S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయం

07/29/2017 - 02:10

వాషింగ్టన్, జూలై 28: మెక్సికోతో ఉన్న సరిహద్దు వెంబడి గోడను నిర్మించేందుకు ఉద్దేశించిన బిల్లును అమెరికా ప్రతినిధుల సభ ఆమోదించింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల సందర్భంగా డోనాల్డ్ ట్రంప్ మెక్సికో నుంచి అక్రమ వలసలు, డ్రగ్స్‌ను అరికట్టేందుకు వంద మైళ్ల మేరకు ఉన్న మెక్సికో సరిహద్దులో గోడను నిర్మిస్తానని హామీ ఇచ్చారు. ఇందులో భాగంగా వివాదాస్పద గోడ నిర్మాణ బిల్లుకు అమెరికా ప్రతినిధుల సభ అమోదం తెలిపింది.

07/29/2017 - 02:10

హ్యూస్టన్, జూలై 28: ఏదో సామెత చెప్పినట్టు.. నల్లిని చంపడానికి నిప్పురాజేస్తే మంటలు గదంతా వ్యాపించి మొత్తం అపార్ట్‌మెంట్‌నే చుట్టేశాయి. అమెరికాలోని కాన్సాస్‌లోని టొపెకాలో ఈ ఘటన చోటుచేసుకుంది. యాతావాతా 1,40,000 డాలర్ల నష్టం వాటిల్లిందని అధికారులు లెక్కకట్టారు. మంటల వల్ల అపార్ట్‌మెంట్‌లోని జనాన్ని ఖాళీ చేయించారు.

07/29/2017 - 01:07

ఇస్లామాబాద్, జూలై 28: పనామా గేట్ కేసులో పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్‌కు శుక్రవారం ఆ దేశ అత్యున్నత న్యాయస్థానంలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. నవాజ్ షరీఫ్ ప్రధాని పదవిలో కొనసాగడానికి అనర్హుడిగా ప్రకటించిన న్యాయస్థానం, పనామా గేట్ కుంభకోణంలో విచారణ కోసం ఆయన కేసును అవినీతి వ్యతిరేక కోర్టుకు పంపించాలని కూడా ఆదేశించింది.

07/28/2017 - 03:09

దుబాయి, జూలై 27: భారత్‌పై అణు బాంబుతో దాడి చేయాలని 2001లో అనుకున్నానని పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు ముషారఫ్ వెల్లడించారు. 2001లో భారత పార్లమెంటుపై ఉగ్రదాడి అనంతరం ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగిపోయిన విషయం తెలిసిందే. ఇరుదేశాలు సరిహద్దుల్లో పెద్దఎత్తున బలగాలను మోహరించాయి కూడా.

07/28/2017 - 03:02

ఇస్లామాబాద్, జూలై 27: పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్, ఆయన కుటుంబ సభ్యుల అవినీతి, మనీలాండరింగ్‌కు సంబంధించి పనామా పత్రాలు చేసిన ఆరోపణల కేసులో సుప్రీంకోర్టు తన తీర్పును ఆగస్టు 15లోపు ప్రకటించే అవకాశాలు కనిపించడం లేదు. రాబోయే రెండు వారాలకు సంబంధించి కోర్టు గురువారం కేసుల రోస్టర్‌ను ప్రకటించడంతో ఈ అంశం స్పష్టమైంది.

07/28/2017 - 02:56

వాషింగ్టన్, జూలై 27: అంతరిక్షంలోని సుదూర గెలాక్సీల నుంచి కొట్టుకువచ్చిన పదార్థాల నుంచే మనిషి ఆవిర్భవించాడా? అయి ఉండవచ్చని శాస్తజ్ఞ్రులు అంటున్నారు. గెలాక్సీల నుంచి విపరీతమైన వేగవంతో వీచిన గాలులకు కొట్టుకు వచ్చిన పదార్థాలతోనే పాలపుంత (మిల్కీ వే) ఏర్పడింది.

07/27/2017 - 01:55

కాందహార్, జూలై 26: అఫ్గానిస్థాన్‌లోని కాందహార్ రాష్ట్రంలో ఉన్న మిలిటరీ బేస్‌పై తాలిబన్లు మంగళవారం రాత్రి జరిపిన మెరుపుదాడిలో కనీసం 26 మంది అఫ్గాన్ సైనికులు మృతిచెందగా, మరో 13 మంది గాయపడినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ బుధవారం తెలిపింది. కాందహార్ రాష్ట్రంలోని ఖాక్రెజ్ జిల్లా కర్జాలి ప్రాంతంలో ఉన్న ఆర్మీ క్యాంప్‌పై మిలిటెంట్లు దాడి చేసినట్లు రక్షణ శాఖ ప్రతినిధి జనరల్ దావ్లత్ వాజిరి చెప్పారు.

07/25/2017 - 01:34

వాషింగ్టన్, జూలై 24: అమెరికా అధ్యక్ష పదవికి గత ఏడాది జరిగిన ఎన్నికల సందర్భంగా డొనాల్డ్ ట్రంప్ తరఫు ప్రచారకర్తలు (క్యాంపెయిన్ మేనేజర్లు) రష్యాతో కుమ్మక్కయ్యారన్న ఆరోపణలను ఆయన అల్లుడు, వైట్ హౌస్ సీనియర్ సలహాదారు క్రుష్నర్ తోసిపుచ్చారు. ఈ విషయంలో తాను దాచిపెట్టాల్సిన విషయమేమీ లేదని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

07/25/2017 - 01:15

లాహోర్, జూలై 24: పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో సిఎం కార్యాలయానికి కూతవేటు దూరంలో జరిగిన ఉగ్రవాదుల దాడిలో కనీసం 26మంది మరణించారు. పంజాబ్ ప్రావిన్స్ సిఎం షాహ్‌బాజ్ షరీఫ్ నివాసానికి కొద్దిదూరంలో సోమవారం ఉదయం టెర్రరిస్టులు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. పోలీసులను లక్ష్యం చేసుకుని దాడి జరిగిందని లాహోర్ పోలీస్ చీఫ్ కెప్టెన్ అమిన్ వైన్స్ తెలిపారు.

07/24/2017 - 01:42

బీజింగ్, జూలై 23: చైనాలోని ఇంటర్నెట్ నిఘా సంస్థలు ఈ ఏడాది ఏప్రిల్-జూన్ మధ్య కాలంలో 3,918 అక్రమ వెబ్‌సైట్లను మూసివేయించాయి. చైనా అధికార వార్తా సంస్థ ‘జిన్హువా’ ఆదివారం ఈ విషయాన్ని వెల్లడించింది.

Pages