ఇంకా సాహెబ్ రాలేదు అన్న జవాబే వచ్చింది. చివరికి మళ్ళీ తన పళ్ళపొడి, నూనె, సబ్బుల లోకంలోకి వచ్చాడు. ఈసారి టార్గెట్‌ని ఎచీవ్ చేయలేకపోయాడు. అందువలన కలలో అందమైన వాళ్ళు కాక సేల్స్ మాత్రమే కనిపిస్తుంటాయి. తన నెట్‌వర్క్‌ని ఏ విధంగా పెంచాలి? కోకోలాలా దేశం నలుమూలలా తమ ప్రోడక్టులు ఎట్లా చేరుతాయి? ఏ మాత్రం సమయం దొరికినా కంజ్యూమర్ సైకాలజీ పుస్తకాలు చదువుతూ వుంటారు. కస్టమర్ల సైకాలజీని అర్థం చేసుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. నిజానికి కస్టమర్ల సైకాలజీ ఎంతో విచిత్రమైనది. ఒకప్పుడు కుగ్రామాలలో కూడా లైఫ్‌మాన్ అంటేనే సబ్బు అన్న అభిప్రాయం ఏర్పడ్డది. ఎన్నో సంవత్సరాలు ఈ సబ్బు రాజ్యం చేసింది. కంపెనీ వాళ్ళు దీని రంగుని మార్చారు. ఎర్ర రంగుని పింక్‌లోకి మార్చారు. అంటే అప్పటి నుండే ఈ సబ్బుల వాడకం పూర్తిగా తగ్గిపోయింది. తరువాత రీసెర్చ్ రిపోర్టు వలన తెలిసిందేమిటంటే గ్రామప్రజలు సబ్బుని ‘లైఫ్‌మన్’ పేరున కాకుండా ఎర్ర రంగు సబ్బుకి అలవాటుపడ్డారు. వాళ్ళు దీన్ని ఎర్రరంగు సబ్బే అని అనేవారు. కొత్త అలంకరణతో లైఫ్‌మాన్ వచ్చింది కాని వాళ్ళందరు ఇది ఎర్రరంగు సబ్బుకి నకిలీ అన్న అనుమానంతో ఈ సబ్బుని కొనడం మానేశారు.
సిద్ధార్థ ప్రసిద్ధి చెందిన బ్రాండ్‌లకు సంబంధించిన ఒక ప్రెజెంటేషన్ తయారుచేయాలి. లైఫ్‌మాన్ నుండి ఫైన్ అండ్ లవ్‌లీ వైపు అతడి ధ్యానం మళ్లింది. దక్షిణ భారతంలో దీని విక్రయం ఎక్కువ. ఈమధ్య కంపెనీ వాళ్ళు ఒక సర్వే చేయించారు. ప్రతి వర్గానికి చెందిన మహిళలతో ఇంటర్య్వూలు తీసుకున్నారు. మీరు ‘ఫైన్ లవ్‌లీ’ని ఎందుకు ఉపయోగిస్తారు అన్న ప్రశ్న వేశారు. సిద్ధార్థ పైఅఫీషియల్స్‌తోపాటు క్లోజ్ సర్క్యూట్‌పైన చూస్తున్నాడు. చాలామంది సౌందర్యం ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది కాబట్టి ఫైన్ అండ్ లవ్‌లీని వాడతాము అని మహిళలు చెప్పారు. వినగానే అందరం ఆశ్చర్యం చెందారు. ఆ రాత్రి ఇంట్లో పనిచేసే పనిమనికి ఆమెకి ఫైన్ అండ్ లవ్‌లీ గురించి తెలుసా అని అడిగాడు- ఫైన్ అండ్ లవ్‌లీ రాసుకుంటాను కాని ప్రతిరోజూ కాదు, కేవలం దుర్గపూజ రోజునే అని సమాధానం చెప్పింది. ఓ బ్రాండ్.. ఇట్లాగే జీవించు. అన్ని బ్రాండ్‌లు ఈ విధంగానే అందరికి ప్రియం అవుతాయి. తన రిపోర్టులో లీనమైపోయాడు సిద్ధార్థ. పది పదిహేను నిమిషాలయ్యాక అతడికి ఆశ్చర్యం కలిగింది. ఎవరో మాట్లాడుతున్నారు. ఒక్కసారిగా చప్పుడు పెరిగింది. టివి మూసేయలేదా? అతడు లేచాడు. టివిని చెక్ చేశాడు. టివి మూసే ఉంది. మరి ఎవరు? అప్పుడే బాత్‌రూమ్ నుండి అన్నయ్య దగ్గర పనిచేవాడు బయటకు వచ్చాడు.

- ఇంకా ఉంది

టి.సి.వసంత