S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

08/29/2017 - 01:05

వచ్చే ఐదేళ్ల కాలానికి ఐపిఎల్ టోర్నమెంట్ మీడియా హక్కులను కేటాయించడానికి ప్రస్తుతం అనుసరిస్తున్న బిడ్స్ విధానాన్ని రద్దు చేసి, అదే స్థానంలో ఈ-ఆక్షన్ పద్ధతిని అమలు ప్రవేశపెట్టాలని బిసిసిఐని ఆదేశించడానికి సుప్రీం కోర్టు నిరాకరించింది. బిజెపి నాయకుడు సుబ్రహ్మణ్య స్వామి దాఖలు చేసిన పిటిషన్‌లోని మొదటి అంశాన్ని సుప్రీం కోర్టు ధర్మాసనం తిరస్కరించింది.

08/29/2017 - 01:03

న్యూఢిల్లీ, ఆగస్టు 28: క్రీడలను అన్ని రకాలుగా ప్రోత్సహిస్తామని భారత ఉప రాష్టప్రతి వెంకయ్య నాయుడు అన్నారు. సోమవారం ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో కేంద్ర క్రీడా శాఖ మంత్రి విజయ్ గోయల్‌తో కలిసి నేషనల్ స్పోర్ట్స్ టాలెంట్ సెర్చ్ పోర్టల్‌ను ప్రారతభించిన ఆయన మాట్లాడుతూ, దేశ వ్యాప్తంగా వౌలిక వసతులను కల్పించడంతోపాటు, క్రీడా సామాగ్రి, శిక్షణ సౌకర్యాలను కూడా మెరుగుపరుస్తామని అన్నారు.

08/29/2017 - 01:01

గ్లాస్గో, ఆగస్టు 28: ప్రపంచ బాడ్మింటన్ చాంపియన్‌షిప్స్‌లో స్వర్ణ పతకాన్ని సాధించే అవకాశాన్ని కొద్దిలో చేజార్చుకున్న భారత స్టార్, తెలుగు తేజం పివి సింధు మ్యాచ్‌లో చివరి క్షణాలే ఫలితాన్ని మార్చేశాయని వాపోయింది. పిటిఐతో ఆమె మాట్లాడుతూ మొదటి సెట్‌ను 21-19 తేడాతో తాను గెల్చుకుంటే, రెండో సెట్‌లో 20-22 ఆధిక్యంతో తన ప్రత్యర్థి నొజోమీ ఒకుహరా విజయం సాధించిన విషయాన్ని గుర్తుచేసింది.

08/29/2017 - 00:59

న్యూఢిల్లీ: మహిళల క్రికెట్‌ను మరింత అభివృద్ధి చేసేందుకు బిసిసిఐ నడుం బిగించింది. ఇటీవల జరిగిన ప్రపంచ కప్ చాంపియన్‌షిప్‌లో మిథాలీ రాజ్ నాయకత్వంలోని భారత్ ఫైనల్ వరకూ చేరిన విషయం తెలిసిందే. టైటిల్ పోరులో ఓడినప్టపికీ, చివరి క్షణం వరకూ భారత మహిళలు చేసిన పోరాటం అందరినీ ఆకట్టుకుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా మహిళా క్రికెటర్లకు ఆదరణ లభించింది.

08/29/2017 - 00:58

పల్లేకల్, ఆగస్టు 28: పాకిస్తాన్‌తో మ్యాచ్ ఉంటే ఎలాంటి పరిస్థితుల్లోనైనా మైదానంలోకి దిగేందుకు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ సిద్ధంగా ఉంటాడు. అవసరమైతే ఒంటికాలితోనే మ్యాచ్ ఆడతానంటూ సెలక్టర్‌కు తేల్చిచెప్పిన తెంపరితనం అతనిది. ఇందుకు సంబంధించిన సంఘటనను ప్రస్తుత జాతీయ సెలక్షన్ కమిటీ చైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్ విలేఖరులతో ముచ్చటిస్తూ ప్రస్తావించాడు.

08/29/2017 - 00:56

స్టవెలాట్‌లో జరిగిన బెల్జియం గ్రాండ్ ప్రీ విజేత లూయిస్ హామిల్టల్ (మెర్సిడిజ్). ఫెరారీ డ్రైవర్ సెబాస్టియన్ వెటెల్, రెడ్‌బుల్‌కు ప్రాతినిధ్యం వహించిన డానియల్ రిసియార్డో వరుసగా రెండు, మూడు స్థానాలను దక్కించుకున్నారు

08/29/2017 - 00:55

కొలంబో, ఆగస్టు 28: అటు రాజకీయ నాయకులు, ఇటు మాజీ క్రికెటర్ల మధ్య జరుగుతున్న ఆధిపత్యం పోరు శ్రీలంక క్రికెట్‌కు శాపంగా మారింది. బడా వ్యాపారస్తులు, పారిశ్రామికవేత్తలు కూడా క్రికెట్‌పై ఆజమాయిషీని కొనసాగించడానికి వ్యూహాలను అమలు చేస్తుండడంతో సమస్య మరింత సంక్లిష్టంగా మారుతున్నది.

08/28/2017 - 00:06

పల్లేకల్, ఆగస్టు 27: శ్రీలంకతో ఆదివారం దాదాపు ఏకపక్షంగా సాగిన మూడో వనే్డను ఆరు వికెట్ల తేడాతో గెల్చుకున్న విరాట్ కోహ్లీ నాయకత్వంలోని భారత జట్టు ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 3-0 తేడాతో కైవసం చేసుకుంది. దీనితో చివరి రెండు మ్యాచ్‌లు ప్రాధాన్యతను కోల్పోయాయి. ఓపెనర్ రోహిత్ శర్మ అద్భుత సెంచరీ, మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అర్ధ శతకం భారత్‌కు తిరుగులేని విజయాన్ని అందించాయి.

08/28/2017 - 00:04

శ్రీలంక ఇన్నింగ్స్: నిరోషన్ డిక్‌విల్లా ఎల్‌బి జస్‌ప్రీత్ బుమ్రా 13, దినేష్ చండీమల్ సి జస్‌ప్రీత్ బుమ్రా బి హార్దిక్ పాండ్య 36, కుశాల్ మెండిస్ సి రోహిత్ శర్మ బి జస్‌ప్రీత్ బుమ్రా 1, లాహిరు తిరిమానే సి కేదార్ జాధవ్ బి జస్‌ప్రీత్ బుమ్రా 80, ఏంజెలో మాథ్యూస్ ఎల్‌బి కేదార్ జాధవ్ 11, చమర కపుగడేర బి అక్షర్ పటేల్ 14, మిలింద సిరివర్దన బి జస్‌ప్రీత్ బుమ్రా 29, అకిల దనంజయ బి జస్‌ప్రీత్ బుమ్రా 2, దుష్మంత చ

08/28/2017 - 00:01

ప్రపంచ బాడ్మింటన్ చాంపియన్‌షిప్స్ మహిళల సింగిల్స్ ఫైనల్‌లో భారత స్టార్ పివి సింధును ఓడించి, టైటిల్ సాధించిన జపాన్ క్రీడాకారిణి నొజోమీ ఒకుహరా. ఇంతకు ముందు రెండు పర్యాయాలు సింధును ఢీకొని, పరాజయాలను చవిచూసిన ఒకుహరా ఈసారి అత్యంత కీలకమైన మ్యాచ్‌ని గెల్చుకుంది. కెరీర్‌లో మొదటిసారి ప్రపంచ చాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకుంది.

Pages