పూర్తి కావస్తున్న త్రిపుర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్వాతి ప్రధాన పాత్రలో క్రేజీ మీడియా పతాకంపై రాజకిరణ్ దర్శకత్వంలో ఎ.చినబాబు, ఎం.రాజశేఖర్ రూపొందిస్తున్న ‘త్రిపుర’ చిత్రానికి సంబంధించిన షూటింగ్ తుది దశకు చేరుకుంది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ ‘ఈనెల 15నుండి ముగింపు సన్నివేశాల చిత్రీకరణ జరుపుతున్నామని, నెలాఖరువరకు ఈ షెడ్యూల్‌లో రెండు పాటలు మినహా సినిమా పూర్తివుతుందని’ తెలిపారు. వచ్చేనెల మొదటివారంలో పాటల చిత్రీకరణలో భాగంగా ఒకటి స్వాతి ఇంట్రడక్షన్ పాటను తమిళనాడులోని కుట్రాంలో, మరొకటి పొల్లాచ్చి, కొడైకెనాల్‌లోను చిత్రీకరించనున్నామని తెలిపారు. హారర్, థ్రిల్లర్ మూవీగా రూపొందిస్తున్న ఈ చిత్రంలో త్రిపుర పాత్రకు స్వాతి వందశాతం న్యాయం చేసిందని, మరో పాత్రను పూజారామచంద్రన్ నటిస్తోందని, దర్శకుడు చెప్పిన కథను అద్భుతంగా తెరపై ఆవిష్కరించనున్నారని ఆయన అన్నారు. కథ డిమాండ్ మేరకు ఎక్కడా రాజీపడకుండా నిర్మిస్తున్నామని ఆయన తెలిపారు. బలమైన కథనంతో చేస్తున్న ఈ చిత్రంలో త్రిపుర ఏం చేస్తుంది అనేది ప్రస్తుతానికి సస్పెన్స్‌గా ఉంటుందని దర్శకుడు తెలిపారు. ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే: కోన వెంకట్, శ్రీనివాస్ వెలిగొండ, మాటలు: రాజా, కెమెరా: రవికుమార్ సానా, ఎడిటింగ్: ఉపేంద్ర, నిర్మాతలు: ఎ.చినబాబు, ఎం.రాజశేఖర్, దర్శకత్వం: రాజకిరణ్.