S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

11/20/2016 - 00:40

ఫజూ (చైనా), నవంబర్ 19: భారత స్టార్, రియో ఒలింపిక్స్ రజత పతక విజేత పివి సింధు ఇక్కడ జరుగుతవున్న చైనా ఓపెన్ సూపర్ సిరీస్ బాడ్మింటన్ సిరీస్ మహిళల సింగిల్స్‌లో ఫైనల్ చేరింది. సెమీ ఫైనల్‌లో సంగ్ జీ హ్యున్‌ను ఢీకొన్న ఆమె ఓటమి అంచు నుంచి బయటపడి, వరుసగా మూడు మ్యాచ్ పాయింట్లను నిలబెట్టుకుంది. అతి కష్టం మీద మ్యాచ్‌ని 11-21, 23-21, 21-19 తేడాతో సొంతం చేసుకుంది.

11/20/2016 - 00:39

క్రైస్ట్‌చర్చి, నవంబర్ 19: డెబ్యుడెంట్ బౌలర్ కొలిన్ డి గ్రాండ్‌హోమ్ రికార్డు స్పెల్‌తో ఆరు వికెట్లు పడగొట్టడంతో పాకిస్తాన్‌ను మొదటి ఇన్నింగ్స్‌లో 133 పరుగులకే కట్టడి చేసిన న్యూజిలాండ్ బ్యాటింగ్‌లో రాణించలేకపోయింది. మూడు వికెట్లకు 104 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో మూడో రోజు ఆటను కొనసాగించి, 200 పరుగులకు ఆలౌటైంది.

11/20/2016 - 00:39

కరాచీ, నవంబర్ 19: భారత్‌లో జరిగే జూనియర్ హాకీ ప్రపంచ కప్ చాంపియన్‌షిప్‌లో పాకిస్తాన్ పాల్గొనడంపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. డిసెంబర్ 8 నుంచి 18వ తేదీ వరకు జరిగే ఈ టోర్నీలో పాల్గొనేందుకు జూనియర్ హాకీ జట్టుకు పాక్ సర్కారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. భారత్, పాక్ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు, సరిహద్దులో కమ్ముకుంటున్న యుద్ధ మేఘాల నేపథ్యంలో అన్ని రకాల ద్వైపాక్షిక సంబంధాలకు తెరపడింది.

11/19/2016 - 01:23

ఇంగ్లాండ్‌పై రవిచంద్ర అశ్విన్ బ్యాటింగ్ సగటు అద్భుతంగా ఉంది.
అతను ఇంగ్లాండ్‌తో 13 ఇన్నింగ్స్ ఆడి,
50.90 సగటుతో మొత్తం 509 పరుగులు సాధించాడు.

11/19/2016 - 01:21

విశాఖపట్నం (స్పోర్ట్స్), నవంబర్ 18: ఇంగ్లాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ మొదటి రోజు చటేశ్వర్ పుజారా, కెప్టెన్ విరాట్ కోహ్లీ శతకాలతో కదంతొక్కడంతో ఆధిపత్యాన్ని కనబరచి, ఆట ముగిసే సమయానికి నాలుగు వికెట్లకు 317 పరుగులు సాధించి పటిష్టమైన స్థితిలో నిలిచిన టీమిండియా రెండో రోజు తడబాటుకు గురై, అదే స్థాయిలో రాణించలేకపోయింది. మరో 138 పరుగులు జోడించి, మిగతా ఆరు వికెట్లు కోల్పోయింది.

11/19/2016 - 01:19

విశాఖపట్నం: విరాట్ కోహ్లీ చేసిన 167 పరుగుల స్కోరు ఇంగ్లాండ్‌పై స్వదేశంలో భారత కెప్టెన్లు సాధించిన అత్యధిక పరుగుల జాబితాలో నాలుగో స్థానాన్ని ఆక్రమించింది. మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ 1964 ఫిబ్రవరిలో జరిగిన ఢిల్లీ టెస్టులో 203 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. 1993లో కోల్‌కతా టెస్టులో మహమ్మద్ అజరుద్దీన్ 182, 1981 డిసెంబర్‌లో బెంగళూరు టెస్టులో సునిల్ గవాస్కర్ 172 చొప్పున పరుగులు చేశారు.

11/19/2016 - 01:19

విశాఖపట్నం: ఇంగ్లాండ్ జట్టులో హైక్వాలిటీ స్పిన్నర్లు ఉన్నారని ఆ జట్టు అసిస్టెంట్ కోచ్ పాల్ ఫార్బ్రెస్ అన్నాడు. ప్రస్తుతం జట్టు ఒత్తిడిలో ఉందని, వికెట్లు త్వరగా కోల్పోవడం వంటి ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంట్నుట్టు తెలిపాడు. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో పాజిటివ్ దృక్పథంతో మూడో రోజు ఆటను కొనసాగించి స్కోరు పెంచడానికి ప్రయత్నిస్తామని అన్నాడు.

11/19/2016 - 01:25

క్రైస్ట్‌చర్చి, నవంబర్ 18: న్యూజిలాండ్ డెబ్యుడెంట్ బౌలర్ కొలిన్ డి గ్రాండ్‌హోమ్ రికార్డు స్పెల్‌తో కొత్త చరిత్ర సృష్టించాడు. కెరీర్‌లో ఆడుతున్న తొలి టెస్టు, మొదటి ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లు పడగొట్టాడు. అతని ధాటికి విలవిల్లాడిన పాకిస్తాన్ తొలి ఇన్నింగ్స్‌లో 133 పరుగులకే కుప్పకూలింది. ఈ మ్యాచ్ తొలి రోజు ఆట వర్షం కారణంగా రద్దయిన విషయం తెలిసిందే.

11/19/2016 - 01:17

క్రైస్ట్‌చర్చి: మీడియం పేసర్ కొలిన్ డి గ్రాండ్‌హోమ్‌ను 30 ఏళ్ల వయసులో జాతీయ జట్టుకు మొదటిసారి ఎంపిక చేయడంపై దుమారం చెలరేగింది. దీనిని మతితప్పిన చర్యగా కివీస్ మీడియా అభివర్ణించింది. అయితే, తన ఎంపిక తప్పుకాదని గ్రాండ్‌హోమ్ నిరూపించాడు. ఆడిన మొదటి టెస్టు, మొదటి ఇన్నింగ్స్‌లో 41 పరుగులకే ఆరు వికెట్లు పడగొట్టి రికార్డు సృష్టించాడు. న్యూజిలాండ్ తరఫున ఒక డెబ్యుడెంట్‌కు ఇదే అత్యుత్తమ బౌలింగ్ విశే్లషణ.

11/19/2016 - 01:15

విజయవాడ (స్పోర్ట్స్), నవంబర్ 18: భారత్‌తో శుక్రవారం జరిగిన మొదటి టి-20 క్రికెట్ మ్యాచ్‌ని ఆరు వికెట్ల తేడాతో గెల్చుకున్న వెస్టిండీస్ శుభారంభం చేసింది. విండీస్ కెప్టెన్ స్ట్ఫోనీ టేలర్ అసాధారణ ఇన్నింగ్స్ ఆడి, తన జట్టును విజయపథంలో నడిపింది. నగరానికి సమీపంలోని మూలపాడులోని దేవినేని వెంకటరమణ-ప్రణీత క్రికెట్ గ్రౌండ్స్‌లో ఈ మ్యాచ్‌లో భారత్‌పై అన్ని విభాగాల్లో వెస్టిండీస్ మహిళలు ఆధిక్యం ప్రదర్శించారు.

Pages