Aadivavram - Meeku Telusaa?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మీకు తెలుసా ?

Hide this category: 
Hide

‘డెడ్ సీ’ సముద్రం కాదు!

ఇజ్రాయెల్, జోర్డాన్, వెస్ట్‌బ్యాంకు సరిహద్దుల్లో ఉన్న ‘డెడ్ సీ’ నిజానికి సముద్రం కాదు. భారీ ఉప్పునీటి సరస్సు. ఈ ‘మృత సముద్రం’ మూడువైపులా భూమి ఉంటుంది. అటువైపు నుంటి ఎక్కడికీ నీరు ప్రవహించదు. నాలుగోవైపు నుంచి లోపలికి నీరు చేరుతుందంతే. ప్రపంచంలో అత్యంత ఉప్పదనంతో ఉండే ఉప్పునీటి సరస్సు ఇది. మామూలు సముద్రాల నీటిలో ఉప్పు కన్నా డెడ్‌సీ నీరు 9.6 శాతం ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ నీటిలో ఉప్పుసాంద్రత ఎక్కువగా ఉండటం వల్ల మిగతా నీళ్లలో మనుషులు తేలడం కన్నా ఇక్కడ సులువుగా తేలియాడతారు.

- ఎస్.కె.కె. రవళి

నల్లముత్యాలూ ఉంటాయి!

ముత్యం అనగానే నిగనిగ తెల్లగా మెరిసిపోయే గుండ్రటి, బియ్యపు గింజల్లాంటివి గుర్తొస్తాయి. కానీ వీటిలో గుండ్రంగా ఊదారంగు, నలుపు, కాస్తంత పసుపు ఛాయతో కూడిన ముత్యాలూ ఉంటాయి. ఉప్పునీటిలోను, మంచినీటిలోనూ ముత్యపుచిప్పల్లో లభించే సహజసిద్ధమైన ముత్యాలకు గిరాకీ ఎక్కువ. భూమిపై దాదాపు కోటీ 60 లక్షల సంవత్సరాల నుంచి ముత్యాల వాడకం ఉంది. ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి. బతికి ఉన్న జీవి నుంచి వాడుకునే ఆభరణం ముత్యం. ప్రతి పది లక్షల ముత్యపు చిప్పల్లో దాదాపు ఒక ముత్యం లభిస్తుంది. ఆల్చిప్పల్లోపల సన్నని ఇసుక లేదా ఇతర రేణువుల చుట్టూ కాల్షియంతో కూడిన పదార్ధాన్ని పొరలుపొరలుగా పేర్చుకుంటూ వస్తుంది ఆ చిప్పలోని జీవి.

టర్కీలో పుట్టినా...

అత్యధిక పోషకాలతో కూడిన శాకాహార పంట కాలీఫ్లవర్. ఇది మొదట టర్కీలో సాగు చేశారు. 16వ శతాబ్దంలో ఐరోపా దేశాలు కాలీఫ్లవర్‌ను వాడటం మొదలుపెట్టారు. అమెరికా మాత్రం 20వ శతాబ్దంలో దీని రుచి చూసింది. వందలాది రకాలు, రూపాలు, విభిన్న రంగుల్లో లభించే కాలీఫ్లవర్ అత్యంత బలవర్ధక ఆహారం. కొన్ని రకాల కేన్సర్‌లను నివారించడానికి కాలీఫ్లవర్ రసం ఉపయోగపడుతుంది. ప్రపంచంలో వీటిని ఎక్కువగా ఉత్పత్తి చేసే దేశం చైనా. అంటే టర్కీలో పుట్టినా అటు అమెరికా, యూరోప్, ఇటు ఆసియాల్లో విస్తృతంగా వాడే శాఖాహార పంటగా కాలిఫ్లవర్ పేరుపొందింది.

మాంక్ ఫిష్ నోరు పెద్దదే!

