S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

09/04/2017 - 01:11

శ్రీలంక ఇన్నింగ్స్: నిరోషన్ డిక్వెల్లా (సిఅండ్‌బి) భువనేశ్వర్ కుమార్ 2, ఉపుల్ తరంగ (సి) ధోనీ (బి) బుమ్రా 48, దిల్షాన్ మునవీర (సి) కోహ్లీ (బి) భువనేశ్వర్ కుమార్ 4, లహిరు తిరిమానే (బి) భువనేశ్వర్ కుమార్ 67, ఏంజెలో మాథ్యూస్ (సి) ధోనీ (బి) కుల్దీప్ యాదవ్ 55, మిలింద సమరవీర (సి) శార్దూల్ థాకూర్ (బి) భువనేశ్వర్ కుమార్ 18, వనిదు హసరంగ డిసిల్వా రనౌట్ (్ధనీ/యుజ్వేంద్ర చాహాల్) 9, అకిల ధనుంజయ (స్టంప్డ్) ధో

09/04/2017 - 01:09

రోమ్, సెప్టెంబర్ 3: ఆర్చరీ వరల్డ్ కప్ ఫైనల్‌లో భారత్ పోరాటం అత్యంత పేలవంగా ముగిసింది. ఈ ఈవెంట్‌లో భారత్‌కు పతకాన్ని తెచ్చిపెడుతుందని ఆశించిన ప్రపంచ మాజీ నెంబర్ వన్ ఆర్చర్ దీపికా కుమారి ఆదివారం ఇక్కడ తైవాన్‌కు చెందిన టాన్ యా టింగ్ చేతిలో వరుస సెట్ల తేడాతో ఓటమిపాలై తొలి రౌండ్‌లోనే నిష్క్రమించింది.

09/04/2017 - 01:08

లివాడియా (గ్రీస్), సెప్టెంబర్ 3: హెల్లస్ ఓపెన్ ఇంటర్నేషనల్ బాడ్మింటన్ సిరీస్‌లో భారత్‌కు చెందిన రోహన్ కపూర్, కుహూ గార్గ్ మిక్స్‌డ్ డబుల్స్ టైటిల్‌ను కైవసం చేసుకున్నారు. ఆదివారం ఇక్కడ జరిగిన ఫైనల్ పోరులో వీరు 21-19, 21-19 గేముల తేడాతో భారత్‌కే చెందిన ఉత్కర్ష్ ఆరోరా, కరిష్మా వాడ్కర్ జోడీపై విజయం సాధించారు.

09/04/2017 - 01:06

న్యూయార్క్, సెప్టెంబర్ 3: యుఎస్ ఓపెన్ గ్రాండ్‌శ్లామ్ టెన్నిస్ టోర్నమెంట్‌లో ‘స్పెయిన్ బుల్’ రాఫెల్ నాదల్‌తో పాటు స్విట్జర్లాండ్‌కు చెందిన ప్రపంచ మాజీ నెంబర్ వన్ ఆటగాడు రోజర్ ఫెదరర్ ప్రీ-క్వార్టర్ ఫైనల్స్‌కు దూసుకెళ్లారు. అయితే మహిళా అంపైర్‌పై నోరు పారేసుకున్న వివాదాస్పద ఆటగాడు ఫాబియో ఫోగ్నినీ (ఇటలీ)ని ఈ టోర్నీ నుంచి బయటికి గెంటేశారు.

09/04/2017 - 01:05

న్యూయార్క్, సెప్టెంబర్ 3: యుఎస్ ఓపెన్ గ్రాండ్‌శ్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ నుంచచి ఇటలీ ఆటగాడు ఫాబియో ఫోగ్నినీని బయటికి గెంటివేశారు. మొదటి రౌండ్‌లో స్ట్ఫోనో ట్రావగ్లియా చేతిలో ఓటమిపాలైన సందర్భంగా అతను మహిళా అంపైర్ లూరుూస్ ఏంజెల్ పట్ల నోటి దురుసు వ్యాఖ్యలు చేయడమే ఇందుకు కారణం.

