S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

06/19/2019 - 04:46

మహబూబ్‌నగర్, జూన్ 18: పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టు భూ నిర్వాసితులు చేపట్టిన ఆందోళన రోజురోజుకు ఉద్ధృతం అవుతోంది. గత నెల రోజుల నుండి ప్రాజెక్టు పనులు జరుగుతున్న ప్యాకేజీల దగ్గర నిరాహార దీక్షలు చేపట్టి రెండు రోజుల క్రితం ప్రగతి భవన్ ముట్టడికి సైతం బయలుదేరారు. కానీ జడ్చర్ల సమీపంలో పోలీసులు వారిని అడ్డుకుని అరెస్టులు చేశారు.

06/19/2019 - 04:45

ఖైరతాబాద్, జూన్ 18: చేనేతకారుల సమస్యల పరిష్కారానికి సమష్టి ఉద్యమాలు నిర్వహించాలని రౌండ్ టేబుల్ సమావేశం తీర్మానించింది. మంగళవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో రాజకీయ ఐక్య కార్యచరణ కమిటీ ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు.

06/19/2019 - 04:45

చౌటుప్పల్, జూన్ 18: ప్రజలు ఆధ్యాత్మిక భావాలను పెంచుకోవాలని హంపీ పిఠాధిపతులు హింపీవిరూపాక్ష విద్యారణ్యభారతీస్వామి పిలుపునిచ్చారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని చౌటుప్పల్‌లోని సత్యదేవ సహిత అయ్యప్పస్వామి దేవాలయంలో చతుర్ధ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలను పురస్కరించుకోని మంగళవారం శ్రీ సత్యనారాయణస్వామి కల్యాణ మహోత్సవ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. అంతకు ముందు సామూహిక సత్యనారాయణ వ్రతాలు జరిపారు.

06/19/2019 - 04:44

భూపాలపల్లి, జూన్ 18: ఈనెల 21న కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని ఏర్పాట్లు శరవేగంగా కొనసాగుతున్నాయి. 21వ తేదీన ఇద్దరు గవర్నర్లు, ముగ్గురు ముఖ్యమంత్రులు వస్తుండటంతో అధికార యంత్రాంగం మొత్తం కాళేశ్వరంలోనే మకాం వేసి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఈ ప్రాంతంలో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. జిల్లా, రాష్టస్థ్రాయి పోలీసు యంత్రాంగమంతా దృష్టి కాళేశ్వరంపై పెట్టారు.

06/19/2019 - 04:44

ఖైరతాబాద్, జూన్ 18: కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ రాష్ట్రానికే వరప్రదాయని అని, అంతటి విశిష్టతగల ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టుగా రూపాంతరం చెందుతున్న సమయంలో అడ్డంకులు సృష్టించడం సరికాదని తెలంగాణ విశ్రాంత ఇంజనీర్ల సంఘం పేర్కొంది.

06/19/2019 - 04:43

కోదాడ, జూన్ 18: జబర్దస్త్ నటుడు చలాకీ చంటికి రోడ్డు ప్రమాదంలో స్వల్ప గాయాలయ్యాయ. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణ శివారులోని కొమరబండలో 65వ జాతీయ రహదారిపై లారీ, కారు ఢీకొని గాయపడిన సంఘటన మంగళవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం విశాఖపట్నం నుండి హైద్రాబాద్‌కు కారులో చంటి వెళ్తున్నాడు.

06/19/2019 - 04:43

మేళ్లచెర్వు, జూన్ 18: సూర్యాపేట జిల్లా మేళ్లచెర్వు మండల కేంద్రంలోని మైహోం సిమెంటు పరిశ్రమలో మంగళవారం జరిగిన ప్రమాదంలో ఇద్దరు కార్మికులు దుర్మరణం పాలయ్యారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం పరిశ్రమ లోపల సిమెంటు తయారీకి ఉపయోగించే క్లింకర్, మట్టి సమపాళ్లలో పంపించే యంత్రం వద్ద ఎర్రమట్టి పేరుకు పోయింది.

06/19/2019 - 04:37

అమరావతి, జూన్ 18: నాడు 68 మంది సభ్యులున్నా మాట్లాడే అవకాశం ఇవ్వకుండా మైక్‌లు కట్‌చేశారు.. మా గొంతు నొక్కారు.. అయినా మేం మీలా కాదు.. మీకు అవకాశం ఇస్తున్నాం.. మాట్లాడండని ప్రతిపక్షనేత చంద్రబాబుకు ముఖ్యమంత్రి జగన్ చురకలు వేశారు. మంగళవారం శాసనసభలో ప్రత్యేక హోదా తీర్మానంపై చర్చ సందర్భంగా అధికార, ప్రతిపక్ష నేతల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.

06/19/2019 - 04:36

గాజువాక: హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్(హెచ్‌పీసీఎల్)కు చెందిన విశాఖ రిఫైనరీ ఆధునీకరణలో భాగంగా దేశంలోనే అతిపెద్ద పుల్ కన్వర్షన్ హైడ్రోక్రాకర్ యూనిట్(రియాక్టర్)ను మంగళవారం అమర్చారు. యూనివర్సల్ ఆయల్ ప్రొడక్ట్స్ ఇంజనీర్ ఇండియా కంపెనీ సంయుక్తంగా విశాఖ రిఫైనరీలో 3.053 ఎంఎంటిపిఎ సామర్థ్యం కలిగిన ప్రతిష్ఠాత్మకమైన రియాక్టర్ యూనిట్‌ను విజయవంతంగా అమర్చడం పూర్తి చేశారు.

06/19/2019 - 04:33

తిరుపతి, జూన్ 18: ప్రపంచ ప్రసిద్ధి గాంచిన తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామికి మొక్కులు తీర్చుకోవడంలో భాగంగా భక్తులు సమర్పించే తలనీలాల ద్వారా ఏటా సుమారు 120 కోట్ల రూపాయల మేర టీటీడీకి ఆదాయం లభిస్తోంది. ఈ నేపథ్యంలో తలనీలాలను నిల్వ ఉంచే గోడౌన్లలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి పర్యవేక్షించే ఏర్పాట్లను టీటీడీ చేస్తోంది. తిరుమలలో తలనీలాలు సమర్పించడాన్ని భక్తులు అత్యంత పవిత్రంగా భావిస్తారు.

Pages