జయంత్ హిట్ కొట్టాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జయంత్, శే్వతాబసు ప్రసాద్, గీతాంజలి హీరో హీరోయిన్లుగా సతీష్‌కుమార్.ఎం.వి. దర్శకత్వంలో గోదావరి సినీ టోన్ పతాకంపై లక్ష్మీప్రసాద్, కంటె వీరన్న చౌదరి నిర్మిస్తున్న ‘మిక్చర్‌పొట్లం’ చిత్రంలోని పాటలు హైదరాబాద్‌లో విడుదలయ్యాయి. మాధవపెద్ది సురేష్ చంద్ర సంగీతం అందించిన ఈ పాటల సీడీని ప్రముఖ నటుడు, ఎం.పి మురళీమోహన్ ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడారు. ‘నేను రాజమండ్రి ఎంపిగా బాధ్యతలు చేపట్టిన ప్రాంతంనుండి ముగ్గురు మంచి నిర్మాతలు సినిమా చేయడం ఆనందంగా వుంది. మంచి కథ, కథనాలతో దర్శకుడు సతీష్ చక్కని సినిమా తీశాడు. మాధవపెట్టి సురేష్ సంగీతం అందించాడంటే ఆ పాటలు ఎలా వుంటాయో చెప్పాల్సిన అవసరం లేదు. భానుచందర్ కుమారుడు జయంత్‌కు ఈ సినిమా మంచి హిట్ అందించాలి. అలాగే రాష్ట్ర విభజన నేపథ్యంలో 2012 నుంచి నంది అవార్డులను అందించలేకపోయాం. ఆ అవార్డులను త్వరలోనే అందిస్తాం. తెలంగాణ రాష్ట్రంలో కూడా నంది పేరు స్థానంలో వేరే పేరుతో ముఖ్యమంత్రి కె.సి.ఆర్. అవార్డులు ఇవ్వడానికి ప్రయత్నాలు చేస్తున్నారు’ అని అన్నారు. ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ- ‘అప్పుడు భానుచందర్‌కు, ఇప్పుడు వాళ్ల అబ్బాయికి పాటలు పాడడం ఆనందంగా వుంది. మంచి కథతో దర్శక నిర్మాతలు చేస్తున్న ఈ ప్రయత్నం విజయవంతం అవ్వాలి. మాధవపెద్ది సురేష్ నేటి యువతరానికి తగ్గట్టుగా పాటలను అందిస్తున్నారు’ అన్నారు.
దర్శకుడు సతీష్ మాట్లాడుతూ ‘చక్కని కామెడీ ఎంటర్‌టైనర్ ఇది. నిజ జీవితంలో మనకు ఎదురయ్యే పాత్రలు ఎలా వుంటాయో ఈ సినిమాలో కూడా అలాంటి పాత్రలే కనిపిస్తాయి. నవరసాలు వున్న సినిమా ఇది. మిక్చర్‌పొట్లాం టైటిల్ వినగానే అందరూ నవ్వారు. అలాగే సినిమా చూసిన ప్రతి ఒక్కరూ నవ్వుతారు’ అన్నారు. హీరోయిన్ శే్వతాబసు మాట్లాడుతూ- ఈ సినిమాలో అన్నిరకాల పాటలున్నాయని, మంచి కథ, జయంత్ కొత్తవాడైనా బాగా నటించాడని, ఈ సినిమాతో మా అందరికీ మంచి పేరు వస్తుందని అన్నారు.