మెయన్ ఫీచర్

మార్కెట్ మాయాజాలంలో సగటు జీవి..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘అబ్బా! ఆ ఏనుగును కొనుక్కుందాం...! 50 శాతం డిస్కౌం ట్ మళ్ళీరాదు...’, ‘నీకెమన్నా పిచ్చా...? మనకెందుకు ఏనుగు...?’ అనే ఈ కార్టూను డైలాగును చాలా సందర్భాలలో జ్ఞాపకం చేసుకుంటూ వుంటాం! అయినా మన ఆలోచనల్లో ఏమైనా మార్పువచ్చిందా.... వస్తుందా...? అనేది తేలని ప్రశ్ననే! ‘ఏ కొనుగోలు చేయకున్నా మా నూతన షోరూంను దర్శించే జంటలకు ఆశ్చర్యకరమైన బహుమతులు..’ భార్యా, భర్తలమధ్య గల వైరుధ్యాల్ని సొమ్ముచేసుకోవడం వీరికి తెలిసినంతగా మరెవరికి తెలియదు. ఇలా దర్శించిన జంటలు ఉత్తపుణ్యానికి బహుమతి తీసుకోకుండా, ఏదో ఒక వస్తువును కొనకమానరని వారి ఆలోచన! కేవలం ఒక్క రూపాయే చెల్లించండి! రూ.26,990ల నుంచి లభించే ఎయర్‌కండిషనర్ స్వంతం చేసుకొండి. ప్రారంభ ఆఫర్‌గా రూ.59,990 విలువ చేసే ఎల్‌ఇడి టీవి కేవలం రూ.29,990లకే!.... సున్నా శాతం వడ్డీ. అతి తక్కువ నెలసరి వాయిదాలు. బంపర్ ఆఫర్స్. రూ.5 కోట్ల విలువైన బహుమతులు. రూ.75 లక్షల నగదు ప్రోత్సాహకాలు. ప్రతి రెండు గంటలకు 20గ్రా. వెండినాణెం. ప్రతి కొనుగోలుపై ఒక ఆకర్షణీయమైన బహుమతి. రూపాయి కూడా చెల్లించకుండానే, (యళ్యూ జ్యూతీశ ఔ్ఘకౄళశఆ) వీ కారును స్వంతం చేసుకొండి. పైగా మూడు సంవత్సరాల వరకు వారంటీ, సర్వీసు మెయంటెనెన్స్, ఇన్స్యూరెన్స్, రోడ్డ్‌సైడ్ అసిస్టెన్స్‌లతో సహా, మూడు సంవత్సరాల తర్వాత 50 శాతం ధరతో తిరిగి కొనుగోలు.
ఇలా రోజూ మన మదిని దోచుకుంటూ, మతిని పోగొట్టే ప్రకటనలు చూసే టీవిల్లో చదివే పేపర్లో, రంగురంగుల బ్రోచర్లలో దర్శనమిస్తూ, మనను ఉక్కిరిబిక్కిరి చేస్తూనే వుంటాయి. అవసరంలేకున్నా కొనుక్కునేలా మన మనస్సులను ఒప్పిస్తాయి. అవసరానికి మించి కొని తెచ్చుకునేలా ఉసిగొలుపుతాయి. పిల్లల్ని, పెద్దల్ని, వృద్ధుల్ని కూడా వదలకుండా ఆ మహా మాల్స్ మనను లాగుతాయి. ఇలా రోజు లేచింది మొదలు, రాత్రి పడుకోకుండా, నిద్రలేమిని కల్గిస్తూ ఏడుకొండలవాడికన్నా ఎక్కువగా దోచుకోవడం ఈ మాల్స్ పనైతే, నిలువుదోపిడి చేసుకోవడం మనకు నిత్యకృత్యమైంది.
