S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

03/31/2018 - 00:29

సిడ్నీ, మార్చి 30: ఒక ట్యాంపరింగ్ కేసు ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ ప్రతిష్ఠను దిగజార్చింది. అయితే, ఒకే ఒక ప్రెస్‌మీట్ మొత్తం పరిస్థితిని అతనికి అనుకూలంగా మర్చేసింది. మొన్నటి వాతావరణం నిన్న లేదు. నిన్నటి ఆగ్రహం నేడు లేదు. సీన్ మారిపోయింది. టాంపరింగ్‌పై మండిపడిన అభిమానులు మీడియా ఇప్పుడు స్మిత్ పట్ల సానుకూల ధోరణిని కనబరుస్తున్నారు.

03/30/2018 - 04:43

సిడ్నీ: కేప్ టౌన్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టెస్టు మ్యాచ్ మూడో రోజు చోటు చేసుకున్న బాల్ ట్యాంపరింగ్ ఉదంతం ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్సీని కోల్పోయిన స్టీవ్ స్మిత్‌ను తీవ్రంగా కుంగతీసింది. క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) ఆదేశాలతో స్వదేశానికి తిరిగి వచ్చిన స్మిత్ విమానాశ్రయంలో విలేఖరులతో మాట్లాడుతూ పలుమార్లు కన్నీళ్లు పెట్టుకున్నాడు. 3తప్పు చేశాను. నన్ను క్షమించండి.

03/30/2018 - 00:39

న్యూఢిల్లీ, మార్చి 29: న్యూజిలాండ్ క్రికెట్ కెప్టెన్ కేన్ విలియమ్‌సన్ ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు కొత్త కెప్టెన్‌గా నియమితుడయ్యాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన ఒక మ్యాచ్‌లో బాల్ ట్యాంపరింగ్ వివాదంలో చిక్కుకున్న ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్‌ను తప్పించడంతో అతని స్థానంలో విలియమ్‌సన్‌ను కెప్టెన్‌గా ప్రకటించినందుకు ఆనందంగా ఉందని సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ సీఈఓ షణ్ముగం తెలిపాడు.

03/30/2018 - 00:14

సిడ్నీ, మార్చి 29: బాల్ ట్యాంపరింగ్ నేరానికి పాల్పడిన దొరికిపోయిన ఆస్ట్రేలియా క్రికెటర్లపై ఆ జట్టు మాజీ కోచ్ మిక్కీ ఆర్థర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. గత కొంత కాలంగా ఆస్ట్రేలియా గౌరవానికి మచ్చ తెచ్చే పనులు ఆసీస్ క్రికెటర్లు చేస్తున్నారనడానికి ఇది ఒక ఉదాహరణ అని ఆయన పేర్కొన్నాడు.

03/30/2018 - 00:42

పెర్త్, మార్చి 29: బాల్ ట్యాంపరింగ్ విషయంలో తాను అబద్ధం చెప్పానని ఈ సంఘటన పాత్రధారి కామెరాన్ బాన్‌క్రాఫ్ట్ అంగీకరించాడు. దక్షిణాఫ్రికాతో మూడో టెస్టు జరుగుతున్నప్పుడు, మూడో రోజు ఆట సమయంలో అతను బంతి ఆకారాన్ని మార్చడానికి ప్రయత్నిస్తున్న దృశ్యం కెమెరాల్లో చిక్కింది.

03/30/2018 - 00:12

న్యూఢిల్లీ, మార్చి 29: ఐపీఎల్‌లో రాయల్ చాలేంజర్స్ బెంగళూరు, ఢిల్లీ డేర్ డెవిల్స్ మధ్య జరిగే రెండు మ్యాచ్‌ల వేదికలు మారాయి. కర్నాటక అసెంబ్లీ ఎన్నికల కారణంగా ఈ మార్పు చోటు చేసుకుంది. మే 12న కర్నాటకలో శాసనసభ ఎన్నికల పోలింగ్ జరుగనుంది. ఈ నేపథ్యంలో అదే రోజు బెంగళూరులోని చిన్న స్వామి స్టేడియంలో జరగాల్సిన మ్యాచ్‌ను మార్చాల్సిందిగా బీసీసీఐకి కర్నాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ (కేఎస్‌సీఏ) లేఖ రాసింది.

03/30/2018 - 00:49

సిడ్నీ, మార్చి 29: తన వల్ల యావత్ క్రికెట్‌పై చెరగని మచ్చ పడిందని బాల్ ట్యాంపరింగ్ సూత్రధారి, ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఆవేదన వ్యక్తం చేశాడు. చిన్నతనం నుంచీ తనకు క్రికెట్ అంటే ఎంతో అభిమానమని, అలాంటి క్రీడకు తనవల్ల చెడ్డపేరు వచ్చిందని వాపోయాడు. జీవితంలో మరచిపోలేని పొరపాటు చేశానని, ప్రస్తుత పరిస్థితుల్లో భవిష్యత్తుపై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేనని సోషల్ మీడియాలో పోస్టు వివరణలో స్పష్టం చేశాడు.

03/30/2018 - 00:09

జోహానె్సస్‌బర్గ్, మార్చి 29: ఆస్ట్రేలియాతో ఇటీవల జరిగిన ఒక మ్యాచ్‌లో చోటు చేసుకున్న బాల్ ట్యాంపరింగ్ యావత్ క్రికెట్‌ను దిగ్భ్రాంతికి గురి చేసిన నేపథ్యంలో, శుక్రవారం ప్రారంభమయ్యే నాలుగవ, ఆఖరి టెస్టు మ్యాచ్‌ని విజయంతో ముగింపు పలకాలని దక్షిణాఫ్రికా పట్టుదలతో ఉంది.

03/30/2018 - 00:45

ముంబయి, మార్చి 29: టీ-20 ముక్కోణపు సిరీస్‌లో వైఫల్యాల బాటలో నడుస్తూ ఫైనల్ చేరలేకపోయన భారత మహిళా క్రికెట్ జట్టు ఎట్టకేలకు ఓ విజయంతో పరువు నిలబెట్టుకుంది. ఇక్కడి బ్రబోర్న్ స్టేడియంలో జరుగుతున్న టీ-20లో భాగంగా గురువారం ఇంగ్లాండ్‌తో జరిగిన తన చివరి గ్రూప్ మ్యాచ్‌లో భారత్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి, ఊరట చెందింది.

03/29/2018 - 17:23

సిడ్నీ: బాల్ టాపరింగ్‌కు పూర్తి బాధ్యత తనదేనని ఆస్ట్రేలియా క్రికెటర్ స్టీవ్‌స్మిత్ అన్నారు. ఏడాది పాటు నిషేధానికి గురైన ఆయన స్వదేశానికి తిరిగి వచ్చిన తరువాత మీడియాతో మాట్లాడారు. సారధిగా విఫలమయ్యాయని అన్నారు. ఈ బాల్ టాపరింగ్ ఉదంతానికి జీవితాంతం చింతిస్తూ ఉంటానని కన్నీటిపర్యంతమయ్యారు. ఆటలో జరిగిన ప్రతిదానికి బాధ్యత నాదే అని అన్నారు. ఆస్ట్రేలియా అభిమానులకు, ప్రేక్షకులకు ఆయన క్షమాపణ చెప్పారు.

Pages