Aadivavram - Meeku Telusaa?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మీకు తెలుసా ?

Hide this category: 
Hide

కదంబం..విశేషం

దేవతలకు ఇష్టమైనదిగా చెప్పుకునే కదంబ పుష్పం భారత ఉపఖండంలో కనిపిస్తుంది. సుమధురమైన వాసనతో, కాషాయవర్ణంతో గుండ్రంగా, ఆకర్షణీయంగా కన్పించే ఈ పుష్పం తేనెటీగలకు ప్రీతిపాత్రమైనది. వీటిలో ఉండే మకరందం వాటికి ఇష్టం. ఐదున్నర సెంటీమీటర్ల వ్యాసార్థంతో ఉండే ఈ పుష్పంలో ఫలదీకరణం తరువాత ఎనిమిదివేల విత్తనాలు ఏర్పడతాయి. రంగులు, అత్తరుల తయారీలో వీటికి ఎంతో ప్రాధాన్యం ఉంది. అన్నట్లు సీతాకోక చిలుకల్లో ‘బ్రష్ ఫుటెడ్ బటర్‌ఫ్లై’ జాతికి చెందిన గొంగళి పురుగులకు కదంబ ఆకులు ఎంతో ఇష్టమైనవి. ఆ జాతి ఎదుగుదల అంతా కదంబ వృక్షాలపైనే ఉంటుంది. ఈ చెట్ల ఆకులు పశువులకు మేతగాకూడా పనికొస్తుంది.

ఎస్.కె.కె.రవళి

ఎదిగాక ఆకుపచ్చగా మారే పాము

ఆఫ్రికాలో మాత్రమే కన్పించే ఈ గ్రీన్ ట్రీ పైథాన్ పాములు పుట్టినప్పుడు ఆకుపచ్చ రంగులో ఉండవు. సాధారణంగా ఇవి పసుపు, ఎరుపు, అరుదుగా లేత నీలిరంగులో ఉంటాయి. ఎదిగేకొద్దీ వాటి రంగు మారుతూ ఉంటుంది. పూర్తిగా ఎదిగాక ఆకుపచ్చ రంగులోకి మారిపోతాయి. జతకలిసే వయసు వచ్చేసరికి ముదురు ఆకుపచ్చ రంగులోకి మారిపోతాయి. సాధారంగా అవి జీవితాంతం చెట్లపైనే బతికేస్తాయి. సంపర్క సమయంలో మగవి, గుడ్లు పెట్టే సమయంలో ఆడవి చాలా చురుకుగా, దూకుడుగా వ్యవహరిస్తాయి. పాములను పట్టుకుని, పెంచేవారిలో ఎక్కువమంది ఇష్టపడే పాము ఇదే.

ఎస్.కె.కె.రవళి

పుట్టినప్పుడు తెల్లగా... ఆ తరువాత నల్లగా

మధ్య, పశ్చిమ ఆఫ్రికాలోని పదిహేను దేశాల్లో మాత్రమే కన్పించే ఓల్డ్‌వరల్డ్ మంకీ విభాగానికి చెందిన ఈ కోతులను ‘కింగ్ కొలబొ మంకీస్’గా పిలుస్తారు. నైజిరియా, లైబీరియా, ఘనా, సియర్రాలియోన్, కెన్యా, కాంగో వంటి దేశాల్లో ఇవి ఎక్కువగా కన్పిస్తాయి. నలుపు, తెలుపు, ఎరుపు రంగులతో కూడిన శరీర భాగాలతో ఇవి కన్పిస్తాయి. చెట్లపై తిరిగే ఇవి నేలపై అరుదుగా తిరుగుతాయి. చెట్లపై చిగుర్లు, పూలమొగ్గలను ఇవి తింటాయి. మిగతా కోతులకు భిన్నంగా వీటికి బొటనవేళ్లు ఉండకపోవడం విశేషం. పుట్టినప్పుడు తెల్లగా మెరిసిపోయే ఇవి క్రమంగా నల్లగా మారతాయి. దాదాపు ఏడాది వయస్సు వచ్చేసరికి అవి పూర్తిరూపం ధరిస్తాయి.