మొదటి 99 మంది కొనుగోలుదారులకు మూడు బెడ్‌రూంల అపార్ట్‌మెంటు కేవలం రూ.67 లక్షలకే. రెండు బెడ్‌రూంలది రూ.48 లక్షలకే! అనగా, అసలు ధరెంతో తెలియదుగాని, ఈ ఆఫర్ ధరలే అదిరిపోతున్నాయనేది అసలుకే అర్థంకాదు. సరిగ్గా మూడు నెలల క్రితం నగరంలో పేరుమోసిన ఓ నిర్మాణసంస్థ మేనేజింగ్ డైరెక్టర్‌ను 400 మంది కస్టమర్లను మోసంచేసాడనే ఆరోపణపై రామచంద్రాపురం పోలీసులు అరెస్టుచేసి సంగారెడ్డి జైలుకు పంపిన విషయం తెలియని కొత్త కస్టమర్లు ఆ వెంచర్లోనే కొనుగోలు చేస్తున్న వైనం. అయినా ప్రభుత్వం ఆ వెంచరును స్వాధీనం చేసుకోవడం గాని, సంబంధిత సంస్థపై మారటోరియం విధించడం గాని, చార్జిషీట్ పెట్టడం గాని చేయని వైనం. దీన్నిబట్టి ఆ వెంచర్ నిర్వాహకులకు, ప్రభుత్వానికిగల సాన్నిహిత్యాన్ని తెలుపుతున్నది. స్వంత ఇల్లు, అపార్ట్‌మెంటు అనే ఊహలలో ఉన్నది ఊడగట్టుకోవడం సర్వసాధారణమైంది.
మా ఉత్పత్తుల్ని కాస్టుటుకాస్టు కాకుండా అతి తక్కువకు, 50 శాతంకే అమ్ముతున్నాం. త్వరపడండి. రెండురోజులు మాత్రమే! చివరి రోజు మాత్రమే! కేవలం స్టాకు ఉన్నంతవరకే! ఫలానా బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డులు చెల్లుతాయి. అవసరం వున్నా, లేకున్నా తెరిచిన బ్యాంకు ఖాతాలు, అందమైన కార్డులు, సేవలు పొందుతున్నందుకు సేవా పన్నును (ఇప్పు డు 14%) పోగొట్టుకుంటున్న విషయం తెలియకుండానే అవసరంలేని వస్తువుల్ని తెచ్చుకుంటూ ఇంటిని, ఇంట్లోని ర్యాక్సును నింపేస్తూ మహదానందం పొందడం జీవితంలో ఓ భాగమైంది. సాఫ్ట్‌వేరు జీతాలు, లక్షల ప్యాకేజీలు ఎందుకిస్తున్నారో అర్థంచేసుకునే శక్తియుక్తులు మనకు అబ్బనే అబ్బవు. తెలిసిందల్లా...సరదా! జల్సా! చివరికి నెలసరి వాయిదాలు కట్టని స్థితి వస్తే కొన్న అపార్ట్‌మెంటును, కార్లను, మోటర్ సైకిల్‌ను, గృహోపకరణాల్ని వేలంవేయడం, లాక్కుపోవడం వారి వంతైతే, వస్తువుతోపాటు, కట్టిన వాయిదాల్ని కూడా కోల్పోయి, బిక్కమొఖం వేయడం వినియోగదారుడి వంతుగా మారింది. ఇలా బ్యాంకులు, షాపింగ్ మాల్స్, రియల్ ఎస్టేట్ వెంచర్లు కుమ్మక్కైన విషయం మన సున్నిత బుర్రలకు చస్తే అర్థంకాదు.
