Aadivavram - Meeku Telusaa?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మీకు తెలుసా ?

Hide this category: 
Hide

మనిషికన్నా కోడిపిల్లలకు చురుకుదనం ఎక్కువ

ఇది నిజమేసుమా. అప్పుడే పుట్టిన పసికందుకన్నా, అప్పుడే పుట్టిన కోడిపిల్ల చురుకుగా ఉంటుంది. అదీగాక చుట్టుపక్కల పరిస్థితులను అర్థం చేసుకోవడం, అవగాహన, అలవాటు చేసుకోవడం, భద్రతను చూసుకోవడం దీనికి తక్షణమే అలవడుతుంది. అలాగే కోడిగుడ్డుపై 17వేలకుపైగా సూక్ష్మరంధ్రాలుంటాయి. కాల్షియం కార్బొనేట్‌తో తయారయ్యే కోడిగుడ్డు పెంకునుండి ఆక్సిజన్ లోపలికి వెళ్లడానికి, కార్బన్‌డయాక్సైడ్, ధూళి బయటకు రావడానికి ఈ రంధ్రాలు ఉపయోగపడతాయి. ఇవి సాధారణంగా కంటికి కన్పించవు. ఇక గుడ్డురంగు కోడి రంగునుబట్టి ఉంటుంది. తెల్లగా ఉండేకోళ్లు తెల్లగుడ్డు పెడతాయి.

-ఎస్.కె.కె.రవళి

కన్ను సైజు ఎప్పటికీ మారదు

మనిషి శరీరంలో అత్యంత క్లిష్టమైన నిర్మాణవ్యవస్థ ఉన్న భాగం మెదడు. ఆ తరువాత అలాంటి భాగం కన్ను. మెదడుకు, కంటికి లింక్‌గా ఉండే ‘ఆప్టిక్ నెర్వ్’ అతి సున్నితమైన, క్లిష్టమైన నిర్మాణంతో ఉంటుంది. దీనికి ఆపరేషన్ చేయడం ఇప్పటివరకు మనిషికి సాధ్యం కాలేదు. అందుకే ఐ ట్రాన్స్‌ప్లాంటేషన్ ఇప్పటికి సాధ్యం కావడం లేదు. ఇక మనిషి పుట్టినప్పడు ఎంత పరిమాణంలో కన్ను ఉంటుందో జీవితాంతం అదే సైజులో ఉంటుంది. అన్నట్లు పసికందులు ఏడ్చినప్పుడు కన్నీళ్లు రావు. కొన్ని నెలలు ఎదిగాక మాత్రమే వారి కళ్లు అశ్రువులను వదులుతాయి. పుట్టుకతో కంటిచూపులేనివారికి ‘కలలు’ కన్పించవు.

కొబ్బరి కోసే కోతులు

నిటారుగా, ఎత్తుగా ఎదిగే కొబ్బరిచెట్లు ఎక్కి కాయలను తెంపడం మనిషికి కష్టమైన పనే. పైగా ప్రాణానికి ప్రమాదంకూడా. కానీ కోతులకు అది పెద్దకష్టమైన పనికాదు. అందుకే ఒకజాతికి చెందిన కోతులను కొబ్బరికాయలు తెంపే పనిలో శిక్షణ ఇచ్చి వదులుతున్నారు. ముఖ్యంగా థాయ్‌లాండ్, మలేషియాల్లో ఇందుకోసం ప్రత్యేక శిక్షణ సంస్థలు ఉన్నాయి. వాటికి మంచి డిమాండ్‌కూడా ఉంది. అయితే చెట్లెక్కి కాయలను తెంపేందుకు ఏ కోతి పడితే అది పనికిరాదు. ‘పిగ్ టెయిల్ మంకీ’కి పిలిచే ఒక రకం కోతులను మాత్రమే ఇందుకు వినియోగిస్తారు. బలిష్టంగా ఉండే వీటి తోకలు పంది తోకల్లా మెలి తిరిగి ఉంటాయి. అందుకే వాటికి ఆ పేరు వచ్చింది.

