S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

12/10/2016 - 00:00

న్యూఢిల్లీ, డిసెంబర్ 9: థియేటర్లలో సినిమా ప్రారంభానికి ముందు జాతీయ గీతం ప్రదర్శించాల్సిందేనని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. అయితే విషయంలో దివ్వాంగులకు కోర్టు మినహాయింపుఇచ్చింది. జాతీయ గీతం ప్రదర్శించేటప్పుడు దివ్యాంగులు లేచి నిలబడాల్సిన అవసరం లేదని జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ అమిత్వారాయ్‌తో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది.

12/09/2016 - 23:53

శ్రీకాకుళం, డిసెంబర్ 9: అవినీతి అంటే ఆగ్రహం కట్టలు తెంచుకుని - పాలకులైనా, ప్రభుత్వ అధికారులైనా కడిగిపారేయడం కలెక్టర్ డాక్టర్ పి.లక్ష్మీనృసింహంకు అలవాటే.

12/09/2016 - 23:52

శ్రీకాకుళం, డిసెంబర్ 9: బీదోళ్ళ పీకనొక్కేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తే - వచ్చే ఎన్నికల్లో టిడిపి పాలకుల పీకను బీదలు నొక్కేస్తారంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు హెచ్చరించారు. శుక్రవారం ఇక్కడ కలెక్టరేట్ వద్ద జిల్లా వైకాపా ఆధ్వర్యంలో ఆరోగ్యశ్రీ ప్రజాహక్కు అంటూ నిర్వహించిన ధర్నా కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.

12/09/2016 - 23:51

శ్రీకాకుళం(రూరల్); డిసెంబర్ 9: రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ మాలకొండయ్య శుక్రవారం సాయంత్రం శ్రీకాకుళం ఆర్టీసీకాంప్లెక్స్‌ను పరిశీలించారు. అభివృద్ధికి అవకాశం ఉన్న విషయాలపై ప్రాంతీయ మేనేజర్ ఆర్.అప్పన్నను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ఆర్టీసీ ప్రస్తుత కొంతమేర నష్టాల్లో ఉందని దాన్ని భర్తీ చేసే చర్యలను చేపడుతున్నట్లు చెప్పారు.

12/09/2016 - 23:51

నరసన్నపేట, డిసెంబర్ 9: రాష్ట్ర దేవాదాయ శాఖ నిరుపేద వర్గాలకు ఉచితంగా పుణ్యక్షేత్రాలు దర్శనార్థం దివ్యదర్శనం కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిందని దీనిని సద్వినియోగం చేసుకోవాలి తహశీల్దార్ జె.రామారావు తెలిపారు. శుక్రవారం స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో దివ్యదర్శనానికి సంబంధించి పెట్టెను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.

12/09/2016 - 23:50

పాతశ్రీకాకుళం, డిసెంబర్ 9: రాష్ట్ర బ్రాహ్మణ సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ప్రధానకార్యదర్శి ఐ.వై.ఆర్ కృష్ణారావు ఈనెల 10,11వ తేదీల్లో జిల్లాలో పర్యటించనున్నట్టు కలెక్టర్ పి.లక్ష్మీనృసింహం తెలిపారు.

12/09/2016 - 23:50

శ్రీకాకుళం(టౌన్), డిసెంబర్ 9: మారుమూల గ్రామాల్లోని నగదురహిత లావాదేవీలపై అవగాహన కలిగించేందుకు ఆర్‌బిఐ స్టేట్‌బ్యాంకు ఏర్పాటు చేసిన సంచార రథాన్ని ఓటర్ల జాబితా పరిశీలకుడు ఐ.శ్రీనివాస శ్రీనరేష్, కలెక్టర్ పి.లక్ష్మీనృసింహం, ఎస్ బిఐ రీజనల్ మేనేజర్ డి.మేరీసగాయతోపాటు శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఆవరణంలో జెండా ఊపి ప్రారంభించారు.

12/09/2016 - 23:49

శ్రీకాకుళం, డిసెంబర్ 9: ప్రజాస్వామ్యవ్యవస్థలో కీలకమైన ఎన్నికల ప్రక్రియలో కచ్చితమైన ఓటర్ల జాబితా తయారీలో ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఓటర్ల జాబితా పరిశీలకుడు ఐ.శ్రీనివాసశ్రీనరేష్ తెలిపారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయం సమావేశమందిరంలో 2017 స్పెషల్ సమ్మరీ రివిజన్‌పై నిర్వహించిన సమావేశానికి ఆయన విచ్చేసారు. ఈ సందర్భంగా మట్లాడుతూ ఓటర్ల జాబితా తయారీ ఒక నిరంతర ప్రక్రియ అన్నారు.

12/09/2016 - 23:48

కర్నూలు, డిసెంబర్ 9 : కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తరువాత నల్ల కుబేరులు కొనుగోలు చేసిన బంగారంపై ఆదాయ పన్ను శాఖ అధికారులు దృష్టి సారించారు. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం అనంతరం ఏర్పడిన పరిణామాల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్దఎత్తున బంగారు అమ్మకాలు జరిగినట్లు వాణిజ్య పన్నుల శాఖ అధికారుల ద్వారా వివరాలు తెలుసుకున్న ఐటి అధికారులు ఆ వివరాలపై మరింత కూపీ లాగుతున్నట్లు సమాచారం.

12/09/2016 - 23:47

ఆదోని, డిసెంబర్ 9: ప్రజలకు చౌక దుకాణాల ద్వారా అందజేసే నిత్యావసర వస్తువుల స్టాక్‌పాయింట్ అక్రమల పుట్ట అంటూ ఎన్నో సార్లు ఆంధ్రభూమి స్టాక్‌పాయింట్‌లో జరిగే అవినీతి అక్రమాలను వెలుగులోకి తెచ్చిం ది. అయితే ఎట్టకేలకు ఆలస్యంగానైన ఆదోని స్టాక్‌పాయింట్‌పైన విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు నిఘా పెట్టి అక్రమంగా తరలిస్తున్న 99 బస్తాల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.

Pages