ఇక బ్యాంకుల మాయాజాలం అంతింత కాదు. భవిష్యత్ అంతా ఈ కార్డులోనే వుంది. ఎటిఎమ్‌లో పెట్టాల్సిన శ్రమ కూడా లేదు. తెర ముందు ఊపుతే చాలు. ఊపే కార్డుల్ని పరిచయం చేస్తున్నందుకు గర్వపడుతున్నాం అని పేపర్లో జాకెట్ ప్రకటనల్ని చూసి మురిసిపోవడం, వాటిని అందుకోవడం, ఆ బ్యాంకుతో సంబంధమున్న బిగ్‌బజార్, ఫాబినా ఇండియా, ఖదీమ్స్, పివిఆర్, స్పెన్సర్, స్టార్‌లుక్స్ లాంటి షాపింగ్ మాల్స్‌కు వెళ్ళడం ఓ ఫ్యాషన్ అయింది. ఇలా కలిసికట్టుగా దోచుకోవడం ఆధునికత కాగా, మనకిదో నాగరికతగా మారిపోయింది. అయినా మాల్స్‌కుపోని జనాలు కూడా వుంటారుగా! వారికోసమే ఇ- కామర్స్, షాపింగ్? ఏ మార్కెట్లకు పోవాల్సిన పనిలేదు. ఇంట్లోనే కూర్చోండి! కంప్యూటర్‌లో డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు లాగం డి! కోడ్ నెంబర్ నొక్కండి! మీ వివరాలు చెప్పండి! మీ ఇంటికే డెలివరి. పూట కూళ్ళమ్మ పనినే కాదు- మీ ఇంటి, వొంటి డిజైనే్ల మార్చివేసే పని మాది. ఇలా కాలు కదపకుండా, చిటకెలో పని జరుగుతుంది. ఒళ్ళు పెరిగితే, ఆడ, మగవారికి ప్రత్యేకమైన జిమ్ముల, ప్రత్యేక సమయాలు, ప్రత్యేక తగ్గింపు ధరలు...! మా ప్రత్యేకం! ఈ విధంగా ఎన్ని దిక్కుమాలిన ట్రిక్కులు చేస్తే అంతగా వ్యాపారం పేరున దోచుకోవచ్చనేది ఆయా కంపెనీల ధీమా అయితే, బిక్కమొఖంతో జేబుల్ని, బ్యాంకు బ్యాలెన్సును ఖాళీచేసుకోవడం జనం వంతైతున్నది.
ఓ వస్తువు అమ్మకం ధరలో అంతగా భారీ తగ్గింపు ఎందుకో ఆలోచించం. వాటి అసలు ధర ఎంతనో, నిజంగా అది నిజమైన ధరనేనా అనేది మన మస్తిష్కానికి అర్థంకాదు. మనకు తెలిసేదల్లా కొనుక్కోవాలనే దురద పెరగడమే! వాటిని వినియోగించాలనే ఆలోచన ముదరడమే! వన్‌ప్లస్ వన్, టుప్లస్ త్రీ... ఈ మాయదారి ఆఫర్లు గణిత టీచర్లకు కూడా అర్థవౌతాయో లేదో!
ఏ షాపింగ్ మాల్ చూసినా ఎకరాల్లో వుంటుంది. అందంగా అలంకరించిన వస్తువులతో, వంకరటింకర దారులతో మ్యూజియంలో వరుసగా వెళ్ళినట్లుగా నడుస్తూపోతే దాదాపు అన్ని వస్తువులు మనని ఆకర్షిస్తాయి. మనం చూడని వస్తువులు పలకరిస్తాయి. తాకి తరించండని ఆహ్వానిస్తాయి. అంతే! మనలో ఓ తెలియని విద్యుద్దావేశం ప్రవహిస్తుంది. భర్త కాకపోతే, భార్య లేదా పిల్లలు కొనాలని మారాం! అలా కొనాలని పోయింది ఒక వస్తువుకైతే, కొనుక్కునే వస్తువులెన్నో కౌంటర్ దగ్గరకు పోతేగాని తెలియదు. పైగా ఒక్కోరోజు ఒక్కో వస్తువు అతి చౌకగా అమ్మడంతో రోజు జనాన్ని షాపింగ్‌మాల్స్‌కు రప్పించడం వాటికి అవేసాటి. అలా వెళ్ళడం మనకు పరిపాటిగా మారింది! కొన్న వస్తువుల్ని, తినుబండారాల్ని ఇంట్లో, ఫ్రిజ్‌ల్లో నింపితేనే మనకు తృప్తి. మనం కొన్న వస్తువుల్ని ఇరుగు పొరుగు ముచ్చటపడి చూస్తే, వారిని కూడా కొనమని పురమాయిస్తే అదో సంతృప్తి!
