S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

05/18/2016 - 00:16

గజ్వేల్ మే 17: గజ్వేల్ మున్సిపల్ పరిదిలో ప్రజ్ఞాపూర్ రాజీవ్హ్రదారిపై మంగళవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది. ఈ సంఘటనకు సంబందించి బాదితులు, పోలీసులందించిన వివరాలిలా ఉన్నాయి. వరంగల్ జిల్లా చేర్యాల మండలం ఐనాపూర్‌కు చెందిన మల్లయ్య(55), బాల్‌రాజ్ (38), రవీందర్(37)లతోపాటూ మరో ఇద్దరు ఆటోలో మెదక్ జిల్లా వర్గల్‌కు బయలుదేరారు.

05/18/2016 - 00:16

దౌల్తాబాద్, మే 17 : నారుమడిని పారించడం కోసం పొలం వద్దకు వెళ్ళి విద్యుదాఘాతానికి గురై ఓ రైతు మృతి చెందిన సంఘటన సోమవారం అర్ధరాత్రి మెదక్ జిల్లా దౌల్తాబాద్ మండలం గాజులపల్లి గ్రామంలో చోటుచేసుకున్నది. కుటుంబసభ్యులు, గ్రామస్థులు, పోలీసుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. గాజులపల్లి గ్రామానికి చెందిన దాడి కనకయ్య (38) తనకున్న వ్యవసాయంతోపాటూ కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.

05/18/2016 - 00:12

జడ్చర్ల, మే 17: రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం చేపట్టిన పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం కోసం 154 ఎకరాల పొలం కాదు..గ్రామం మొత్తానైన్నా ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నామని జడ్చర్ల మండల పరిధిలోని కిష్టారం గ్రామ రైతులు తెలిపారు. మంగళవారం గ్రామంలో ఎర్పాటు చేసిన గ్రామసభలో రైతులు,గ్రామస్థులు తమ అభిప్రాయాలను ఆర్‌డిఒ హన్మంత్ రెడ్డి వెలిబుచ్చారు.

05/18/2016 - 00:12

మహబూబ్‌నగర్, మే 17: భారతదేశం గర్వించదగ్గ కృష్ణా పుష్కరాలను నిర్వహిస్తామని, లక్షలాది మంది భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకుంటామని దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు. మహబూబ్‌నగర్ జిల్లాలోని కృష్ణానది తీరాన వివిధ ప్రాంతాల్లో పుష్కరఘాట్ల నిర్మాణానికి మంగళవారం ఆయన శంకుస్థాపనలు చేశారు.

05/18/2016 - 00:11

మహబూబ్‌నగర్‌టౌన్, మే 17: మహబూబ్‌నగర్ మండల పరిధిలోని దోడలోనిపల్లి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన తల్లి కొడుకులు చెరువులో మునిగి మృత్యువాత పడడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. వివరాల్లో వెళ్తే మంగళవారం ఉదయం దొడలోనిపల్లి గ్రామ శివారులో గల కొత్తకుంట చెరువులో బట్టలు ఉతకడానికి గీత అనే మహిళ తన ఐదేళ్ల కుమారుడు లాల, ఆమె సోదరి రేఖతో సహ బయలుదేరారు.

05/18/2016 - 00:11

ధన్వాడ, మే 17: వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి వ్యతిరేకంగా మంగళవారం ధన్వాడ మండల టిఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మరికల్ గ్రామంలోని ఇందిరాగాంధి చౌరస్తాలో రాస్తారోకో కార్యక్రమంను నిర్వహించారు.

05/18/2016 - 00:10

మక్తల్, మే 17: జిల్లాలో కరువు నివారణ చర్యలు చేపట్టడంలో టిఆర్‌ఎస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమయ్యిందని టిడిపి జిల్లా అధ్యక్షుడు బక్కని నర్సింహులు ఆరోపించారు. మంగళవారం మండల కేంద్రంలోని ఆర్‌అండ్‌బి అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రైతులకు పంటరుణాలు మాఫీ చేయడంలో ఈప్రభుత్వం అనేక ఇబ్బందులకు గురిచేస్తుందని అన్నారు. పంట రుణాలు మాఫీచేసి కొత్తరుణాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

05/18/2016 - 00:09

పెబ్బేరు, మే 17: కృష్ణా పుష్కరాల సందర్భంగా నదీతీర ప్రాంతాల్లోని ఆలయాలను పునరుద్ద్ధరించి సుందరంగా తీర్చి దిద్దుతామని దేవాదయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. మంగళవారం పెబ్బేరు మండల పరిధిలోని రంగాపురం సమీపంలో పుష్కర ఘాట్లకు వెళ్లే రహదారులకు, పుష్కర ఘాట్లకు ఆయన శంకుస్థాపన చేశారు.

05/18/2016 - 00:09

కల్వకుర్తి,మే 17: వెల్దండ మండల కేంద్రంలోని అర్టీసి బస్టాండ్ సమీపంలో వాహానాల తనిఖీ నిర్వహిస్తుండగా అంతర్ జిల్లా దొంగల ముఠాను అరెస్టు చేసి రిమాండ్ తరలించిన్నట్లు షాద్‌నగర్ ఎఎస్పీ కల్మేశ్వర్ సిగెనవర్ తెలిపారు.

05/18/2016 - 00:08

అలంపూర్, మే 17: గోదావరి పుష్కరాలకు దీటుగా కృష్ణాపుష్కరాలను నిర్వహిస్తామని రాష్ట్ర దేవాదాయ, గృహనిర్మాణ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు. మంగళవారం కృష్ణా పుష్కరాల ఘాట్ల నిర్మాణానికి శంకుస్థాపనతో పాటు అలంపూర్ పట్టణంలోని పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం, రూ.1.33కోట్లతో నిర్మించతలపెట్టిన భక్తుల వసతి గృహాల సముదాయ కేంద్రానికి మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి శంకుస్థాపన చేశారు.

Pages