09/04/2017 - 01:03

ముంబయి, సెప్టెంబర్ 3: సోమవారంనుంచి ప్రారంభమయ్యే ఐపిఎల్ మీడియా హక్కుల వేలంలో ఈ హక్కులను పొందడం కోసం ప్రపంచం నలుమూలలనుంచి ప్రముఖ సంస్థలు పోటీ పడుతుండడంతో ఈ వేలం ద్వారా రికార్డు మొత్తంలో రాబడి వస్తుందని బిసిసిఐ ఆశిస్తోంది. కాగా, ఐపిఎల్ చైర్మన్ రాజీవ్ శుక్లా ఈ వేలం ప్రక్రియకు దూరంగా ఉండబోతున్నారు.

09/03/2017 - 01:16

కొలంబో, సెప్టెంబర్ 2: శ్రీలంకపై టెస్టుల మాదిరిగానే వన్‌డే సిరీస్‌ను కూడా క్లీన్‌స్వీప్‌తో ముగించాలని కోహ్లీ సేన ఉవ్విళ్లూరుతోంది. శ్రీలంక, భారత జట్ల మధ్య అయిదు మ్యాచ్‌ల వన్‌డే సిరీస్‌లో చివరి మ్యాచ్ ఆదివారం ఇక్కడి ప్రేమదాస స్టేడియంలో జరగనుంది.

09/03/2017 - 01:14

న్యూయార్క్, సెప్టెంబర్ 2: యుఎస్ ఓపెన్ గ్రాండ్‌శ్లామ్ టెన్నిస్ టోర్నమెంట్‌లో రష్యా అందాల భామ మరియా షరపోవా జోరు కొనసాగుతోంది. మహిళల సింగిల్స్ మూడో రౌండ్ పోరులో ఆమె అమెరికా యువ క్రీడాకారిణి సోఫియా కెనిన్‌పై విజయం సాధించి ప్రీ-క్వార్టర్ ఫైనల్స్‌కు దూసుకెళ్లింది. అయితే పురుషుల సింగిల్స్ విభాగంలో యుఎస్ ఓపెన్ 2014 ఎడిషన్ చాంపియన్ మారిన్ సిలిక్‌తో పాటు అమెరికా ఆటగాడు జాన్ ఇస్నర్‌కు చుక్కెదురైంది.

09/03/2017 - 01:13

న్యూయార్క్, సెప్టెంబర్ 2: యుఎస్ ఓపెన్‌లో మైఖేల్ చాంగ్ (1989) తర్వాత ప్రీ-క్వార్టర్ ఫైనల్స్‌కు చేరుకున్న అత్యంత పిన్న వయస్కుడిగా కెనడా యువ ఆటగాడు డెనిస్ షపోవలోవ్ రికార్డు సృష్టించాడు. పురుషుల సింగిల్స్ మూడో రౌండ్‌లో షపోవలోవ్‌తో తలపడిన కైల్ ఎడ్మండ్ (బ్రిటన్) మెడ గాయం కారణంగా రిటైర్ అయ్యాడు. అప్పటికి షపోవలోవ్ 3-6, 6-2, 6-3, 1-0 ఆధిక్యతలో కొనసాగుతుండటంతో అతడిని విజేతగా ప్రకటించారు.

09/03/2017 - 01:11

న్యూయార్క్, సెప్టెంబర్ 2: యుఎస్ ఓపెన్ గ్రాండ్‌శ్లామ్ టెన్నిస్ టోర్నమెంట్‌లో భారత సీనియర్ ఆటగాడు లియాండర్ పేస్, అతని భాగస్వామి పురవ్ రాజా శుభారంభాన్ని సాధించారు. గ్రాండ్‌శ్లామ్ టోర్నీలో తొలిసారి కలసి ఆడుతున్న వీరు పురుషుల డబుల్స్ ఓపెనింగ్ రౌండ్‌లో 6-1, 6-3 సెట్ల తేడాతో సెర్బియాకి చెందిన జాంకో తిప్సెర్విక్, విక్టర్ ట్రాయ్‌కీ జోడీని మట్టికరిపించారు.

Pages