S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

09/09/2016 - 01:14

మాంచెస్టర్, సెప్టెంబర్ 8: పాకిస్తాన్‌తో జరిగిన ఏకైన టి-20 మ్యాచ్‌లో ఇంగ్లాండ్ చిత్తయింది. ఇంకా 31 బంతులు మిగిలి ఉండగానే పాకిస్తాన్ తొమ్మిది వికెట్ల తేడాతో విజయభేరి మోగించింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్ 20 ఓవర్లలో ఏడు వికెట్లకు 135 పరుగులు చేసింది. అలెక్స్ హాలెస్ 37 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. పాక్ బౌలర్ వాహబ్ రియాజ్ 18 పరుగులకు మూడు వికెట్లు పడగొట్టాడు.

09/08/2016 - 18:12

దిల్లీ: పంకజ్‌ అద్వాణీ పద్మభూషణ్‌ పురస్కారానికి అర్హుడని బిలియర్డ్స్‌ అండ్‌ స్నూకర్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా(బీఎస్‌ఎఫ్‌ఐ) సిఫారసు చేసింది. ప్పటికే అద్వాణీ 2009లో పద్మశ్రీ, 2004లో అర్జున అవార్డు, 2005-06లో ఖేల్‌ రత్న అందుకున్నారు. గతంలోనూ పద్మభూషణ్‌కు పంకజ్‌ పేరును ప్రతిపాదించామని బీఎస్‌ఎఫ్‌ఐ సెక్రెటరీ బాలసుబ్రమణ్యన్‌ తెలిపారు.

09/08/2016 - 07:28

కొచ్చి, సెప్టెంబర్ 7: మూడవ ఇండియన్ సాకర్ లీగ్ (ఐఎస్‌ఎల్)కు జట్టును కేరళ బ్లాస్టర్స్ ఫుట్‌బాల్ క్లబ్ బుధవారం ప్రకటించింది. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో జట్టు యజమాని, భారత మాజీ టెస్టు క్రికెటర్ సచిన్ తెండూల్కర్ లుంగీ కట్టుకొని ప్రత్యేకంగా కనిపించాడు. సహ భాగస్వాములు, టాలీవుడ్ స్టార్లు చిరంజీవి, అక్కినేని నాగార్జున కూడా లుంగీలతో కనువిందు చేశారు.

09/08/2016 - 07:21

న్యూయార్క్, సెప్టెంబర్ 7: యుఎస్ ఓపెన్ పురుషుల సింగిల్స్ సెమీ ఫైనల్‌లో ఫ్రెంచ్ వీరుడు గేల్ మోన్ఫిల్స్‌తో డిఫెండింగ్ చాంపియన్, ప్రపంచ నంబర్ వన్ నొవాక్ జొకోవిచ్ ఢీ కొంటాడు. 89 సంవత్సరాల యుఎస్ ఓపెన్ చరిత్రలో మొట్టమొదటిసారి ముగ్గురు ఫ్రెంచ్ ఆటగాళ్లు క్వార్టర్ ఫైనల్స్ చేరడం విశేషం. వీరిలో మెరుగైన స్థానంలో ఉన్న జో విల్‌ఫ్రైడ్ సొంగా క్వార్టర్స్ మ్యాచ్‌ని పూర్తి చేయలేకపోయాడు.

09/08/2016 - 07:20

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 7: టెస్టు క్రికెట్‌లో రెండంచెల విధానాన్ని అమలు చేయాలని చాలకాలంగా వాదిస్తున్న అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) తన ప్రతిపాదనను వెనక్కు తీసుకుంది. వాస్తవానికి పాలక మండలి సమావేశంలో ఈ అంశం చర్చకు రావాలి. కానీ, భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) నుంచి తీవ్ర స్థాయిలో వ్యతిరేక వ్యక్తం కావడంతో ఐసిసి వెనుకంజ వేసినట్టు సమాచారం.