ఎస్.కె.కె.రవళి

చెట్లపై జీవించే కంగారూలు

పొట్టపై సంచీ, పొట్టి చేతుల్లాంటి ముందుకాళ్లు, భారీగా ఉండే పెద్దకాళ్లతో కన్పించే కంగారూలు అందరికీ తెలిసినవే. కానీ ఒకరకం కంగారూలు చెట్లపై మాత్రమే జీవిస్తాయి. అడపాదడపా నేలపైకి వచ్చినా చెట్లపై ఉండటానికే ఇష్టపడతాయి. కాస్త ఎరుపు, జేగురు కలిసినట్లుగా, అసలు కంగారూలు, లీమర్‌ల పోలికలతో ఇవి కన్పిస్తాయి. వీటికి పొడవైన తోక ఉంటుంది. అసలు కంగారూల మాదిరిగా పొట్టపై సంచీ ఉంటుంది. చెట్లపై ఉండే ఇవి 60 అడుగుల ఎత్తునుంచి నేలపైకి దూకినా వీటికి ఏమీకాదు. దీని శరీర నిర్మాణం అలా ఉంటుంది మరి. వీటి పిల్లలు తల్లినే అంటిపెట్టుకుని ఉంటాయి. దాదాపు 18 నెలల వయసు వచ్చేవరకు అంతే.

ఎస్.కె.కె.రవళి

కర్రపెండలం...సగ్గుబియ్యం.. ఇంధనం

ముత్యాల్లా తెల్లగా మిలమిల మెరిసిపోయే సగ్గుబియ్యం నిజానికి గింజలు కాదు. అది నేరుగా తయారయ్యే పదార్థమూ కాదు. గొట్టాల్లా పెరిగే కర్రపెండలం పొడితో తయారయ్యే సగ్గుబియ్యం మంచి పౌష్టికాహారం. సులువుగా జీర్ణమయ్యే పదార్థం. అందుకే పిల్లలకు, అనారోగ్యం నుంచి కోలుకుంటున్నవారికి అది చక్కటి ఆహారం. పిండిపదార్థం ఎక్కువగా ఉన్న పంటల్లో వరి, మొక్కజొన్న తరువాత కర్రపెండలం మూడోస్థానంలో ఉందంటో ఇది ఎంత బలవర్ధకమైన ఆహారమో అర్థమవుతుంది. అన్నట్లు కర్రపెండలం ద్వారా తయారయ్యే చిప్స్, కేక్స్, వేపుళ్లు, పచ్చళ్లు, సగ్గుజావ, పాయసం, కిచిడీ, పుడ్డింగ్ సంగతి పక్కనపెడితే బ్రెజిల్, చైనా మరో ప్రయోజనాన్ని గరిష్ఠంగా పొందుతున్నాయి.

ఎస్.కె.కె.రవళి

మినుములతో సిమెంటింగ్

ఇడ్లీ, దోశ వంటి తినుబండారాలకు ముడి సరుకైన మినుములు అందరికీ తెలిసిన పప్పుదినుసులే. అయితే ఇవి కేవలం తినే వస్తువే కాదు. పూర్వం రోజుల్లో భవన నిర్మాణంలో సిమెంటింగ్ ఏజెంట్‌గా ఉపయోగించేవారట. వాటర్‌ప్రూఫ్, సిమెంటింగ్ మోర్టార్‌గా దీనిని వాడేవారు. భారత ఉపఖండంలో విస్తృతంగా పండే మినుముల ఉత్పత్తిలో భారత్, మయన్మార్, థాయ్‌లాండ్ అగ్రస్థానాల్లో ఉన్నాయి. ఉత్పత్తిలోను, వాడకంలోనూ భారత్ మొదటి స్థానంలో ఉంటే మినుముల ఎగుమతిలో మయన్మార్ తొలిస్థానంలో ఉంది.

అతి త్వరగా ఎదిగే డేగ

గద్దలు, డేగలు పుట్టిన తరువాత అతివేగంగా ఎదుగుతాయి. ముఖ్యంగా డేగల్లో అతిచిన్న జాతి పక్షులు కేవలం నెలలోనే పూర్తిగా ఎదుగుతాయి. పెద్దగా ఉండే జాతి పక్షులు కేవలం 11 వారాల్లో పూర్తిగా ఎదుగుతాయి. అవి ఆహారం పట్టుకునేందుకు గాలిలోంచి నేలమీదకు గంటకు 200 మైళ్ల వేగంతో దూసుకువస్తాయి. మనిషికన్నా ఎనిమిదిరెట్ల సునిశితంగా ఇవి చూడగలవు. చాలా జంతువులు, పక్షులకన్నా అవి మెరుగ్గా, ఎక్కువ రంగులను గుర్తిస్తాయి. అవి దాడి చేసి ఆహారం తిన్నాక మర్నాడు అవశేషాలను కక్కేస్తాయి. సాధారణంగా అవి తిన్న జంతువులు, పక్షుల బొచ్చు బయటకు వచ్చేస్తుంది. అంటార్కిటికాలో తప్ప అన్ని ఖండాల్లోని ఇవి కన్పిస్తాయి.

