S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయం

11/14/2016 - 02:41

న్యూయార్క్, నవంబర్ 13: ఐక్యరాజ్య సమితి భద్రతామండలి భారత్‌కు శాశ్వత సభ్యత్వాన్ని కల్పించాల్సిందేనని యుకే, ఫ్రాన్స్ సహా అనేక దేశాలు ముక్తకంఠంతో ఐరాసకు విజ్ఞప్తి చేశాయి. మారుతున్న ప్రపంచ అవసరాలకు అనుగుణంగా భద్రతామండలిని సంస్కరించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశాయి.

11/14/2016 - 02:39

వాషింగ్టన్, నవంబర్ 13: మాతృత్వం కోసం పరితపిస్తున్న మహిళలకు శుభవార్త. మహిళల నుంచి సేకరించిన వ్యర్థ జన్యు పదార్థాన్ని ఉపయోగించి మానవ అండాలను పునరుత్పత్తి చేసే సరికొత్త పద్ధతిని శాస్తవ్రేత్తలు కనుగొన్నారు. పోలార్ బాడీస్‌గా పిలిచే అండాల్లోని చిన్న చిన్న కణాల నుంచి వచ్చే ఈ వ్యర్థ జన్యు పదార్థం (డిఎన్‌ఎ) మహిళ అండ కేంద్రకంలోని జన్యు పదార్థానే్న కలిగి ఉంటుంది.

11/14/2016 - 00:56

వెల్లింగ్టన్, నవంబర్ 13: ఆదివారం తెల్లవారు జామున న్యూజిలాండ్ దక్షిణ దీవి ప్రాంతంలో పెను భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 7.8పాయింట్ల తీవ్రతతో నమోదైన ఈ భూకంపం కారణంగా స్వల్పస్థాయి సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. తీవ్ర స్థాయిలో భవనాలకు నష్టం వాటిల్లింది. సునామీ ముంపునకు గురి కాకుండా తీర ప్రాంత ప్రజలను అత్యవసరంగా ఎగువ ప్రాంతాలకు తరలించారు. ఎమర్జెన్సీ సర్వీసులను అందుబాటులోకి తెచ్చారు.

11/13/2016 - 07:55

న్యూయార్క్, నవంబర్ 12: అమెరికా కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇంకా పదవీ బాధ్యతలు చేపట్టకుండానే ఆయనను ఎంతోకాలం అధ్యక్షుడిగా ఉంచరన్న కథనాలు విస్తృతంగా వ్యాపించాయి. సొంత పార్టీ రిపబ్లికన్ పార్టీనే ట్రంప్‌కు అభిశంసన చెప్పేసి మరొక నేతను అధ్యక్షుడిగా చేస్తుందని అమెరికాకు చెందిన ఓ ప్రొఫెసర్ జోస్యం చెప్పారు.

11/13/2016 - 07:55

టోక్యో, నవంబర్ 12: జపాన్ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ఆ దేశ ప్రధాని షింజే అబెతో కలిసి బులెట్ ట్రైన్‌లో ప్రయాణం చేశారు. జపాన్‌లోని ప్రఖ్యాత హైస్పీడ్ రైలు షింకన్‌సేన్ బులెట్ రైల్లో టోక్యోనుంచి ఒసాకా తీరంలోని కోబె నగరం దాకా ప్రయాణించారు. అబెతో కలిసి బులెట్ రైల్లో ప్రయాణించిన ఫోటోను మోదీ ట్విట్టర్‌లో పెట్టారు. విదేశాంగ శాఖ ప్రతినిధి వికాస్ స్వరూప్ కూడా ఈ ఫోటోలను ట్విట్టర్‌లో ఉంచారు.

11/13/2016 - 06:29

వాషింగ్టన్, నవంబర్ 12: అమెరికా 45వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికవడం ‘మేథో వలస’కు దారితీస్తుందని, విదేశాల్లో పుట్టి అమెరికా విశ్వవిద్యాలయాల్లో విద్యనభ్యసించిన పరిశోధకులు ఇప్పుడు ఆ దేశాన్ని వీడివెళ్లిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని శాస్తవ్రేత్తలు భయాందోళన చెందుతున్నట్లు తాజా అధ్యయనం వెల్లడించింది.

11/12/2016 - 08:19

వాషింగ్టన్, నవంబర్ 11: అమెరికా ఇమ్మిగ్రేషన్ వ్యవస్థను సంస్కరించడానికి కొత్తగా అధ్యక్షుడిగా ఎన్నికయిన డొనాల్డ్ ట్రంప్ పాలనాయంత్రాంగం పది సూత్రాల కార్యాచరణ ప్రణాళికను అమలు చేయనుంది. మెక్సికో సరిహద్దులో గోడ నిర్మించడం, కొన్ని దేశాలకు చెందిన వారికి వీసాలు ఇవ్వకుండా నిలిపివేయడం వంటివి ఈ ప్రణాళికలో ఉన్నాయి. ట్రంప్ ట్రాన్సిషన్ టీమ్ శుక్రవారం ఈ విషయం వెల్లడించింది.

11/12/2016 - 08:18

వాషింగ్టన్, నవంబర్ 11: అమెరికాలోకి ముస్లింలు ప్రవేశించకుండా నిషేధిస్తాననేది అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన ప్రధాన వాగ్దానాలలో ఒకటి. అయితే అతను అధ్యక్షుడిగా ఎన్నికయిన మరుసటి రోజు గురువారం అతని ప్రచార వెబ్‌సైట్‌లో ఈ వాగ్దానం కనిపించకుండా పోయింది.

11/12/2016 - 08:36

ఇస్లామాబాద్, నవంబర్ 11: భారత్ తరహాలోనే పెద్దనోట్లు రద్దుచేయాలని పాకిస్తాన్ ప్రజాప్రతినిధులు డిమాండ్ చేశారు. అవినీతి, నల్లధనం నిర్మూలించాలన్న ఉద్దేశంతో భారత ప్రభుత్వం 500,1000 రూపాయల నోట్లను రద్దుచేసింది. పాకిస్తాన్‌లోనూ 500,1000 రూపాయల నోట్లు రద్దుచేయాలని పాక్ పార్లమెంటులో ఆర్థిక వ్యవహారాల స్థాయి సంఘం సిఫార్సు చేసింది.

11/12/2016 - 08:17

వాషింగ్టన్/ న్యూయార్క్, నవంబర్ 11: అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయాన్ని వ్యతిరేకిస్తూ వరుసగా రెండో రోజు శుక్రవారం కూడా అమెరికాలో ప్రజలు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. వేలాది మంది ఆందోళనకారులు న్యూయార్క్, చికాగో నగరాలను ముట్టడించారు. మరోవైపు, మీడియా తనకు వ్యతిరేకంగా ‘ప్రొఫెషనల్ ప్రొటెస్టర్స్’ (ఆందోళనలు చేయడమే పనిగా పెట్టుకున్నవారు)ను రెచ్చగొడుతోందని ట్రంప్ ఆరోపించారు.

Pages