కొన్నా, కొనకున్నా షాపింగ్ మాల్స్‌లో తిరగడంతో కాళ్ళు లాగడం, కడుపు కాలడం ఓ సహజ గుణం! అందుకే ఈ కోరికల్ని తీర్చేవిధంగా మధ్యమధ్యన ఫాస్ట్ఫుడ్ కౌంటర్లు, పావుబాజీలు, పానీపూరీలు, బర్గర్లు, ఐస్‌క్రీంలు, కూల్‌డ్రింక్‌లు అయస్కాంతంగా ఆకర్షిస్తాయి. అలా లాగించడం ఓ థ్రిల్! అప్పుడే ఓ స్వీట్ హస్బెంగ్‌గా, లలీ డాడీగా, డియర్ మమ్మిగా మారిపోతాం! ఇలా కొనుక్కోవాలని అనుకునేది ఒకటైతే, కొనేది మరొకటి కాగా, తినేది మాత్రం తప్పనిసరిగా మారుతుంది. ఈ విధంగా మార్వాడి పాత్రను నిర్వహించే బ్యాంకులు, హిప్నటైజ్ చేసే మాల్స్ ఒక్కటై మనకు నిలువునా దోస్తున్నా తెలియని మైకం మనది.
అయినా, అప్పుడప్పుడు ప్రభుత్వాలు మేల్కొంటాయి. దాడుల్ని నిర్వహిస్తాయి. ధరలకు, వస్తువులకు తేడాల్ని, జరిగే మోసాల్ని గుర్తిస్తాయి. బరువుల్ని తూకంవేసి, తెలిపిన బరువులేదని నిర్ధారిస్తాయి. నగలు, నట్రా చెప్పిన నాణ్యతతో లేవంటాయి. ఇవన్నీ చూసుకునే తెలివితేటలు మనకు లేవని తేల్చిచెపుతాయి. కిరాణ కొట్టులోనైతే, మనముందరే తూకం వేయడం, అదే రోజు ధరను చెప్పడం ఆనవాయితి. అలా అమ్మేవాడికి, కొనేవాడికి ఓ అనుబంధం వుంటుంది. మాల్స్‌లో అమ్మేవాడెవడో చచ్చినా తెలియదు. అన్నీ మాల్స్ బ్రాండ్‌తోనే! అన్ని మూసిన ప్యాకెట్లలోనే! తయారు తేదీ, బ్యాచి నెంబరు పైనని, కిందని, కనిపించి కనిపించని తీరు. చూసే ఓపిక, అర్ధంచేసుకునే తెలివి మన చదువుతో మనకు అబ్బకనే పాయే! ప్రమాణిత బరువు వుందా లేదా, తూకం వేయాలని గాని, తయారీ తేదీకి, ఎక్సైపైరీ తేదీకి గల సంబంధం గాని చూడడం మన వ్యక్తిత్వానికి ఓ నామోషి! ట్రాలీలో వేసుకోవడం, కౌంటర్లవద్ద బిల్లుచేసుకోవడం, వాడిచ్చిన క్యారీబ్యాగ్‌ల్లో నింపుకోవడం చేతుల్లో ఊపుకుంటు తెచ్చుకోవడం ఓ ఆధునిక జీవిత చిహ్నం!
ఈ అధునాతన జీవన విధానం మన ఇంటినే కాదు, ఒళ్ళును గుల్ల చేస్తున్నాయని, విషాన్ని నింపుతున్నాయని గ్రహిం చం. ఈ ఆడంబరాలకు, అలవాట్లకు తలొగ్గిన మనం, వీటికి దూరంగావుండే తల్లిదండ్రులో, బంధువులో వచ్చి ఆశ్చర్యపడితే ఓ అనాగరికులనే ముద్రవేయడం, ఈసడించుకోవడం, మానవ సంబంధాల్ని మంటగలపడం మన జీవితాల్లో భాగమైందనేది మనకు తెలియకుండానే చేరిపోయింది. వీటిలోనుంచి కోలుకుంటామా, ఇంకా కూలబడుతామా, బహుశా భవిష్యత్తులో కూడా తెలియకపోవచ్చు!