ఎస్.కె.కె.రవళి

కుందేళ్లలా గెంతే క్షీరదం

ఎలుకలా కన్పించే ఈ క్షీరదం పేరు ‘ఎలిఫెంట్ ష్రూ’. వీటికి ఉండే పొడవైన నాసిక వల్ల ఆ పేరు వచ్చింది. జన్యుపరంగా అవి ఎలుకలు, ట్రూ ష్రిల్ జాతికన్నా ఏనుగులకు దగ్గరివిగా చెబుతారు. పెద్దకళ్లు, విశాలమైన చెవులు, పొడవైన వెనుక కాళ్లు, ఒతె్తైన బొచ్చు వీటి ప్రత్యేకత. ఇవి ఉండే బొరియల నుంచి విభిన్నమైన మార్గాలను (కాల్వల్లా) తవ్వుతాయి. ఆ దార్లలో తిరిగే కీటకాలను తింటాయి. ప్రమాదం ఎదురైతే ఏదో ఒకదారిలోంచి తప్పించుకుంటాయి. ప్రమాదం ముంచుకొస్తే కుందేళ్ల మాదిరిగా గెంతుతూ పారిపోతాయి. ఒక్కోసారి అవి మూడడుగుల ఎత్తు వరకు ఎగరగలుగుతాయి. అందుకే వీటిని ‘జంపింగ్ ష్రూ’ అని కూడా పిలుస్తారు.

ఎస్.కె.కె.రవళి

ఇవి ముంగిసలకు బంధువులు

క్యాట్ ఫ్యామిలీకి చెందిన పులుల్లా కన్పిస్తున్న ఈ క్షీరదం పేరు ‘్ఫస్సా’. ఇవి కేవలం మడగాస్కర్ దీవుల్లోనే కన్పిస్తాయి. శాస్తవ్రేత్తలుకూడా వీటిని నిన్నమొన్నటివరకు క్యాట్ ఫ్యామిలీకి చెందినవిగానే భావించారు. కానీ అవి ముంగిస జాతికి చెందినవని తేలింది. పొడవైన తోక ఉండే ఇవి చెట్లపైనే జీవిస్తాయి. సులభంగా చెట్లపై గెంతుతాయి. వాటి నడక భల్లూకం నడకలా అన్పిస్తుంది. ఆడామగ ఫొస్సాల కలయిక సుదీర్ఘకాలంపాటు, మిగతా క్షీరదాలకు భిన్నమైన పద్ధతుల్లో చెట్ల చిటాలుకొమ్మలపై సాగుతుంది. బలమైన కోరపళ్లు వీటికి ప్రత్యేకం. వీటి ఎద, ఉదరం, పృష్ఠ్భాగంలో ఉండే గ్రంథులు స్రవించే సెంట్‌తో అవి సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకుంటాయి.

ఎస్.కె.కె.రవళి

నీరు లేకపోయినా బతికే అతిచిన్న నక్క

సహారా ఎడారి ప్రాంతంలో కన్పించే ఈ నక్కలు ఆ జాతిలో అతి చిన్నవి. మన ఇళ్లల్లో కన్పించే పిల్లులకన్నా చిన్నగా ఉంటాయి. ఏడునుంచి 10 అంగుళాల సైజులో మాత్రమే ఇవి ఉంటాయి. వీటి శరీరంలో మూడొంతులకు సమానమైన పొడవైన చెవులు వీటికి ప్రత్యేకం. సునిశితమైన వినికిడి శక్తితో వాటి ఆహారాన్ని గుర్తిస్తాయి. శరీరంలో వేడిని నియంత్రించుకునేందుకు ఈ చెవులను ఉపయోగించుకుంటాయి. వీటి పాదాల్లోనూ బొచ్చు ఉండి ఇసుకలో వేడినుంచి రక్షణ పొందుతుంది. ఇవి ఎంత చిన్నవిగా ఉన్నా ఆహారాన్ని ఒడిసిపట్టుకునేందుకు అవసరమైతే రెండు మూడడుగులు ఎగిరి గెంతులు వేస్తాయి. పరిమాణాన్ని బట్టి వీటిని ఫెనె్నక్స్ ఫాక్స్ అని పిలుస్తారు.

Pages