S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/02/2016 - 18:06

గుంటూరు: ఈతకు వెళ్లిన నలుగురు చిన్నారులు కుంటలో మునిగి మృతిచెందారు. ఈ సంఘటన గుంటూరు మండలం తురకపాలెం గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. పదేళ్ల లోపు నలుగురు చిన్నారులు ఈత కొట్టడానికి గ్రామ శివారులోని కుంటకు వెళ్లారు. ఈత కొడుతున్న క్రమంలో ప్రమాదవశాత్తు నలుగురు అందులో మునిగి మృతిచెందారు.

07/02/2016 - 18:03

హైదరాబాద్‌: ఈ ఏడాది ఖైరతాబాద్‌ గణేషుడు ‘శ్రీ శక్తిపీఠ శివనాగేంద్ర మహాగణపతి’గా గణనాథుడు భక్తులకు దర్శనమివ్వనున్నాడు. గణేశుడి కుడి చేతివైపు వెంకటేశ్వరస్వామి, ఎడమవైపు శ్రీకృష్ణుడి విగ్రహాలను ఏర్పాటు చేస్తారు. ఇందుకు సంబంధించిన చిత్రాన్ని ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, ఉత్సవ కమిటీ సభ్యులు శనివారం విడుదల చేశారు.

07/02/2016 - 17:36

ముంబయి: ముంబయి నగరాన్ని వర్షాలు వణికిస్తున్నాయి. సబర్బన్‌ రైలు సర్వీసులు అన్నీ 15నిమిషాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. వచ్చే 24గంటల్లో ముంబయిలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. ముంబయితో పాటు మహారాష్ట్ర, గోవా ప్రాంతాల్లో కూడా వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ తెలిపింది. కొలాబాలో 77 మిల్లీమీటర్ల వర్షపాతం, శాంతాక్రజ్‌లో 77 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.

07/02/2016 - 17:33

తజికిస్థాన్‌ : తజికిస్థాన్‌లో శనివారం భూకంపం కారణంగా 30 ఇళ్లు, పాఠశాల భవనాలు ధ్వంసమయ్యాయి. ఎటువంటి ప్రాణనష్టం నమోదు కాలేదు. దేశ రాజధానికి 200 కిలోమీటర్ల దూరంలో రాషిట్‌ ప్రాంతంలో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు.

07/02/2016 - 17:29

దిల్లీ: తెలంగాణలో న్యాయాధికారుల నియామకాలపై నిరసనల నేపథ్యంలో సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి టీఎస్‌ ఠాకూర్‌తో తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక న్యాయమూర్తి దిలీప్‌ భోసలే శనివారం భేటీ అయ్యారు. న్యాయాధికారుల సస్పెన్షన్‌ తదనంతర పరిణామాలపై చర్చించినట్లు సమాచారం.

07/02/2016 - 11:49

హైదరాబాద్: బంజారాహిల్స్‌లో ట్రాఫిక్ పోలీసులు మద్యం తాగి వాహనాలు నడుపుతున్న 8 మందిని శనివారం అదుపులోకి తీసుకున్నారు. 3 కార్లు, 4 ద్విచక్రవాహనాలు, ఒక ఆటోను స్వాధీనం చేసుకున్నారు.

07/02/2016 - 11:46

ఖమ్మం : మట్టి పెళ్లలు విరిగిపడి ఇద్దరు కూలీలు మృతి చెందిన సంఘటన సింగరేణి ఇల్లందు ఏరియా జేకే ఉపరితలగనిలో శనివారం చోటుచేసుకుంది. ఉపరితల గని చుట్టూ పోసిన మట్టిని తీస్తుండగా, మట్టి పెళ్లలు కూలీలపై పడటంతో ఇద్దరు కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరికి తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు.

07/02/2016 - 11:42

ఢాకా: బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోని ఓ రెస్టారెంటులో బందీలుగా ఉన్నవారిని విడిపించేందుకు పోలీసు కమెండోలు రంగప్రవేశం చేసి అయిదుగురు ఉగ్రవాదులను కాల్చి చంపారు. శుక్రవారం రాత్రి ఆ రెస్టారెంటులో 8 మంది ఉగ్రవాదులు ప్రవేశించి 18 మంది విదేశీయులను బంధించారు. ఈ సందర్భంగా పోలీసులకు, ఉగ్రవాదులకు మధ్య కాల్పులు జరిగాయి. ఇద్దరు పోలీసులు మరణించగా, 20 మంది గాయపడ్డారు.

07/02/2016 - 11:42

విశాఖ: ఎపి సిఎం చంద్రబాబు శుక్రవారం సాయంత్రం ఇక్కడికి చేరుకుని పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. సాయంత్రం 4 గంటల సమయంలో ఆయన విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో ఇక్కడికి చేరుకుంటారు. అనంతరం నగరంలోని ఓ హోటల్‌లో ప్రైవేటు ఆస్పత్రుల యాజమాన్యాలతో జరిగే సమావేశంలోను, నౌకాదళ అధికారుల సమావేశంలోనూ పాల్గొంటారు. తర్వాత బీచ్‌రోడ్డులో బే మారథాన్‌ను ప్రారంభిస్తారు. రాత్రికి తిరిగి విజయవాడ చేరుకుంటారు.

07/02/2016 - 11:42

ఢాకా: బంగ్లాదేశ్‌లో మైనారిటీ వర్గమైన హిందూ పూజారులపై దాడులు నానాటికీ పెచ్చుమీరుతున్నాయి. శుక్రవారం ఓ పూజారిని హత్యచేయగా, తాజాగా శక్తిరా జిల్లాలోని రాధాగోవింద ఆలయ పూజారి బాబాసిందూరాయ్‌పై ఆగంతకులు పదునైన ఆయుధాలతో దాడి చేశారు. ఇంటి తలుపులు కొట్టగానే బయటికి వచ్చిన పూజారిపై దుండగులు విరుచుకుపడ్డారు. గాయపడిన పూజారిని ఆస్పత్రిలో చేర్పించగా అతడి పరిస్థితి విషమంగానే ఉంది.

Pages