దాని శరీరంతో పోలిస్తే రాకాసి నోటితో అందర్నీ భయపెడుతుంది ‘మాంక్ ఫిష్’ భయంకరమైన పళ్లవరస, వెడల్పుగా ఉండే నోరు చూసేందుకు భయపెడతాయి. వీటి రూపాన్ని బట్టి ‘సీ డెవిల్’ అని పిలుస్తారు. సముద్రం అంతర్భాగంలో నేలపై మూడువేల అడుగుల లోతున ఇవి జీవిస్తాయి. పక్షులను వేటాడటానికి అరుదుగా నీటి ఉపరితలంపైకి వస్తూంటాయి. నేలపై కదలకుండా నక్కి ఉంటూ ఒక్క ఉదుటన దాడి చేసి ఆహారాన్ని పట్టుకోవడం వీటి అలవాటు. వీటి కళ్లు ముత్యాల్లా గుండ్రంగా మెరుస్తూ ఉంటాయి. శరీర పరిమాణంతో పోలిస్తే నోరే పెద్దగా ఉండి మిగతా భాగం సన్నగా చిన్నగా ఉండటం వల్ల దీనిని ‘ఆల్‌వౌత్’ ఫిష్ అని కూడా పిలుస్తూంటారు.

- ఎస్.కె.కె. రవళి

మొసళ్లు రాళ్లనూ మింగుతాయి!

ఔను ఇది నిజం. మొసళ్లు రాళ్లను కూడా మింగుతాయి. అవి మాంసాహారులని అందరికీ తెలిసిందే. ఇవి ఆహారాన్ని నమిలి తినలేవు. మాంసాన్ని, రక్తాన్ని లేదా ఎముకలను ఖండాలుగా గుటుక్కుమని మింగుతాయంతే. అయితే తిన్న ఆహారం అరగాలికదా. అందుకోసం చిన్నచిన్న రాళ్లను అవి మింగుతాయి. వాటిమధ్య నలిగి అవి తిన్న ఆహారం అరుగుతుందన్నది వాటి తెలివి. ప్రపంచంలో ఉప్పునీటిలో పెరిగే మొసళ్లు అతిపెద్దవిగా ఉంటాయి. దాదాపు 18 అడుగుల మేరకు అవి పెరగుతూంటాయి. ఈ జాతిలో అతి చిన్నవి డ్వార్ఫ్ క్రొకొడైల్స్. ఇవి దాదాపు 5 అడుగుల మేర మాత్రమే పొడవు పెరుగుతాయి. నిజానికి మొసళ్లు భూమిపై 240 మిలియన్ సంవత్సరాలుగా జీవిస్తున్నాయి.

ఏనుగు పిల్లలు ఏం చేస్తాయో తెలుసా?

భూమీద జీవిస్తున్న అతిపెద్ద క్షీరదం ఏనుగు. ఇప్పటికి మూడు జాతుల ఏనుగులు మాత్రమే బతికి ఉన్నాయి. భారతీయ ఏనుగుల చెవులు మిగతా జాతుల ఏనుగుల చెవులకన్నా చిన్నవిగా ఉంటాయి. మనలో చిన్నపిల్లలు నిద్రపోతున్నడ్లు, జోగుతున్నప్పుడు, ఆలోచనల్లో మునిగిపోయినప్పుడు నోట్లో వేలుపెట్టుకోవడం చూస్తునే ఉంటాం కదా! అలాగే గున్న ఏనుగులు తమ తొండాన్ని నోట్లో పెట్టుకుంటాయిట. ఏనుగుల గుంపునకు వాటిలో తెలివైన, వయసులో పెద్దదైన ఆడ ఏనుగు నాయకత్వం వహిస్తుంది. మగ ఏనుగులు వేరేగా గుంపుగా ఉంటాయి. ఏనుగల చర్మం మందం ఒక అంగుళం మేరకు ఉంటుంది. అయినా అవి సూర్యరశ్మిని, వేడిని ఎక్కువగా తట్టుకోలేవు.

- ఎస్.కె.కె. రవళి

ఫుట్‌బాల్ పుట్టింది ఎక్కడ?

ప్రస్తుతం ప్రపంచంలో ఎక్కువ ఆదరణ పొందుతున్న ఫుట్‌బాల్ క్రీడ పుట్టింది చైనాలో. క్రీస్తుపూర్వం 476లోనే ఈ ఆట అక్కడ ఆడారు. ఆధునిక మార్పులతో తరువాత ఆ ఆట ఐరోపా, అమెరికా వంటి దేశాలకు చేరింది. ప్రస్తుతం ప్రపంచంలో ఎక్కువ ఆదాయం, ఎక్కువమంది చూసే, ఎక్కువ జనాదరణ ఉన్న క్రీడ అదొక్కటే. ప్రపంచకప్‌ను కనీసం వందకోట్లమంది టీవీల్లో వీక్షిస్తారు. ఫుట్‌బాల్ క్రీడాకారుడు ఒక మ్యాచ్‌లో ఆడితే కనీసం 9.65 కి.మీ. దూరం పరుగుపెడతాడు. ప్రఖ్యాత ఫుట్‌బాల్ క్రీడాకారుడు పీలే ఈ ఫుట్‌బాల్‌ను అందమైన క్రీడగా పిలిచాడు. ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి. ప్రపంచకప్ ఫుట్‌బాల్ మ్యాచ్‌లలో ఆడే బంతులను పాకిస్తాన్‌లో తయారు చేస్తారు తెలుసా?

