S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/23/2016 - 02:16

సిరిసిల్ల, జూలై 22: సిరిసిల్ల మండలం సర్దాపూర్‌లో ఏర్పాటు చేస్తున్న పొలీస్ బెటాలియన్ స్థలంను జాయింట్ కలెక్టర్ శ్రీదేవసేన పరిశీలించారు. శుక్రవారం సాయంత్రం పోలీస్ బెటాలియన్ అధికారులు, ఆర్డీవో, రెవెన్యూ అధికారులతో కలిసి స్థల పరిశీలన జరిపారు. సర్దాపూర్‌లో ఏర్పాటు చేస్తున్న పోలీస్ బెటాలియన్‌కు 117 ఎకరాల స్థలంను ప్రభుత్వం కేటాయించింది.

07/23/2016 - 02:15

మహదేవపూర్, జూలై 22: మహదేవపూర్ మండలంలోని కాళేశ్వరం గ్రామం అంతర్ రాష్ట్ర బ్రిడ్జీ వద్ద అక్రమంగా తరలిస్తున్న వంద ఎరువుల బస్తాలను మండల వ్యవసాయాధికారి శుక్రవారం పట్టుకున్నారు.

07/23/2016 - 02:15

శంకరపట్నం, జూలై 22: ప్రభుత్వం చేపడుతున్న హరితహారం కార్యక్రమం అందరి బాధ్యతగా భావించుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీదేవసేన అన్నారు. శుక్రవారం మండలంలోని మెట్‌పల్లి గ్రామంలో ఆమె హరితహారం కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామాలలో ప్రజాప్రతినిధులు మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రణాళిక ఏర్పరచుకొని ఉధృతంగా కొనసాగించుకోవాలన్నారు.

07/23/2016 - 02:14

కోహెడ, జూలై 22: మండలంలోని శ్రీరాములపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి గది పైకప్పు పెచ్చులూడిపడి ముగ్గురు విద్యార్థులకు గాయాలైన సంఘటన శుక్రవారం సంచలనం సృష్టించింది. పదవ తరగతి విద్యార్థులు తరగతి గదిలో కూర్చొని ఉండగా 11.30 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా పైకప్పు పెచ్చులూడి పడడంతో కడార్ల తేజశ్రీ, గుడ్ల రజిత, చల్ల శివాని అనే ముగ్గురు విద్యార్థినులపై పడడంతో తలకు, చేతులకు గాయాలయ్యాయి.

07/23/2016 - 02:13

జమ్మికుంట, జూలై 22: తవ్వినకొద్ది అక్రమాలు వెలుగు చూస్తునే వున్నాయి. సక్రమమైన పనులకు సైతం దొడ్డిదారిలో అక్రమ వసూళ్లకు పాల్పడ్డ మాజీ తహశీల్దార్ మంకెన రజనీ వ్యవహార శైలి, అవినీతి బాగోతంపై ఎసిబి కూపీ లాగుతోంది. అరెస్ట్‌లతో విచారణ ముగిసినట్టేనని భావిస్తున్న తరుణంలో ఎసిబి ఇంకా ఆమె బాధితుల నుండి వివరాలు సేకరించే పనిలో పడింది.

07/23/2016 - 02:12

ఎల్లారెడ్డిపేట, జూలై 22: ప్రజల సమస్యలను తీర్చాల్సిన సర్పంచ్ పట్టించుకోకపోవడంపై ఆగ్రహం కట్టలు తెంచుకుంది. సుమారు రూ. 20 లక్షల పంచాయతీ, మరుగుదొడ్ల బిల్లులను లబ్ధిదారులకు చెల్లించడం లేదని ఆరోపిస్తూ ఉప సర్పంచ్, 9 మంది వార్డు సభ్యుల నేతృత్వంలోని ప్రజలు పంచాయతీ కార్యాలయాన్ని ముట్టడించారు. పాలక వర్గంలో కొనసాగలేమని స్పష్టం చేస్తూ మూకుమ్మడి రాజీనామాలు చేశారు.

07/23/2016 - 02:11

న్యూఢిల్లీ,జూలై 22: ఆమ్ ఆద్మీ పార్టీ లోక్‌సభ సభ్యుడు భగవంత్ సింగ్ మాన్ నిర్వాకం మూలంగా శుక్రవారం ఓటింగ్‌కు ఏపీ ప్రత్యేక హోదాకు ప్రైవేట్ మెంబర్ బిల్లు రెండు వారాల తరువాత మరోసారి రాజ్యసభ ముందుకు వస్తుంది. కాంగ్రెస్ సభ్యుడు కెవిపి రామచందర్‌రావు ప్రతిపాదించిన ఈ బిల్లుపై రెండు వారాల తరువాత కూడా ఓటింగ్ జరుగుతుందా? అనేది అనుమానమే.

07/23/2016 - 02:10

వరంగల్, జూలై 22: రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ లేని విధంగా హరితహార కార్యక్రమాన్ని ఉద్యమంలా ప్రారంభించిందని డిప్యూటీ సిఎం కడియం శ్రీహరి అన్నారు. రెండవ విడత హరితహార కార్యక్రమంలో భాగంగా శుక్రవారం గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పోరేషన్‌లో ఏర్పాటు చేసిన హరతహార కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిధిగా పాల్గొని మొక్కలు నాటారు.

07/23/2016 - 02:10

న్యూఢిల్లీ, జూలై 22: ఆం ఆద్మీ పార్టీ సభ్యుడు భగవంత్ మాన్ చేసిన నిర్వాకం మూలంగా శుక్రవారం పార్లమెంటు ఉభయ సభలు ఎలాంటి కార్యక్రమం చేపట్టకుండానే సోమవారానికి వాయిదా పడ్డాయి. పార్లమెంటు భద్రతకు ముప్పు తెచ్చిన భగవంత్ మాన్‌పై కఠిన చర్యలు తీసుకోవాలంటూ అధికార పక్షంతోపాటు ప్రతిపక్షాలు కూడా డిమాండ్ చేస్తూ పార్లమెంటు ఉభయసభలను స్తంభింపజేశాయి.

07/23/2016 - 02:09

నక్కలగుట్ట, జూలై 22: పోలీసు కానిస్టేబుళ్ల నియమకం కోసం నిర్వహిస్తున్న దేహదారుఢ్య పరీక్షలు శుక్రవారం ఎనిమిదవ రోజు హన్మకొండ జెఎస్‌ఎన్ మైదానంలో, కెయు మైదానంలో కూడా సజావుగా జరిగాయి. నిన్న 800 మీటర్ల పరుగులో అర్హత సాధించిన అభ్యర్థులకు ఈరోజు ధృవీకరణ పత్రాల పరిశీలన జరిగింది. 100 మీటర్ల పరుగు, లాంగ్ జంప్, హైజంప్, షాట్‌పుట్ లాంటి క్రీడలలో అభ్యర్థులకు పరీక్షలు నిర్వహించారు.

Pages