S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/05/2016 - 11:17

ఉత్తరాఖండ్‌ : ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు కొండచరియలు విరిగి పలు గ్రామాలు ధ్వంసమయ్యాయి. భారీ వర్షాలు ఉత్తరాఖండ్‌ను అతలాకుతలం చేశాయి. ఛమోలీ ప్రాంతంలో చాలా గ్రామాలు వరద బారిన పడ్డాయి. నదులు పొంగడంతో భారీ సంఖ్యలో ఇళ్లు కూలిపోయాయి. వరద నీరు ఊరును ముంచెత్తడంతో ప్రజలు బిక్కు బిక్కుమంటూ గడిపారు. వర్షాలకు రోడ్లు దెబ్బతిన్నాయి.

07/05/2016 - 07:51

విజయవాడ, జూలై 4: కృష్ణా పుష్కరాలకు కేవలం 38 రోజుల వ్యవధి మాత్రమే ఉంది. పుష్కరాల్లో భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంతో పాటు రాజధాని బ్రాండ్ ఇమేజ్‌ను పెంచేలా విజయవాడ నగరంలో చేపడుతున్న రోడ్ల విస్తరణ, అభివృద్ధి కార్యక్రమాలు పుష్కరుడు కృష్ణలో ప్రవేశించే పుణ్యకాలం నాటికి కూడా పూర్తయ్యే అవకాశాలు ఏమాత్రం కనిపించడం లేదు. శాఖల మధ్య సమన్వయ లోపం వల్ల పనులు నత్తనడక నడుస్తున్నాయి.

07/05/2016 - 07:49

హైదరాబాద్, జూలై 4: ఒక పెద్ద ఆసుపత్రికి ఎంత స్థలం కావాలి? మహా అయితే 30 ఎకరాలు. మరి ఒక కాలేజీకి ఎంత స్థలం కావాలి? మామాలుగా బిట్స్ పిలానీకి సర్కారు ఇచ్చిందే 30 ఎకరాలు. ప్రసిద్ధ సిల్వన్ ఇన్ కార్పొరేషన్ ఇంజనీరింగ్ కాలేజీకి భూమి అడిగితే ప్రభుత్వం ఇచ్చింది కేవలం ఐదెకరాలు. వీటికి సర్కారు ఇచ్చిన భూమి తక్కువయినా సదరు సంస్థలు మిగిలిన భూమిని ప్రైవేటు వ్యక్తుల వద్ద కొనుగోలు చేశాయి.

07/05/2016 - 07:44

న్యూఢిల్లీ, జూలై 4: మొజాంబిక్, దక్షిణాఫ్రికా, టాంజానియా, కెన్యా దేశాల్లో ఐదు రోజులపాటు ప్రధాని నరేంద్ర మోదీ 7వ తేదీ నుంచి పర్యటించనున్నారు. హైడ్రోకార్బన్లు, తీరప్రాంత పరిరక్షణ, వాణిజ్యం, పెట్టుబడులు, వ్యవసాయంలో సహకారం వంటి కీలక అంశాలపై ఈ నాలుగు దేశాలతో మోదీ విస్తృత స్థాయిలో చర్చిస్తారు.

07/05/2016 - 07:42

చిన్నగొట్టిగల్లు, జూలై 4: విద్యుదాఘాతానికి గురై ఓ ఏనుగు మరణించిన సంఘటన చిత్తూరు జిల్లా ఎర్రవారిపాళ్యం మండలం, చింతగుంట పంచాయతీలో సోమవారం చోటుచేసుకుంది. మండలంలోని సుబ్బరామపురం వద్ద రైతు సిద్దయ్యకు చెందిన మామిడితోటలో 11 కెవి విద్యుత్ లైను మనిషి ఎత్తులో వేలాడుతుండడంతో ఆహారం కోసం వచ్చిన ఏనుగుల గుంపులో ఒకటి విద్యుత్ వైర్లు తగిలి విద్యుదాఘాతంతో మరణించింది.

07/05/2016 - 07:39

న్యూఢిల్లీ, జూలై 4: సాయుధ దళాల్లో మహిళల ప్రమేయాన్ని మరింతగా పెంచే అవకాశాలపై దృష్టి సారించాల్సిన అవసరం ఎంతో ఉందని రక్షణ మంత్రి మనోహర్ పారికర్ అన్నారు. ఈ నేపథ్యంలో మొత్తం మహిళలతో కూడిన ఓ బెటాలియన్‌ను ఏర్పాటు చేసే అంశాన్ని కూడా తాము పరిశీలిస్తున్నామని అలాగే యుద్ధ నౌకల్లోనూ మహిళలు పనిచేసేలా చూడడం వంటి అంశాలను కూడా పరిగణనలోకి తీసుకుంటున్నట్టు తెలిపారు.

07/05/2016 - 07:38

హైదరాబాద్, జూలై 4: నవ్యాంధ్రకు పెట్టుబడులను రాబట్టడమే లక్ష్యంగా టిడిపి అధినేత ఎపి సిఎం నారా చంద్రబాబునాయుడు చేస్తున్న విదేశీ పర్యటనలు సత్ఫలితాలనే ఇస్తున్నాయి. ఈ మేరకు ఇటీవల చైనాలో ఐదు రోజుల పాటు పర్యటించి వచ్చిన చంద్రబాబు త్వరలోనే వేలాది కోట్ల మేర పెట్టుబడులు రాష్ట్రానికి రానున్నట్టు ప్రకటించారు. తాజాగా మరో కీలక దేశం రష్యాలో పర్యటించేందుకు ఆయన సిద్ధమయ్యారు.

07/05/2016 - 07:37

న్యూఢిల్లీ, జూలై 4: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘స్వచ్ఛ భారత్ అభియాన్’కు ప్రచారకర్తగా బిగ్‌బి అమితాబ్ బచ్చన్ నియమితులుకానున్నారు. ఈ మేరకు అభిప్రాయం కోరుతూ అమితాబ్‌కు లేఖ రాసినట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. అభియాన్‌లోని ఓ ఎపిసోడ్‌కు బచ్చన్ సేవలు వినియోగించుకోవాలని కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వశాఖ భావిస్తోంది.

07/05/2016 - 07:37

న్యూఢిల్లీ, జూలై 4: బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోని రెస్టారెంట్‌లో ఉగ్రవాదులచే హత్యకు గురైన యువతి తారిషీ జైన్ మృతదేహాన్ని న్యూఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కేంద్ర విద్యుత్, బొగ్గు గనుల శాఖ మంత్రి పియూష్ గోయల్ సోమవారం స్వాధీనం చేసుకున్నారు. యుసి బర్కిలీ విద్యార్థిని అయిన తారిషీ సెలవులను గడిపేందుకు ఢాకా వెళ్లింది.

07/05/2016 - 07:36

ఢాకా, జూలై 4: బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన భారత యువతి సహా 20 మంది బాధితులకు ఆ దేశం కన్నీటి నివాళులర్పించింది. సోమవారం నిర్వహించిన ఈ సంతాప కార్యక్రమానికి బంగ్లాదేశ్ ప్రధాన మంత్రి షేక్ హసీనా నాయకత్వం వహించి మృతులకు ఘనంగా శ్రద్ధాంజలి ఘటించారు.

Pages