S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/23/2016 - 03:24

రాయచోటి, జూలై 22: ఎస్సీ, బీసీ హాస్టళ్లను ప్రభుత్వం ఎత్తివేస్తుండటం సరికాదని ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన తన కార్యాలయంలో విలేఖరులతో మాట్లాడుతూ విద్యారంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాల్సిన ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు.

07/23/2016 - 03:23

గాలివీడు, జూలై 22: మండలంలో చాలా మంది రైతులకు రుణ అర్హతా పత్రాలు అందకపోవడంతో రైతులు లబోదిబోమంటున్నారు. మొదటి విడత రుణ మాఫీలో భాగంగా అందరి రైతులకు రుణమాఫీ వర్తించింది. అయితే రెండో విడత మాత్రం చాలా మంది రైతులకు రుణ అర్హతా పత్రాలు అందకపోవడంతో రైతులు రుణమాఫీ వర్తిస్తుందో లేదోనని దిగాలుపడ్డారు. వ్యవసాయాధికరుల ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ వారీగా రైతులతో గ్రామసభలు నిర్వహించి రుణమాఫీ పత్రాలు అందజేశారు.

07/23/2016 - 03:22

రాజుపాళెం, జూలై 22: ఏ తల్లి కన్నబిడ్డనో ఆడ శిశువని నిర్దాక్షిణ్యంగా టంగుటూరు గ్రామం కుందూనది ఒడ్డున కంపచెట్లలో విడిచిన సంఘటన జరిగింది. సమాజంలో ఆడపిల్ల అంటే ఇప్పటికీ చిన్నచూపుగా పరిణమిస్తోంది. అమ్మాయిని పెద్దచేసి కట్నకానుకలు ఇచ్చుకొని ఓ ఇంటికి పంపుతామని, తమకు వారసునిగా మగపిల్లవాడు లేడని, వారిపై జాలి, కరుణ చూపడం లేదు.

07/23/2016 - 03:22

హైదరాబాద్, జూలై 22: వరంగల్‌లో ఆగస్ట్ 7న జరగనున్న టెక్స్‌టైల్ పార్క్ శంకుస్థాపనకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఆహ్వానించినట్టు ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కె తారక రామారావు తెలిపారు. అదే రోజున తెలంగాణ టెక్స్‌టైల్ పాలసీని ప్రకటించనున్నట్టు కెటిఆర్ తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ శుక్రవారం అధికారులతో సమావేశం నిర్వహించారు.

07/23/2016 - 03:21

కడప,(కల్చరల్)జూలై 22:జిల్లాలోని విద్యాలయాల్లో పర్యాటక క్లబ్బులను స్థాపించడంతోపాటు పర్యాటక కేంద్రాలను ప్యాకేజి టూర్లతో అనుసంధానం చేయడంతో జిల్లా అభివృద్ధి సాధిస్తుందని ఇందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని కడప జిల్లా పర్యాటక అభివృద్ధి సంస్థ గౌరవాధ్యక్షుడు శిద్దవటం సీతారామయ్య పేర్కొన్నారు.

07/23/2016 - 03:20

కడప,(కల్చరల్)జూలై 22: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ కాంస్య విగ్రహం కడప కలెక్టరేట్‌లోని సి-బ్లాక్‌లో ఏర్పాటయ్యేలా కలెక్టర్ కెవి సత్యనారాయణతో మాట్లాడుతానని జిల్లా తెలుగుదేశంపార్టీ అధ్యక్షుడు ఆర్.శ్రీనివాసరెడ్డి (వాసు) ప్రజాసంఘాలకు హామీ ఇచ్చారు. మహారాజ్యం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు సంగటి మనోహర్ ఆధ్వర్యంలో శుక్రవారం 30 ప్రజాసంఘాలతో కూడిన ప్రతినిధి బృందం వాసుకు వినతిపత్రం సమర్పించారు.

07/23/2016 - 03:20

హైదరాబాద్, జూలై 22: ఈ నెల 25వ తేదీ నుంచి ఎమ్సెట్ మెడిసిన్ కౌనె్సలింగ్ ప్రక్రియ ప్రారంభం కావాల్సి ఉంది. కాని ఎమ్సెట్-2 ప్రశ్నాపత్రం లీకేజిపై సిఐడి దర్యాప్తు ప్రారంభం కావడంతో, మరో మూడు రోజుల్లో ఎమ్సెట్ మెడిసిన్ కౌనె్సలింగ్ జరుగుతుందా లేక వాయిదా పడుతుందా అనే అంశంపై రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థుల్లో అలజడి నెలకొంది.

07/23/2016 - 03:18

కడప,(కల్చరల్)జూలై 22: ఈనెల 24వ తేదీన ఆదివారం 3మల్లెమాల పురస్కార సంబరాల సభ2 నిర్వహిస్తున్నట్లు పురస్కార వ్యవస్థాపకులు డాక్టర్.మల్లెమాల వేణుగోపాల్‌రెడ్డి, వరలక్ష్మి దంపతులు తెలిపారు. ఈ సందర్భంగా శుక్రవారం వారు మాట్లాడుతూ ఈ సభను స్థానిక పర్యాటకశాఖకు చెందిన హరిత హోటల్ ఫంక్షన్‌హాల్‌లో 24న ఉదయం 10గంటలకు నిర్వహిస్తున్నామన్నారు.

07/23/2016 - 03:17

రాజమహేంద్రవరం, జూలై 22: గోదావరి తీరంలో అంత్య పుష్కరాలకు ఆధ్యాత్మిక శోభ వెల్లి విరయనుంది. పవిత్ర అంత్య పుష్కర స్నానాలకు తరలివచ్చే పుష్కర యాత్రికులకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. పుష్కర భూమికలో కీలకపాత్ర పోషించే దేవాదాయ ధర్మాదాయశాఖ అంత్య పుష్కరాల పనె్నండు రోజులు ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది.

07/23/2016 - 03:13

అనంతపురంటౌన్, జూలై 22:వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల బెడద ఒకవైపు, తాగునీటి కాలుష్యం ప్రజలను బెంబేలెత్తిస్తోంది. పాలకవర్గానికి, అధికారయంత్రాంగానికి అభివృద్ధి పనులపై ఉన్న శ్రద్ధ పారిశుద్ధ్య సమస్యల పరిష్కారం, తాగునీటి కాలుష్యనివారణపై కానరావటం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అభివృద్ధి మత్తులో జోగుతున్న పాలక, అధికారవర్గాలకు ప్రజల గోడు పట్టకపోవటంలో వింతేమి లేదని నగరవాసులు ధ్వజమెత్తుతున్నారు.

Pages