Others

ముంజేతి అందాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హాలీవుడ్, బాలీవుడ్ భామలు ధరిస్తున్న బ్రేస్‌లెట్స్ నేటి కొత్త ఫ్యాషన్ ట్రెండ్‌గా మారాయి. యువతులు గాజులకు బదులుగా ఒక చేతికి వెరైటీ మోడళ్ల బ్రేస్‌లెట్‌ను ధరించి మైమరచిపోతున్నారు. కలర్‌ఫుల్‌గా ఉండే బ్రాడ్ బ్రేస్‌లెట్‌లు యువతులను ఆకట్టుకుంటున్నాయి. అందరి దృష్టిని తన వైపునకు తిప్పుకునే ఈ బ్రేస్‌లెట్లు సమ్‌థింగ్ స్పెషల్‌గా తయారయ్యే బ్రేస్‌లెట్లు మగువలను మరింత అందంగా కనిపించేటట్టు చేస్తాయి. అందరూ ఖరీదైన గోల్డ్, సిల్వర్ బ్రేస్‌లెట్లను కొనుగోలు చేయలేరు. దీన్ని దృష్టిలో పెట్టుకొని జ్యూయలరీ డిజైనర్లు మెటల్, ఉడ్‌తో బ్రాడ్ బ్రేస్‌లెట్లను తయారుచేస్తుండడం విశేషం. ఈ రకం బ్రాస్‌లెట్లను కళాశాలలకు వెళ్లే ఫ్యాషన్ చిహ్నంగా భావిస్తుండడం విశేషం. ఇక మన దేశానికి చెందిన వెరైటీ డిజైన్ల గోల్డ్, సిల్వర్ బ్రేస్‌లెట్లకు అంతర్జాతీయ మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉండడం విశేషం. వీటిలో గోల్డ్ ఫ్లేటెడ్ వాటికి సైతం మంచి ఆదరణ ఉంది. రకరకాల బ్రేస్‌లెట్లను వెరైటీ డిజైన్లలో రూపొందిస్తున్నారు. ఇవి గోల్డ్, సిల్వర్, డైమండ్, కలర్‌స్టోన్స్ సఫైర్, ఎమ్‌రాల్డ్, రూబీలతో అందంగా తయారవుతున్నాయి. ఇక మన దేశ డిజైన్లలో తయారయ్యే బ్రేస్‌లెట్‌లను కుందన్ డిజైన్లలో ప్రత్యేకంగా రూపొందిస్తున్నారు. సృజనాత్మక డిజైన్లతో యువతులను మైమరపిస్తున్నాయి. బ్రాస్‌లెట్లు వాటి తయారీని బట్టి వివిధ రేట్లలో లభ్యమవుతున్నాయి. వీటిని ఖరీదైన మెరిసే స్టోన్స్‌తో జ్యూయలరీ డిజైనర్లు అత్యంత ఆకర్షణీయంగా రూపొందిస్తున్నారు. ఇక గోల్డ్‌లో ఎథ్నిక్ డిజైన్లతో తయారవుతున్న బ్రేస్‌లెట్లు ఎప్పటికీ వనె్న తరగని విధంగా రూపుదిద్దుకుంటున్నాయి. అమెరికా, యూరప్ దేశాల్లో ఖరీదైన ఇండియన్ గోల్డ్ బ్రేస్‌లెట్లను ఎక్కువగా ఇష్టపడుతున్నారు. పెద్ద సైజుల్లో ఆకర్షణీయంగా తయారయ్యే బ్రాడ్ బ్రేస్‌లెట్లను ధరిస్తే ఇతర బంగారు ఆభరణాలను ధరించకపోయినా యువతుల ఆకర్షణ ఏ మాత్రం తగ్గదు.

- తరిగొప్పుల విఎల్లెన్ మూర్తి