S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

11/27/2016 - 07:50

న్యూఢిల్లీ, నవంబర్ 26: పాత 500, 1,000 రూపాయల నోట్లను మొబైల్ ఫోన్ల కొనుగోలుకు అనుమతించాలని కేంద్ర ప్రభుత్వానికి ఇండియన్ సెల్యులార్ అసోసియేషన్ (ఐసిఎ) విజ్ఞప్తి చేసింది. ఈ నోట్ల రద్దు నిర్ణయంతో మొబైల్ ఫోన్ల అమ్మకాలు 50 శాతం పడిపోయాయని తెలిపింది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీకి ఈ మేరకు ఐసిఎ ఓ లేఖను రాసింది.

11/27/2016 - 07:49

తిరుపతి, నవంబర్ 26: నల్లధనాన్ని వెలికి తీసి దేశంలోని పేద ప్రజలకు మేలు చేయాలన్న సత్సంకల్పంతో పెద్ద నోట్లు రద్దుచేస్తూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తీసుకున్న నిర్ణయాన్ని సామాన్య ప్రజలు స్వాగతిస్తున్నారని, అయితే విపక్షాలు స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం రాద్ధాంతం చేస్తున్నాయని కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు.

11/27/2016 - 07:49

న్యూఢిల్లీ, నవంబర్ 26: అత్యంత కీలక ఆర్థిక సంస్కరణల్లో పాత పెద్ద నోట్ల రద్దు నిర్ణయం కూడా ఒకటి అని ప్రముఖ పారిశ్రామికవేత్త, టాటా సన్స్ తాత్కాలిక చైర్మన్ రతన్ టాటా అన్నారు. అయితే నోట్ల రద్దు నేపథ్యంలో సామాన్యులు ఎదుర్కొంటున్న ఇబ్బందుల దృష్ట్యా కొన్ని ప్రత్యేక చర్యలు చేపట్టాల్సి ఉందని అభిప్రాయపడ్డ రతన్ టాటా.. నల్లధనంపై పోరుకు నోట్ల రద్దు దోహదపడుతుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.

11/27/2016 - 07:48

విజయవాడ, నవంబర్ 26: రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న ప్రజా సాధికారత సర్వే.. కుటుంబాలకు సంబంధించిన డేటా సర్వే మాత్రమే కాదని ఇదొక డైనమిక్ సర్వే అని సిఎం సంయుక్త కార్యదర్శి పిఎస్ ప్రద్యుమ్న అన్నారు. ప్రజాసాధికారత సర్వే 2016ను రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచనలకు అనుగుణంగా చేస్తున్నామని, ఇది నిరంతర ప్రక్రియ అని ఆయన తెలిపారు.

11/27/2016 - 07:43

కౌలూన్, నవంబర్ 26: హాంకాంగ్ ఓపెన్ సూపర్ సిరీస్ బాడ్మింటన్ టోర్నమెంట్ పురుషుల సింగిల్స్ సెమీ ఫైనల్‌లో భారత యువ ఆటగాడు సమీర్ వర్మ సంచలనం సృష్టించాడు. అన్‌సీడెడ్‌గా బరిలోకి దిగి, ఒక్కో అడ్డంకిని సమర్థంగా అధిమిస్తూ ముందుకు సాగుతున్న అతనికి సెమీ ఫైనల్‌లో మూడోసీడ్ ఆటగాడు జాన్ ఒ జొర్గెనె్సన్ ఎదురయ్యాడు.

11/27/2016 - 07:40

బ్యాంకాక్, నవంబర్ 26: మహిళల ఆసియా కప్ క్రికెట్ చాంపియన్‌షిప్‌లో హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలోని భారత జట్టు శుభారంభం చేసింది. శనివారం జరిగిన మొదటి మ్యాచ్‌లో ఈ జట్టు 64 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌ను చిత్తుచేసింది. వనే్డ ఫార్మాట్‌లో జట్టుకు నాయకత్వం వహిస్తున్న మిథాలీ రాజ్ 49 పరుగులతో నాటౌట్‌గా నలవగా, స్మృతి మందానా 41 పరుగులు చేసి, భారత్ విజయంలో తన వంతు పాత్ర పోషించింది.

11/27/2016 - 07:40

మొహాలీ, నవంబర్ 26: భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య శనివారం ప్రారంభమైన రెండో టెస్టు మొదటి రోజు ఆటలో సంకుల సమరం కొనసాగింది. భారత బౌలింగ్, ఇంగ్లాండ్ బ్యాటింగ్ మధ్య పోరు రసవత్తరంగా జరిగింది. ఇంగ్లాండ్ వికెట్‌కీపర్-బ్యాట్స్‌మన్ జానీ బెయిర్‌స్టో అద్భుతమైన పోరాట పటిమ కనబరిచాడు. బెన్ స్టోక్స్‌తో కలిసి ఐదో వికెట్‌కు 57, జొస్ బట్లర్‌తో కలిసి ఆరో వికెట్‌కు 69 పరుగుల భాగస్వామ్యాలను అందించాడు.

11/27/2016 - 07:38

మొహాలీ: బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడినట్టు బ్రిటిష్ మీడియా నుంచి విమర్శలు ఎదుర్కొంటున్న భారత టెస్టు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో వివాదంలో చిక్కుకున్నాడు. ఇంగ్లాండ్‌తో శుక్రవారం మొదలైన మూడో టెస్టు మ్యాచ్ మొదటి రోజు ఆటలో బెన్ స్టోక్స్‌తో అనుచితంగా ప్రవర్తించాడని బ్రిటన్ నుంచి వచ్చిన పాత్రికేయులు ఆరోపించడంతో, కొత్త వివాదం తెరపైకి వచ్చింది.

11/27/2016 - 07:37

మెల్బోర్న్, నవంబర్ 26: నాలుగు దేశాల హాకీ టోర్నమెంట్ టైటిల్ రేసు నుంచి భారత్ నిష్క్రమించింది. న్యూజిలాండ్‌తో శనివారం చివరి వరకూ హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో 2-3 తేడాతో పరాజయాన్ని ఎదుర్కొంది. దీనితో టైటిల్ కోసం పోటీపడే అవకాశాన్ని చేజార్చుకొని, ఆదివారం మూడో స్థానం కోసం మలేసియాతో పోరును ఖాయం చేసుకుంది. మ్యాచ్ ఆరంభమైన మొదటి 15 నిమిషాల్లో భారత క్రీడాకారులు దూకుడును ప్రదర్శించారు.

11/27/2016 - 07:36

మొహాలీ, నవంబర్ 26: భారత ఓపెనర్ లోకేష్ రాహుల్ చేతి గాయం పూర్తిగా నయం కాకపోవడంతో ఇంగ్లాండ్‌తో శనివారం ప్రారంభమైన మూడో టెస్టుకు దూరమయ్యాడు. విశాఖపట్నంలో జరిగిన రెండో టెస్టులో ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో రాహుల్ చేతికి గాయమైంది. నెట్ ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో రాహుల్‌కు నొప్పి మరింత పెరిగిందని, అందుకే మూడో టెస్టుకు అతను దూరమయ్యాడని జట్టు మేనేజ్‌మెంట్ ఒక ప్రకటనలో తెలిపింది.

Pages