09/08/2016 - 07:20

గ్రేటర్ నోయిడా, సెప్టెంబర్ 7: దులీప్ ట్రోఫీలో ఇండియా గ్రీన్ తరఫున ఆడుతున్న స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓఝా తలకు గాయమైంది. ఇండియా బ్లూ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు, మిడ్ ఆన్ స్థానంలో ఫీల్డింగ్ చేస్తుండగా అతని తలకు బంతి తగిలింది. శ్రేయాస్ గోపాల్ బౌలింగ్‌లో బ్యాట్స్‌మన్ పంకజ్ సింగ్ కొట్టిన బంతి ఓఝా సమీపంలో పడి, ఒక్కసారిగా పైకి ఎగిరింది. బంతి దిశను అర్థం చేసుకోలేకపోయిన ఓఝా తలను తప్పించే లోపలే గాయపడ్డాడు.

09/08/2016 - 07:19

మనాస్ (బ్రెజిల్), సెప్టెంబర్ 7: సాకర్ సూపర్ స్టార్ నేమార్ కీలక గోల్ చేసి, 2018 ప్రపంచ కప్ క్వాలిఫయర్స్‌లో కొలంబియాపై బ్రెజిల్‌కు కీలక విజయాన్ని సాధించిపెట్టాడు. మ్యాచ్ ఆరంభమైన మరుక్షణమే దాడికి ఉపక్రమించిన బ్రెజిల్ రెండో నిమిషంలోనే గోల్‌ను నమోదు చేసింది. రెండో నిమిషంలో నేమార్ నుంచి పాస్‌ను అందుకున్న మరాండా చక్కటి గోల్ చేసి బ్రెజిల్‌కు 1-0 ఆధిక్యాన్ని అందించాడు.

09/08/2016 - 07:18

రియో డి జెనీరో, సెప్టెంబర్ 7: ఏదో ఒక రకమైన అంగ వైకల్యంతో బాధపడుతున్న వారి కోసం ప్రత్యేకంగా నిర్వహించే పారాలింపిక్స్ రియో డి జెనీరోలో మొదలయ్యాయి. ఆర్థికంగా పతనావస్థలో ఉన్నప్పటికీ బ్రెజిల్ ఈ క్రీడల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. సమ్మర్ ఒలింపిక్స్ ముగిసిన మూడు వారాల్లోపలే పారాలింపిక్స్‌కు రియో వేదిక కావడం విశేషం.

09/08/2016 - 07:18

న్యూయార్క్, సెప్టెంబర్ 7: యుఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్ మొదటి సెమీ ఫైనల్‌లో ప్రపంచ రెండో ర్యాంక్ క్రీడాకారిణి ఏంజెలిక్ కెర్బర్, మాజీ వరల్డ్ నంబర్ వన్ కరోలిన్ వొజ్నియాకి ఢీ కొంటారు. క్వార్టర్ ఫైనల్స్‌లో కెర్బర్ 7-5, 6-0 తేడాతో ఏడో సీడ్ రాబర్టా విన్సీపై విజయభేరి మోగించింది. మొదటి సెట్‌లో గట్టిపోటీనిచ్చిన విన్సీకి రెండు సెట్‌లో కోలుకునే అవకాశం ఇవ్వకుండా కెర్బర్ దాడులను కొనసాగించింది.

09/08/2016 - 07:18

న్యూయార్క్, సెప్టెంబర్ 7: చెక్ రిపబ్లిక్‌కు చెందిన బార్బరా స్ట్రికోవాతో కలిసి యుఎస్ ఓపెన్ మహిళల డబుల్స్ విభాగంలో పోటీపడిన భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా క్వార్టర్ ఫైనల్స్‌లో ఓటమిపాలైంది. కరోలిన్ గార్సియా, క్రిస్టినా మ్లడెన్కొవిచ్ జోడీతో తలపడిన వీరు 6-7, 1-6 తేడాతో వరుస సెట్లలో ఓటమిపాలై నిష్క్రమించారు. మొదటి సెట్‌లో కొంత వరకు పోరాడిన సానియా, బార్బరా జోడీ రెండో సెట్‌లో దారుణంగా విఫలమయ్యారు.

Pages