S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/05/2016 - 05:29

హైదరాబాద్, జూలై 4 : తెలంగాణ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ స్పెషల్ కమిషనర్‌గా పనిచేస్తున్న సదాభార్గవిని చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్‌గా ప్రభుత్వం నియమించింది. రెవెన్యూ (డిజాస్టర్ మేనేజ్‌మెంట్) శాఖకు సంబంధించిన విజిలెన్స్, క్రమశిక్షణ అంశాలపై ఆమె విచారణ చేస్తారు. విజిలెన్స్ కమిషనర్ సూచనల మేరకు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నామని డిజాస్టర్ మేనేజ్‌మెంట్ కమిషనర్ వివరించారు.
భవన నిర్మాణ వర్కర్లకు చేయూత

07/05/2016 - 05:28

న్యూఢిల్లీ, జూలై 4: భర్తీ ప్రక్రియ ఎలా ఉన్నప్పటికీ అన్ని ఉద్యోగాల్లోనూ దివ్యాంగులకు మూడు శాతం రిజర్వేషన్లు తప్పనిసరిగా కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు ఆదేశించింది.

07/05/2016 - 05:27

హైదరాబాద్, జూలై 4: పాఠశాలల్లో మరుగుదొడ్లు లేకున్నా సిసి కెమెరాలు, బయోమెట్రిక్ మెషిన్లు ఏర్పాటు చేయడం ఏమిటంటూ విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు మండిపడుతున్నారు. తెలంగాణ విద్యాసంస్థల్లో సిసి కెమరాల ఏర్పాటును దశల వారీ చేపట్టారు.

07/05/2016 - 05:27

న్యూఢిల్లీ, జూలై 4: నీట్ నిర్వహణను ఈ సంవత్సరానికి మినహాయింపునిస్తూ కేంద్రం జారీ చేసిన ఆర్డినెన్సును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ల విచారణను సుప్రీంకోర్టు జూలై 7కి వాయిదా వేసింది. ప్రముఖ సామాజిక వేత్త ఆనంద్ రే, సంకల్ప్ చారిటబుల్ ట్రస్ట్‌లు ఈ అర్టినెన్సును వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశాయి.

07/05/2016 - 05:26

న్యూఢీల్లీ, జూలై 4: తెలుగు రాష్ట్రాలకు చెందిన ఖైదీల విడుదల కేసు విచారణను సుప్రీం కోర్టు నాలుగు వారాలకు వాయిదా వేసింది. 2007లో ఖైదీల విడుదలకు రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ న్యాయవాది చంద్రశేఖర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ సోమవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టిఎస్ ఠాకూర్ ధర్మాసనం ముందు విచారణకు వచ్చింది.

07/05/2016 - 05:26

తిరుపతి, జూలై 4: శ్రీవారి భక్తులకు అవసరమైన తగు సూచనలు, సలహాలు ఇవ్వడం కోసం ఇకపై 24 గంటలపాటూ కాల్‌సెంటర్లు అందుబాటులో ఉండేలా టిటిడి ఇఓ సాంబశివరావు చర్యలు తీసుకున్నారు. శ్రీవారి ఆలయం, ఇతర విభాగాలకు సంబంధించిన సమాచారాన్ని భక్తులు ఫోన్, ఈ-మెయిల్ ద్వారా సంప్రదించి తెలుసుకునే సౌకర్యాన్ని టిటిడి కల్పించింది. అదేవిధంగా టిటిడి అందిస్తున్న వసతులపై సూచనలు, సలహాలు ఇచ్చే అవకాశం ఉన్న విషయం విదితమే.

07/05/2016 - 05:25

హైదరాబాద్, జూలై 4 : విత్తనాల ఉత్పత్తిలో తెలంగాణ రాష్ట్రాన్ని జాతీయ స్థాయిలోనే కాకుండా, అంతర్జాతీయ స్థాయిలో ‘విత్తన భాండాగారంగా’ మార్చేందుకు ప్రయత్నిస్తామని తెలంగాణ వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. ఓఇసిడి (ఆర్గనైజేషన్ ఫర్ ఎకనమిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్‌మెంట్) విత్తన సర్ట్ఫికేషన్‌పై ఏర్పాటు చేసిన జాతీయ వర్క్‌షాప్‌ను సోమవారం ఇక్కడి పార్క్ హోటల్‌లో ప్రారంభించారు.

07/05/2016 - 05:24

న్యూఢిల్లీ, జూలై 4: ఎమ్మెల్యే రోజా ఎన్నిక చెల్లదంటూ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ విచారణలో రెండు వారాల్లో ఆమె లిఖిత పూర్వక వివరణ ఇచ్చే అవకాశం కల్పిస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ పిటిషన్‌పై ఈ ఏడాది చివరి కల్లా విచారణను పూర్తి చేయాలని ఉమ్మడి హైకోర్టుకు సుప్రీంకోర్టు నిర్దేశించింది.

07/05/2016 - 05:24

మదనపల్లె, జూలై 4: ‘మా బిడ్డను బతికించుకోలేం.. కనీసం చంపుకోవడానికైనా అనుమతివ్వండి’ అంటూ ఇంటర్ విద్యార్థిని తల్లిదండ్రులు సోమవారం చిత్తూరు జిల్లా మదనపల్లె కోర్టును ఆశ్రయించారు. చిత్తూరు జిల్లా మదనపల్లె పట్టణం విజయనగర్‌కాలనీలో నివాసముంటున్న రాయపేట నారాయణ, శ్యామలమ్మలకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. తల్లిదండ్రులిద్దరు దినసరి కూలి పనులు చేసుకుని జీవనం సాగిస్తున్నారు.

07/05/2016 - 05:23

హైదరాబాద్, జూలై 4: నిత్యం ట్రాఫిక్‌తో నరకయాతన అనుభవించే జంటనగరాల ప్రజలకు మెట్రోరైలు సేవలు అందుబాటులోకి రావాలంటే మరికొంత కాలం వేచి ఉండాల్సిందే!

Pages