S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

05/20/2016 - 05:10

హైదరాబాద్, మే 19: తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేట్ క్రిస్టియన్ మైనార్టీ డిగ్రీ కాలేజీల యాజమాన్యం ప్రభుత్వ నోటిఫికేషన్‌తో సంబం ధం లేకుండా ఆన్‌లైన్ ద్వారా అడ్మిషన్లు జరుపుకోవచ్చని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పి నవీన్‌రావు ఆదేశాలు జారీ చేశారు.

05/20/2016 - 05:08

హైదరాబాద్, మే 19: నోరి నరసింహ శాస్ర్తీ ట్రస్టు ఆధ్వర్యంలో జులై 16న గురు పురస్కారాల ప్రదానోత్సవ సభ జరుగుతుందని ట్రస్టు ఉపాధ్యక్షుడు నోరి శివసేనాని ఒక ప్రకటనలో తెలిపారు. చిక్కడపల్లిలోని శ్రీ త్యాగరాయ గానసభలో నిర్వహించే ఈ ప్రదానోత్సవ సభలో బ్రహ్మశ్రీ ఎంవిఆర్ శర్మకు వేదవ్యాస పురస్కారం, దువ్వూరి సుబ్బలక్ష్మికి జగద్గురు శ్రీ కల్యాణానంద భారతీ మాంతాచార్య పురస్కారం అందజేయబడుతుందని ఆయన వివరించారు.

05/20/2016 - 05:07

హైదరాబాద్, మే 19: భద్రాచల రామచంద్రుడిని కీర్తిస్తూ భక్తరామదాసు రాసిన కీర్తనలకు ప్రాచుర్యం కల్పించాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగా రామదాసు కీర్తనల పోటీలను నిర్వహించాలని నిర్ణయించామని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (సాంస్కృతిక) డాక్టర్ కెవి రమణాచారి తెలిపారు.

05/20/2016 - 05:06

హైదరాబాద్, మే 19: తెలంగాణలో ప్రైవేట్ కాలేజీలను విద్యాశాఖ సిబ్బంది మాత్రమే తనిఖీ చేయాలని, ఎలాంటి పరిస్థితుల్లోనూ యూనిఫాంలో ఉన్న పోలీసులను వెంట తీసుకెళ్లరాదని, ఈ విషయంలో సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును అమలు చేయాలని జస్టిస్ ఎంఎస్‌కె జైశ్వాల్ ఆదేశించారు. ఈ ఏడాది ఏప్రిల్ 8న ప్రైవేట్ కాలేజీల తనిఖీలో పోలీసుల సహాయాన్ని విద్యాశాఖాధికారులు తీసుకుంటారని రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది.

05/20/2016 - 05:05

హైదరాబాద్, మే 19: ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో తెరాస గెలుపుతో రాష్ట్ర మంత్రుల్లో నూతనోత్సాహం వెల్లివిరుస్తోంది. 2014 సాధారణ ఎన్నికల తర్వాత జరిగిన అన్ని ఉపఎన్నికల్లోనూ తెరాస విజయం సాధిస్తూ వస్తుండటంతో ప్రభుత్వ పథకాలను మరింత సమర్థవంతంగా కొనసాగించాల్సిన అవసరం ఉందని మంత్రులు భావిస్తున్నారు. ప్రజల సంక్షేమం కోసమే తమ ప్రభుత్వం పనిచేస్తోందని వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు.

05/20/2016 - 04:57

హైదరాబాద్, మే 19:‘చిదిమెకొద్ది ఎదిగనంట.. కోసెకొద్ది పూసెనంట’ అన్న గీతం ఇప్పుడు బిజెపి విషయంలో నిజమయింది. ఢిల్లీ, బిహార్ ఓటమితో డీలాపడిన కమలం ఇప్పుడు ఈశాన్య దేశంలో పాదం మోపింది. దక్షిణ భారతంలోని కర్నాటకలో పాగా వేయడానికి తీసుకున్న సమయం కంటే ఈశాన్య రాష్ట్రంలోని అసోంలో అధికారం చేజిక్కించుకునేందుకు తీసుకున్న సమయం తక్కువ. కర్నాటకలో అధికారంలోకి వచ్చేందుకు 15 సంవత్సరాలు పట్టింది.

05/20/2016 - 04:53

చెన్నై, మే 19: 14వ ఏటే హిందీ వ్యతిరేక ఉద్యమం ద్వారా రాజకీయాల్లోకి ప్రవేశించిన డీ ఎంకే చీఫ్ ఎం.కరుణానిధి.. తన రాజకీయాల్లో అధికారంలో ఉన్నా, లేకపోయినా.. శాసనసభ్యుడిగా ఏనాడూ ఓటమి పదాన్ని వినలేదు. 1957లో తొలిసారి తమిళనాడు శాసనభకు ఎన్నికైన కరుణానిధి. ఇప్పటివరకూ పోటీ చేసిన ప్రతిసారీ ఘన విజయాన్ని నమోదు చేసి చరిత్ర సృష్టించారు. 92 ఏళ్ల ఈ కురువృద్ధుడు 13వ సారి తమిళనాడు అసెంబ్లీకి తాజాగా ఎన్నికయ్యారు.

05/20/2016 - 04:51

న్యూఢిల్లీ,మే 19: ఈశాన్య రాష్ట్రం అసోంలో భాజపా భారీ విజయం సాధించడంతో దేశవ్యాప్తంగా ఆ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకొన్నాయి. ఐదు రాష్ట్రాల ఎన్నికలలో పెద్దగా నమ్మకం పెట్టుకోని బిజెపి అసోంలో విజయం సాధించడంతో ఢిల్లీ అశోక్ రోడ్డులోని పార్టీ కేంద్ర కార్యాలయానికి పెద్దఎత్తున కార్యకర్తలు చేరుకొని మిఠాయిలు పంచుకొని బాణాసంచా కాల్చి, పరస్పరం అభినందనలు తెలుపుకుంటూ నృత్యాలు చేశారు.

05/20/2016 - 04:50

హైదరాబాద్, మే 19: ప్రజల ఆకాంక్షలు నెరవేరాలంటే రాష్ట్రాలకు స్వయంప్రతిపత్తి అవసరమని, అప్పుడే రాష్ట్రాలు అభివృద్ధి చెందుతాయని లోక్‌సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ జయప్రకాష్ నారాయణ్ అన్నారు. గురువారం ఐదు రాష్ట్రాలకు జరిగిన ఎన్నికల ఫలితాలపై ఆయన స్పందించారు.

05/20/2016 - 04:50

హైదరాబాద్, మే 19: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన ఆయా పార్టీల నేతలను వైకాపా అధినేత జగన్ అభినందించారు. అసోంలో బిజెపి సాధించిన విజయంపై ఆయన ప్రధాని నరేంద్రమోదీని అభినందిస్తూ ట్వీట్ చేశారు. తమిళనాడులో జయలలిత, పశ్చిమ బెంగాల్‌లో మమత బెనర్జీ పార్టీలు తిరిగి ఎన్నిక కావడాన్ని ఆయన స్వాగతించారు. కేరళలో ఎల్‌డిఎఫ్ విజయం సాధించినందుకు వామపక్ష నేతలకు ఆయన ఒక ప్రకటనలో అభినందలు తెలిపారు.

Pages