S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/23/2016 - 02:28

గచ్చిబౌలి, జూలై 22: సైబరాబాద్ ఈస్ట్, వెస్ట్ ఎస్‌ఓటి పోలీసులు కబాలి ఆడుతున్న సినిమా థియేటర్లపై దాడి చేసి బ్లాక్ టికెట్లు అమ్ముతున్న వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈస్ట్ పరిధిలోని సైబరాబాద్ అడిషనల్ డిసిపి రాంచంద్రారెడ్డి ఆధ్వర్యంలో ఎస్‌ఓటి బృందాలు దాడులు చేశారు.

07/23/2016 - 02:27

హైదరాబాద్, జూలై 22: భాగ్యనగరంలో మానవ మనుగడ, పర్యావరణ పరిరక్షణ కోసం జిహెచ్‌ఎంసి ఈ నెల 11న ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన హరితహారం కార్యక్రమం ఇంకా కొనసాగుతోంది. శుక్రవారం వరకు ఈ కార్యక్రమం కింద జిహెచ్‌ఎంసి మొత్తం 26లక్షల 23వేల మొక్కలను నాటినట్లు కమిషనర్ డా.బి. జనార్దన్ రెడ్డి వెల్లడించారు.

07/23/2016 - 02:24

హైదరాబాద్, జూలై 22: తెలంగాణ ప్రాంతంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా అత్యంత భక్తిశ్రద్ధలతో వైభోపేతంగా జరుపుకునే సికింద్రాబాద్(లష్కర్) ఉజ్జయినీ మహంకాళి బోనాల వేడుకలకు భారీ పోలీసు బందోబస్తును ఏర్పాటు చేస్తున్నట్టు నార్త్ జోన్ డిసిపి బి.సుమతి తెలిపారు. ఈనెల 24, 25న జరుగనున్న లష్కర్ బోనాలు, జాతర వేడుకల సందర్భంగా పోలీసుల పరంగా చేపడుతున్న వివిధ ఏర్పాట్లపై ‘అంధ్రభూమి’తో ఆమె మట్లాడారు.

07/23/2016 - 02:20

కరీంనగర్, జూలై 22: షెడ్యూలు కులాల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం పలు పథకాలను అమలు పరుస్తుందని రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గడిచిన రెండు సంవత్సరాల కాలంలో షెడ్యూలు కులాల సంక్షేమం కోసం మూడెకరాల భూమి, కళ్యాణ లక్ష్మి వంటి కార్యక్రమాలను అమలు చేసిందన్నారు.

07/23/2016 - 02:19

ఎల్లారెడ్డిపేట, జూలై 22: జిల్లాలోనే తెలంగాణ ఆపిల్ మొక్కను ఎల్లారెడ్డిపేట మండలం బొప్పాపూర్‌లో నాటామని ఉద్యానవన శాఖ పిడి సంగీతలక్ష్మీ పేర్కొన్నారు. హరితహారంలో భాగంగా ఎల్లారెడ్డిపేట వ్యవసాయ కార్యాలయం, బొప్పాపూర్‌లోని మార్కెట్ కమిటీ, ఆయా గ్రామాల్లో శుక్రవారం ఘనంగా వ్యవసాయ దినోత్సవాన్ని నిర్వహించారు. జడ్పీటిసి ఆగయ్య, ఎంపిపి సుజాతలతో కలిసి ఆమె మొక్కలను నాటారు.

07/23/2016 - 02:18

కరీంనగర్, జూలై 22: ధనిక రాష్టమ్రని గొప్పలు చెప్పుకుంటున్న సిఎం కెసిఆర్ రైతు రుణమాఫీని పూర్తి స్థాయిలో అమలు చేయకుండా విడతల వారీగా ఎందుకు చేస్తున్నారని టిడిపి రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, జిల్లా ఇన్‌చార్జి ఒంటేరు ప్రతాప్ రెడ్డి ప్రశ్నించారు. శుక్రవారం జిల్లా పార్టీ కార్యాలయంలో జిల్లా సమన్వయ కమిటి సమావేశం జరిగింది.

07/23/2016 - 02:18

కోహెడ, జూలై 22: మండలంలోని శ్రీరాములపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి గది పైకప్పు పెచ్చులూడిపడి ముగ్గురు విద్యార్థులకు గాయాలైన సంఘటన శుక్రవారం సంచలనం సృష్టించింది. వివరాలు ఇలా ఉన్నాయి.

07/23/2016 - 02:17

కోహెడ, జూలై 22: మండలంలోని శ్రీరాములపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి గది పైకప్పు పెచ్చులూడిపడి ముగ్గురు విద్యార్థులకు గాయాలైన సంఘటన శుక్రవారం సంచలనం సృష్టించింది. వివరాలు ఇలా ఉన్నాయి.

07/23/2016 - 02:17

కరీంనగర్ టౌన్, జూలై 22: పర్యావరణ పరిరక్షణ సమాజంలోని ప్రతి పౌరునిపై ఉందని ఎస్పీ జోయల్ డేవిస్ అన్నారు. శుక్రవారం హరితహారం కార్యక్రమంలో భాగంగా నగరంలోని సిఎస్‌ఐ ఉన్నత పాఠశాలలో మొక్కలు నాటారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ చెట్లను పెంచడం ప్రాథమిక హక్కుగా భావించి ప్రతి పౌరుడు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

07/23/2016 - 02:16

కరీంనగర్ టౌన్, జూలై 22: హరితహారంలో ప్రతి ఒక్కరు తమ బాధ్యతగా పాల్గొని మొక్కలు నాటాలని జిల్లా కలెక్టర్ నీతూప్రసాద్ అన్నారు. శుక్రవారం కరీంనగర్ మండలంలోని దుర్శేడ్ గ్రామంలో హరితహారం కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వన సంపదతో రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని వర్షాలు సమృద్దిగా కురిసి పంటలు పండి రైతులు సుఖంగా జీవిస్తారని తెలిపారు.

Pages