‘ఎరేసర్’లో ఏముంటుంది?

పెన్సిల్‌తో రాసినవాటిని చెరిపివేయడానికి మనం వాడే ‘ఎరేసర్’ను రబ్బర్‌గా పిలుస్తాం. నిజానికి ప్రపంచంలో ఎక్కువమంది వాటిని రబ్బర్‌గానే వ్యవహరిస్తారు. అవి అందుబాటులోకి రాకముందు పెన్సిల్ రాతలను చెరపడానికి బ్రెడ్ పొడిని వాడేవారు.
ఓ ప్రమాదంలో రబ్బర్ ముక్కలతో రుద్దినపుడు పెన్సిల్ అక్షరాలు చెరిగిపోవడాన్ని గమనించిన జోసెఫ్ ప్రిస్ట్‌లీ ‘రబ్బర్’ను కనుగొన్నాడు. పెన్సిల్ చివర అమర్చే రబ్బర్‌ను ‘ప్లగ్’ అని పిలుస్తారు. అమెరికాలో ఈ పెన్సిల్స్ వాడకం ఎక్కువ. ఒక పెన్సిల్‌తో 35 మైళ్ల పొడవైన గీత గీయవచ్చు.

పెన్సిల్‌కు పేరెలా వచ్చింది?

గ్రాఫైట్ ఖనిజంతో తయారు చేసే పెన్సిల్‌కు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా? లాటిన్‌లో ‘పెన్సిల్లస్’ అన్న పదానికి ‘లిటిల్ టెయిల్’ (చిన్న తోక అని అర్థం. అలాగే ఫ్రెంచ్ భాషలో ‘పినె్సల్’ అన్న పదానికి ‘లిటిల్ పెయింట్ బ్రష్’ అని అర్థం. ఈ రెండు పదాల్లోంచి పుట్టిన ఆంగ్లపదం ‘పెన్సిల్’. తెలుగులోనూ అలాగే పిలుస్తున్నాం. ఇక్కడ పెన్సిల్‌కు సంబంధించి ఒకటి రెండు విషయాలు తెలుసుకోవాలి. గురుత్వాకర్షణ లేనిచోట కూడా పెన్సిల్‌తో రాయవచ్చు. నీళ్లలోనూ పెన్సిల్‌తో రాయడం సాధ్యమవుతుంది. 1770 నాటికి పెన్సిల్ అందుబాటులోకి వచ్చింది.

- ఎస్.కె.కె. రవళి

మ్యూల్’ ప్రత్యేకతలు తెలుసా?

గాడిదలు, గుర్రాల సంకరంతో పుట్టిన జంతువులు మ్యూల్స్. సాధారణంగా గుర్రాలు, గాడిదల పోలికలతో ఇవి ఉంటాయి. తెలుపు, బూడిద రంగులో ఇవి ఉండటం చాలా అరుదు. గుర్రాల రంగులోనే ఎక్కువగా ఇవి ఉంటాయి. ఆ రెండింటికన్నా ఇవి తెలివైనవి, ధృడమైనవి కూడా. పరన్నాజీవుల తాకిడిని తట్టుకోగల శక్తి వీటికి ఉంది. అమెరికా, బ్రిటన్, మెక్సికో వంటి దేశాలు సైనిక దళాలలో వీటిని ఎక్కువగా ఉపయోగించుకుంటున్నాయి. ఆయుధార తరలింపులో వీటికి ఇవే సాటి. అమెరికా సైన్యం ఆఫ్గానిస్తాన్‌లో చేపట్టిన సైనిక చర్యల్లో ఇవి కీలక పాత్ర పోషించాయి. చైనా కూడా వీటిని ఎక్కువ భద్రతా దళాల్లో వినియోగిస్తోంది.

- ఎస్.కె.కె. రవళి

Pages