S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

09/22/2016 - 07:55

వాషింగ్టన్, సెప్టెంబర్ 21: భారత్‌పైకి ఉగ్రవాదాన్ని ఎగదోస్తున్న పాకిస్తాన్‌కు ఇదో చెంపపెట్టు. అమెరికా ప్రతినిధుల సభలో ఉభయపక్షాలకు చెందిన ఇద్దరు శక్తివంతమైన సభ్యు లు పాకిస్తాన్‌ను ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న దేశంగా పేర్కొంటూ ఒక బిల్లును ప్రవేశపెట్టారు.

09/22/2016 - 07:35

ముంబయి, సెప్టెంబర్ 21: తెలుగు వీరుడు, మాజీ వికెట్‌కీపర్ ఎమ్మెస్కే ప్రసాద్ భారత జాతీయ సెలక్షన్ కమిటీ చైర్మన్‌గా ఎంపికయ్యాడు. ఐదుగురు సభ్యులతో కూడిన సెలక్షన్ కమిటీని బుధవారం ఇక్కడ జరిగిన భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) వార్షిక సర్వసభ్య సమావేశం (ఎజిఎం) ప్రకటించింది. వీరిలో ఇద్దరికి టెస్టు క్రికెట్ ఆడిన అనుభవం లేకపోవడం గమనార్హం.

09/22/2016 - 07:34

కాన్పూర్, సెప్టెంబర్ 21: భారత క్రికెట్ జట్టు గురువారం నుంచి చారిత్రక టెస్టు మ్యాచ్‌ని ఆడనుంది. న్యూజిలాండ్‌తో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా జరిగే ఈ మొదటి మ్యాచ్ టీమిండియాకు 500వ టెస్టు కావడం విశేషం. ఎంతో ప్రాధాన్యతను సంతరించుకున్న ఈ టెస్టులో చిరస్మరణీయ విజయాన్ని అందుకోవడానికి విరాట్ కోహ్లీ నాయకత్వంలోని భారత జట్టు పట్టుదలతో ఉంది. బ్రిటిష్ వలస దేశంగా 1932లో భారత్ మొదటిసారి టెస్టు మ్యాచ్ ఆడింది.

09/22/2016 - 07:33

ముంబయి, సెప్టెంబర్ 21: బిసిసిఐ కార్యదర్శిగా 62 ఏళ్ల అజయ్ షిర్కే ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. బుధవారం ఇక్కడ జరిగిన 87వ వార్షిక సర్వసభ్య సమావేశం అజెండాలో ఇదే కీలకాంశం. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) చైర్మన్‌షిప్ కోసం బోర్డు అధ్యక్ష పదవికి శశాంక్ మనోహర్ రాజీనామా చేయడంతో, అతని స్థానంలో, ఈ ఏడాది జూలై మాసంలో అనురాగ్ ఠాకూర్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించాడు.

09/22/2016 - 07:32

విజయవాడ (స్పోర్ట్స్): గుంటూరులో 1975 ఏప్రిల్ 24న జన్మించిన ఎమ్మెస్కే ప్రసాద్ అంతర్జాతీయ కెరీర్‌ను మొహాలీలో ప్రారంభించాడు. టెస్టు, వనే్డ ఇంటర్నేషనల్స్‌లో అతని ప్రస్థానం మొహాలీలోనే మొదలుకావడం విశేషం. 1998 మే 14న బంగ్లాదేశ్‌తో మొహాలీలో జరిగిన మ్యాచ్‌తో అతను వనే్డల్లో అరంగేట్రం చేశాడు.

09/22/2016 - 07:31

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 21: భారత మహిళల హాకీ జట్టు మాజీ కెప్టెన్ రీతూ రాణి కెరీర్‌కు గుడ్‌బై చెప్పింది. రియో ఒలింపిక్స్‌కు ఎంపిక చేయకపోవడం ఆమెను మానసికంగా కుంగతీసింది. హాకీ ఇండియా (హెచ్‌ఐ) వైఖరిని నిరసిస్తూ, బహిరంగంగానే వ్యాఖ్యలు చేసింది. హాకీ శిక్షణ శిబిరానికి ఎంపిక చేసిన ప్రాబబుల్స్‌లో రీతూకు చోటు కల్పించినప్పటికీ ఆమె సంతృప్తి చెందలేదు.

09/22/2016 - 07:24

ఆదోని, సెప్టెంబర్ 21: కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్‌యార్డులో బుధవారం రోజు పత్తి రికార్డు ధర పలికింది. క్వింటాలు పత్తి ధర రూ.6,670 పలికింది. ఇది దేశంలోనే రికార్డు. బుధవారం మార్కెట్‌కు 964 పత్తి చెక్కుల్లో 1908 క్వింటాళ్ళ పత్తి అమ్మకానికి వచ్చినట్లు వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షులు మదిరే భాస్కర్‌రెడ్డి తెలిపారు.

09/22/2016 - 07:21

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 21: ప్రస్తుతం మార్కెట్లో ఉన్న టెలికామ్ ఆపరేటర్లు ఇంటర్ కనెక్టివిటీ విషయంలో అనుసరిస్తున్న తీరుపై రిలయన్స్ జియో మరోసారి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది.

09/22/2016 - 07:19

ముంబయి, సెప్టెంబర్ 21: అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల ధోరణులు కొనసాగించినప్పటికీ దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం ఒడిదుడుకుల మధ్యనే సాగాయి. ప్రారంభంలో లాభాలతో మొదలైన మార్కెట్లు ఆ తర్వాత బ్యాంక్ ఆఫ్ జపాన్ పరపతి విధానం సమీక్ష తర్వాత మధ్యాహ్నం సమయానికి మరింతగా దూసుకెళ్లాయి. అయితే అమెరికా ఫెడరల్ రిజర్వ్ సమావేశం నేపథ్యంలో మదుపరులు లాభాల స్వీకరణ ధోరణిని కనబర్చడంతో ఆ లాభాలన్నిటినీ కోల్పోయాయి.

09/22/2016 - 07:19

విజయవాడ, సెప్టెంబర్ 21: రాష్ట్రంలో అంకుర పరిశ్రమలకు అనుమతులు ఇవ్వడంలో జాప్యాన్ని నివారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సింగిల్ డెస్క్ విధానం ఆచరణలో అత్యుత్తమ ఫలితాలనిస్తోంది. ఈ పథకానికి ప్రపంచ బ్యాంకు ప్రశంసలు కూడా లభించాయి. నూతన పారిశ్రామిక విధానంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2015 ఏప్రిల్ 29న దీనిని ప్రవేశపెట్టింది.

Pages