-ఎస్.కె.కె.రవళి

ఫుట్‌బాల్ సైజులో ఉండే కళ్లు

ప్రపంచంలో ఇప్పటికీ మిస్టరీగా ఉన్న జెయింట్ స్క్విడ్స్ సజీవంగా కన్పించినది 2004లో మాత్రమే. తొలిసారి దానిని జపాన్ పరిశోధకులు చూశారు. 2006లో తొలిసారిగా దాని కదలికలను వీడియో తీయగలిగారు. అంతకుమించి దాని గురించి వారికి తెలిసింది చాలా తక్కువే. వాటి కళేబరాలు, మృతదేహాలు, శిలాజాల ఆధారంగా మాత్రమే కొన్ని విషయాలను కనుగొన్నారు. వీటి పొడవు కనీసం 50 అడుగులు ఉంటుంది. దాదాపు టన్ను బరువుంటుంది. వీటి కళ్లు 11 అంగుళాల వ్యాసార్థంతో భయపెట్టేవిగా ఉంటాయి. వీటి కళ్లలో కనుపాప నల్లగా ఉన్నా చుట్టూ ఉండే తెల్లటిగుడ్డులో అంతా నీరే ఉంటుంది.

-ఎస్.కె.కె.రవళి

పన్నెండేళ్లకోసారి పూసే నీల్‌కురింజి

పశ్చిమ కనుమలను నీలగిరులని పిలుస్తారుకదా..కానీ అక్కడ (తమిళనాడు-కేరళ) నీలం అంటే...ఊదారంగనే అర్థం. ఆ కొండలను దూరంనుంచి చూస్తే నీలవర్ణంలో కన్పిస్తాయి. సాధారణంగా అలా కన్పించినా పనె్నండేళ్లకోసారి మాత్రం ఆ కొండకోనలన్నీ అచ్చమైన నీలగిరులు (ఊదారంగుపూలతో)గా కన్పిస్తాయి. అందమైన నీల్‌కురింజి పూలు పెద్దఎత్తున వికసించి పశ్చిమ కనుమలన్నీ పూలపాన్పులైపోతాయి. ఈ పూలు వికసించినప్పుడు ఆ గిరుల అందాన్ని చూడటానికి లక్షల సంఖ్యలో పర్యాటకులు తరలివస్తారు. ఇక్కడ ఇంకో విశేషం ఉంది. ఈ అందమైన గొట్టంపూలలో ఉండే మధురమైన మకరందంకోసం మరేపూలకూ వెళ్లనన్ని సంఖ్యలో తుమ్మెదలు, తేనెటీగలు తరలివస్తాయి.

-ఎస్.కె.కె.రవళి

కొంగల ప్రత్యేకతే వేరు...

కొంగజపం అని వెటకారం చేస్తారుగానీ..వాటి ప్రత్యేకతలు తెలిస్తే ఆశ్చర్యపోతాం. పక్షిజాతిలో ఇవి ఎగరగలిగినంత ఎత్తుకు మరే పక్షీ ఎగరలేదు. అవసరమైతే ఆకాశంలో ఇవి 32,800 అడుగుల ఎత్తునకూడా ధీమాగా ఎగరగలవు. వలసవెళ్లే సమయంలో కనీసం 10వేల మైళ్లదూరాన్ని అధిగమిస్తాయి. అవసరమైతే రోజుకు 500 మైళ్ల దూరం ఎగురుతాయి. ఒకసారి జతగడితే ఆ పక్షులూ రెండూ జీవితాంతం కలిసే ఉంటా యి. పిల్లల్ని కలసి సాకుతాయి. అన్నట్లు కొంగల పిల్లలు నించునే నిద్రపోతాయి తెలుసా.

-ఎస్.కె.కె.రవళి

స్ట్రాబెర్రి.. ఓ వెర్రి

తియ్యటి రుచి, ఆకట్టుకునే రంగు, మంచి పరిమళంతోకూడిన స్ట్రాబెర్రి నిజానికి బెర్రి జాతికి చెందినది కాదు. అది గులాబి జాతికి చెందిన పండు. ఈ పళ్లంటే కొందరికి తెగ ఇష్టం. వింబుల్డన్‌లో టెన్నిస్ మ్యాచ్‌ల సీజన్‌లో అక్కడివారు 27వేల కిలోల పళ్లు తినేస్తారుట. పండు బయట విత్తనాలుండటం దీని ప్రత్యేకత. ప్రతి పండుకు 200 విత్తనాలుంటాయి. అన్నట్లు బయట కన్పించే ప్రతి విత్తనం అసలుది కాదు. అందులో మళ్లీ అసలు విత్తనాలుంటాయి తెలుసా. అమెరికాలో వీటి ఉత్పత్తి చాలా ఎక్కువ. బెల్జియంలో వీటికోసం ఏకంగా ఓ మ్యూజియం (స్ట్రాబెర్రి మ్యూజియం) ఉంది. అక్కడ స్ట్రాబెర్రి చరిత్ర, ఆధారాలు వివరిస్తారు.

-ఎస్.కె.కె.రవళి

Pages