S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయం

07/24/2017 - 01:41

జెరూసలెం, జూలై 23: పశ్చిమాసియాలో అత్యంత సమస్యాత్మక పుణ్యక్షేత్రమైన జెరూసలెంలో శనివారం ఇజ్రాయిల్ భద్రతా బలగాలతో జరిగిన ఘర్షణల్లో ఇద్దరు పాలస్తీనియన్లు మృతిచెందారు. జెరూసలెంలో భద్రతా చర్యల విషయమై తలెత్తిన హింసాకాండ సందర్భంగా దాడులకు పాల్పడిన ఒక యువకుడి ఇంటిని ముట్టడించేందుకు ఇజ్రాయిల్ బలగాలు ప్రయత్నించడంతో తాజా ఘర్షణలు చోటుచేసుకున్నాయి. దీనిపై భద్రతా మండలి సోమవారం జనాంతిక చర్చలను నిర్వహించనుంది.

07/24/2017 - 01:34

జుకోవ్‌స్కీ (రష్యా), జూలై 23: నాలుగో తరానికి చెందిన అత్యాధునిక మిగ్-35 యుద్ధ విమానాలను భారత్‌కు అమ్మేందుకు రష్యా ఎదురు చూస్తోంది. ఈ విమానాల కొనుగోలుకు భారత్ ఆసక్తి చూపుతోందని, ఈ విషయంలో భారత్ అవసరాలు ఏమిటో తెలుసుకునేందుకు చర్చలు సాగుతున్నాయని మిగ్ కార్పొరేషన్ డైరెక్టర్ జనరల్ ఇల్యా తరసెంకో వెల్లడించారు.

07/23/2017 - 01:56

వాషింగ్టన్, జూలై 22: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన సమాచార విభాగ కొత్త డైరెక్టర్‌గా స్కారమస్సీ (53)ని నియమించారు. మృదు భాషిగా, వాల్‌స్ట్రీట్ ఫైనాన్షియర్‌గా ఎంతో పేరుపొందిన స్కారమస్సీ దీర్ఘకాలం నుంచి ట్రంప్‌కు అనుంగు మద్దతుదారుడిగా కొనసాగుతున్నాడు.

07/23/2017 - 01:50

వాషింగ్టన్, జూలై 22: డోక్లామ్‌లో సైనిక ప్రతిష్ఠంభన విషయమై నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించుకునేందుకు భారత్, చైనా నేరుగా చర్చలు జరపాలని అమెరికా సూచించింది. టిబెట్ దక్షిణాదిలోని ఈ వివాదాస్పద ప్రాంతంలో రోడ్డును నిర్మిస్తున్న చైనా సైనిక బలగాలను భారత దళాలు అడ్డుకోవడంతో గత నెల రోజుల నుంచి ఇరు పక్షాల మధ్య ప్రతిష్ఠంభన కొనసాగుతున్న విషయం తెలిసిందే.

07/22/2017 - 02:34

ఇస్లామాబాద్, జూలై 21: పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్, ఆయన కుటుంబ సభ్యులపై దాఖలైన పనామా అవినీతి ఆరోపణల కేసులో సుప్రీంకోర్టు విచారణ ముగిసింది. ఇరు పక్షాల వాదనలు విన్న పాక్ అత్యున్నత న్యాయస్థానం తన తీర్పును వాయిదా వేసింది. ఈ తీర్పు వెలువడితే నవాజ్ షరీఫ్ రాజకీయ భవితవ్యం ఇరకాటంలో పడే అవకాశం ఉందన్న సంకేతాలు వ్యక్తమవుతున్నాయి.

07/21/2017 - 00:38

వాషింగ్టన్, జూలై 20: పాకిస్తాన్‌కు అందించే సహాయానికి సంబంధించి కఠినమైన షరతులు అమలుచేయాలని అమెరికా కాంగ్రెస్ ప్యానెల్ స్పష్టం చేసింది. ఉగ్రవాద గ్రూపులకు వ్యతిరేకంగా పటిష్టమైన చర్యలను తీసుకోవడంలో పాకిస్తాన్ విఫలమైతే ఆర్థిక సహాయాన్ని నిలిపివేసే అధికారాన్ని విదేశాంగ మంత్రికి అప్పగించింది. ఇందుకు సంబంధించిన తీర్మానాన్ని సభ వినిమయ కమిటీ మూజువాణి ఓటుతో ఆమోదించింది.

07/20/2017 - 03:58

వాషింగ్టన్, జూలై 19: జర్మనీలో ఈ నెల ప్రారంభంలో జరిగిన జి-20 శిఖరాగ్ర సమావేశం నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో రెండోసారి రహస్యంగా సమావేశమైనట్లు మీడియా కథనాలు పేర్కొన్నాయి.

07/20/2017 - 03:29

న్యూఢిల్లీ, జూలై 19: సిక్కిం సెక్టార్‌లో భారత సైన్యంతో ఏర్పడిన ప్రతిష్టంభన నేపథ్యంలో యుద్ధానికి దిగేందుకు చైనా సైన్యం పెద్దఎత్తున ఏర్పాట్లు చేస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. సిక్కిం సెక్టార్‌కు దక్షిణ ప్రాంతంలోని కున్యున్ పర్వత ప్రాంతానికి చైనా వేల టన్నుల యుద్ధ సామాగ్రిని తరలించినట్లు తెలుస్తోంది.

07/19/2017 - 04:49

బీజింగ్, జూలై 18: రాజకీయ లక్ష్యాల సాధనకు డోక్లామ్ వివాదాన్ని విధానపరమైన అంశంగా వాడుకుంటే సహించేది లేదంటూ భారత్‌ను చైనా హెచ్చరించింది. సరిహద్దుల్లో తీవ్ర పరిణామాలు తలెత్తకముందే, భారత బలగాలను ఉపసంహరించాలని హెచ్చరించింది. ఇదే సమయంలో డోక్లామ్ విషయంలో చైనా-్భరత్‌ల మధ్య తలెత్తిన ప్రతిష్టంభన వివరాలు తెలుసుకోవడానికి విదేశీ దౌత్యవేత్తలు ఆసక్తి కనబరుస్తున్నారంటూ చైనా విదేశాంగ శాఖ పేర్కొంది.

07/19/2017 - 04:47

లండన్, జూలై 18: బ్రిటన్ అధికార పార్టీలో సమస్యలు ముసురుకుంటున్నాయి. కన్జర్వేటివ్ సభ్యులకు ప్రధాని థెరిసా మేకు మధ్య విభేదాలు తారస్థాయికి చేరుకున్నాయి. అక్టోబరులో జరిగే వార్షిక సమావేశం తరువాత నాయకత్వ మార్పుపై కన్జర్వేటివ్ సభ్యులు పావులు కదిపేందుకు సిద్ధమవుతున్నట్లు వార్తలు గుప్పుమంటున్నాయి. పార్టీ సభ్యులు వెన్నుపోటు రాజకీయాలకు పాల్పడ వద్దంటూ కేబినెట్ సమావేశంలో ప్రధాని థెరిసా మే హెచ్చరించారు.

Pages