S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

09/21/2016 - 00:16

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 20: జాతీయ సెలక్షన్ కమిటీకి ఎంపిక జరుపుతామంటూ భార త్ క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) దరఖాస్తులను ఆహ్వానించడంతో, మాజీ క్రికెట ర్లు రేసులోకి దిగుతున్నారు. ఇంతకు ముందు చీఫ్ కోచ్ పదవికి పోటీపడిన మాజీ పేసర్ వెంకటేశ్ ప్రసాద్ ఇప్పుడు సెలక్టర్‌గా ఉండేందుకు ఆసక్తిని చూపుతున్నాడు.

09/21/2016 - 00:15

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 20: వియత్నాంలోని డనాంగ్‌లో జరిగే ఐదవ ఆసియా బీచ్ గేమ్స్‌కు 208 మందితో కూడిన భారీ బృందాన్ని భారత ఒలింపిక్ సంఘం (ఐఒఎ) ఎంపిక చేసింది. 2014లో ఈ పోటీలు ఫకెట్‌లో జరిగాయి. అందులో రెండు స్వర్ణం, ఒక రజతం, 7 కాంస్య పతకాలు లభించాయి. కాగా, తాజా పోటీలు ఈనెల 24 నుంచి ప్రారంభం కానున్నాయ.

09/21/2016 - 00:15

మార్గోవా, సెప్టెంబర్ 20: ఎఎఫ్‌సి అండర్-16 ఫుట్‌బాల్ చాంపియన్‌షిప్ పోటీల్లో భారత జట్టు బుధవారం అగ్ని పరీక్షను ఎదుర్కోనుంది. గ్రూప్ ‘ఎ’లో ఇరాన్‌తో జరిగే మ్యాచ్‌లో గెలిస్తేనే భారత్ ముందంజ వేస్తుంది. ఒకవేళ ఈ మ్యాచ్‌ని కోల్పోతే, నిష్క్రమించక తప్పదు. స్వదేశంలో, సుమారు 4,000 మంది ప్రేక్షకుల సమక్షంలో మ్యాచ్ జరుగుతుంది కాబట్టి, వారి మద్దతు భారత ఆటగాళ్లకు ఉత్ప్రేరకంగా ఉపయోగపడుతుంది.

09/20/2016 - 17:45

దిల్లీ: 5వ ఆసియా బీచ్‌ గేమ్స్‌కు వెళ్లే భారత బృందాన్ని ఇండియన్‌ ఒలింపిక్‌ అసోసియేషన్‌(ఐఓఏ) ప్రకటించింది. 2014లో 117మంది అథ్లెట్లను పంపిన ఐఓఏ ఈసారి అత్యధికంగా 208మంది క్రీడాకారులను పంపనున్నట్లు తెలిపింది. స్విమ్మింగ్‌, కబడ్డీ, హ్యాండ్‌ బాల్‌తో పాటు మొత్తం 13 విభాగాల్లో మన క్రీడాకారులు పాల్గొననున్నారు. సెప్టెంబరు 24న వియత్నాంలోని డనాగ్‌లో ఈ పోటీలు నిర్వహించనున్నారు.

09/20/2016 - 08:39

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 19: క్రికెటర్లకు బయోపిక్‌లు ఎందుకని భారత క్రికెటర్ గౌతం గంభీర్ సూటిగా ప్రశ్నించాడు. భారత పరిమిత ఓవర్ల జట్లకు నాయకత్వం వహిస్తున్న మహేంద్ర సింగ్ ధోనీ జీవిత కథ ఆధారంగా నిర్మించిన ‘ఎంఎస్ ధోనీ-ది అన్ టోల్డ్ స్టోరీ’ సినిమా ఈనెల 30న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

09/20/2016 - 08:38

మోన్జా, సెప్టెంబర్ 19: ఇక్కడి నేషనల్ సర్క్యూట్‌లో జరిగిన ఇటాలియన్ గ్రాండ్ ప్రీ ఫార్ములా వన్ రేస్‌ను నికో రోజ్‌బర్గ్ (జర్మనీ) గెల్చుకున్నాడు. మెర్సిడిజ్ వాహనాన్ని నడిపిన అతను రేస్‌ను ఒక గంట, 55 నిమిషాల, 48.950 సెకన్లలో పూర్తి చేసి, టైటిల్ సాధించడంతోపాటు ప్రపంచ చాంపియన్‌షిప్ రేస్‌లో అగ్రస్థానాన్ని ఆక్రమించాడు.

09/20/2016 - 08:37

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 19: ఇప్పటి భారత టెస్టు క్రికెట్ జట్టుకు ఉజ్వల భవిష్యత్తు ఉందని భారత మాజీ క్రికెటర్ వివిఎస్ లక్ష్మణ్ ఆశాభావం వ్యక్తం చేశాడు.

09/20/2016 - 08:39

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 19: కొందరు కుట్ర పూరితంగా వ్యవహరిస్తూ, తన ప్రతిష్ఠను దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్నారని భారత వెటరన్ టెన్నిస్ ఆటగాడు లియాండర్ పేస్ ఆరోపించాడు. సోమవారం పిటిఐతో అతను మాట్లాడుతూ తనతో పోటీపడే కొంత మంది విపరీతమైన అసూయతో ఉన్నారని, తనను కించపరచడమే వారి లక్ష్యమని పేర్కొన్నాడు.

09/19/2016 - 07:32

రియో డి జెనీరో, సెప్టెంబర్ 18: బహ్మాన్ లేటు వయసులోనూ సైక్లింగ్ పట్ల ఆసక్తితో పోటీకి దిగాడు. 2002లో అతను సైక్లింగ్‌ను కెరీర్‌గా ఎంచుకున్నాడు. 2012 పారాలింపిక్స్‌లో పాల్గొన్నాడు. వయసు మీద పడుతున్నప్పటికీ అతనికి సైక్లింగ్‌పై మక్కువ తగ్గలేదు. ఇరాక్‌తో జరిగిన యుద్ధంలో పాల్గొన్న ఈ మాజీ సైనికుడు విధుల నుంచి వైదొలగిన తర్వాత, తన 34వ ఏట సైక్లింగ్‌ను ప్రొఫెషన్‌గా ఎంచుకున్నాడు.

Pages