S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

12/11/2016 - 04:02

బాసర, డిసెంబర్ 10: బాసర సరస్వతి దేవి సన్నిధికి శనివారం భక్తజనం పోటెత్తారు. వరుస సెలవుదినాలతో భారీగా భక్తులు తరలివస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాక మహారాష్ట్ర నుండి వస్తున్న భక్తులతో ఆలయం సందడిగా మారింది. గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించి గోదారమ్మకు పూజలు చేశారు. ఆలయంలో కొలువుదీరిన అమ్మవార్ల ను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. తమ చిన్నారులకు అక్షరాభ్యాస పూజలను జరిపించారు.

12/11/2016 - 04:01

తూప్రాన్, డిసెంబర్ 10: గ్రామ అభివృద్దికి మల్కాపూర్ యువత చేస్తున్న అభివృద్ది రాష్ట్రానికి ఆదర్శంగా నిలుస్తుందని డిప్యూటీ స్పీకర్ పద్మదేవేందర్‌రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని మల్కాపూర్ గ్రామంలో పాఠశాల భవనాన్ని ప్రారంభించిన అనంతరం జరిగిన సభలో మాట్లాడారు.

12/11/2016 - 04:00

మెదక్, డిసెంబర్ 10: అరకొరకొరగా నైనా నగదు డ్రా చేసుకునే అవకాశం లేకుండా వరుసగా మూడు రోజులు సెలవుదినాలు రావడంతో సామాన్య, మధ్య తరగతి జనం ఉసూరుమంటున్నారు. నోట్ల రద్దుతో వివిధ వ్యాపార రంగాలు తిరోగమనం పట్టాయ. పెద్దనోట్లతో చిల్లర లేక వ్యాపారాలు కొనసాగడం లేదని వ్యాపారులు వాపోతున్నారు.

12/11/2016 - 03:59

సంగారెడ్డి టౌన్, డిసెంబర్ 10: కొండాపూర్ మండలం మునిదేవునిపల్లి గ్రామ శివాలయంలో శనివారం లింగ ప్రతిష్ఠాపన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య ఉదయం నుంచి ప్రత్యేక పూజలు నిర్వహించి లింగ ప్రతిష్ఠ చేశారు. సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్‌రెడ్డి (జగ్గారెడ్డి) ప్రతిష్ఠాపన మహోత్సవానికి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు.

12/11/2016 - 03:58

సిద్దిపేట, డిసెంబర్ 10 : ప్రజల భాగస్వామ్యంతో సిద్దిపేట నియోజక వర్గాన్ని నగదు రహిత నియోజకవర్గంగా తీర్చిదిద్దుకుందామని ఎమ్మెల్సీ ఫారూక్‌హుస్సేన్ అన్నారు. శనివారం సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లు రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయంతో సామాన్య, మధ్య తరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు.

12/11/2016 - 03:57

జోగిపేట, డిసెంబర్ 10: తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఏర్పడినప్పటి నుంచి తెలంగాణ ఉద్యమం కోసం పోరాటం చేసిన బిబి.నాగభూషణంకు జోగిపేట మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తెరాస ఏర్పడినప్పటి నుంచి ఆయన అందోల్ నియోజకవర్గంలో ఉద్యమాలు కొనసాగించారు. ఆయనకు మంత్రి పదవి ఇవ్వడానికి రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు కృషి చేశారు.

12/11/2016 - 03:55

నిజామాబాద్, డిసెంబర్ 10: పెద్ద నోట్ల రద్దు నిర్ణయం అమల్లోకి వచ్చి నెల రోజులు గడిచినా, కరెన్సీ కష్టాలు మాత్రం దూరం కావడం లేదంటూ సామాన్య ప్రజానీకం ఉసూరుమంటున్నారు. ఎవరిని కదిలించినా, ఏదో ఒక సందర్భంలో తమ దైనందిన అవసరాలను తీర్చుకోలేక నగదు కొరతతో సతమతం కావాల్సి వస్తోందంటూ ఆవేదన వెలిబుచ్చుతున్నారు. అత్యవసర పరిస్థితులు ఎదురైన వారైతే ఉన్నపళంగా నగదును సమకూర్చుకునేందుకు పడరాని పాట్లు పడుతున్నారు.

12/11/2016 - 03:55

నిజామాబాద్, డిసెంబర్ 10: బ్యాంకు ఖాతాలు లేని వారిని గుర్తిస్తూ, ఈ నెల 15వ తేదీలోగా వారందరికీ జన్‌ధన్ ఖాతాలు తెరిపించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డాక్టర్ యోగితారాణా అధికారులను ఆదేశించారు. ప్రగతిభవన్‌లో శనివారం డ్వామా అధికారులు, ఉపాధి హామీ ఎపిఎంలతో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లో ఇంకనూ అనేక మందికి బ్యాంకు ఖాతాలు లేవని అన్నారు.

12/11/2016 - 03:53

కంఠేశ్వర్, డిసెంబర్ 10: అనేక పోరాటాల ఫలితంగా ఏర్పడిన తెలంగాణను బంగారు తెలంగాణగా తీర్చి దిద్దేందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అకుంఠిత దీక్షతో కృషి చేస్తున్నారని అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్‌గుప్తా పేర్కొన్నారు.

12/11/2016 - 03:53

దోమకొండ, డిసెంబర్ 10: విద్యార్థినులు, మహిళలను అకతాయిల వేదింపుల భారి నుండి పూర్తి రక్షణ కల్పించేదుకే షీట్లీంలను ఏర్మాటు చేయటం జరిగిందని కామారెడ్డి డిఎస్పీ భాస్కర్ అన్నారు.

Pages