S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయం

11/10/2016 - 02:09

వాషింగ్టన్, నవంబర్ 9: అమెరికా ఎన్నికల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా భారతీయ సంతతికి చెందిన అయిదుగురు అమెరికన్లు అమెరికా కాంగ్రెస్‌కు ఎన్నికయ్యారు. పోటీ చేసిన భారతీయ మహిళల్లో చాలామంది ఈ ఎన్నికల్లో మంచి విజయాలు సాధించడం విశేషం. కాలిఫోర్నియా రాష్ట్రానికి రెండుసార్లు అటార్నీ జనరల్‌గా పనిచేసిన 51 ఏళ్ల కమలా హారిస్ ఆ రాష్ట్రంలో అమెరికా సెనేట్‌కు ఎన్నికయ్యారు.

11/10/2016 - 01:58

నేను మొత్తం అమెరికన్లకు అధ్యక్షుడిని. నేను చెప్పే ప్రతీ మాటా అత్యంత నిజాయితీతో కూడుకున్నది. సందేహాలు, అనుమానాలకు ఆస్కారం లేదు. ఎన్నికల కోసం ఓటర్లు చీలినా అమెరికా మాత్రం సమైక్యంగానే ఉండాలి. ప్రతి ఒక్కరి సంక్షేమం కోసం పాటుపడటమే నా ధ్యేయం, బాధ్యత.

11/09/2016 - 08:41

వాషింగ్టన్, నవంబర్ 8: గతంలో ఎన్నడూ లేనివిధంగా ప్రస్తుత అమెరికా ఎన్నికల్లో భారతీయ సంతతికి చెందిన మహిళలు ఇటు రిపబ్లికన్, అటు డెమొక్రాట్ పార్టీల్లో ప్రముఖ పాత్ర పోషించారు. ప్రచారపరంగా అత్యంత కీలకమైన పదవులే నిర్వహించి తమ సమర్థతను మరోసారి చాటుకున్నారు. ముఖ్యంగా డెమొక్రాట్ అభ్యర్థిగా పోటీచేసిన హిల్లరీ క్లింటన్ ప్రచారానికి సంబంధించిన పలు విభాగాల్లో వీరి పాత్ర గణనీయంగానే ఉంది.

11/09/2016 - 08:40

వాషింగ్టన్, నవంబర్ 8: అమెరికా 45వ అధ్యక్ష పదవి ఎవరిని అలంకరించనున్నది మరి కొద్ది గంటల్లో తేలిపోనుంది. అమెరికా చరిత్రలోనే అత్యంత ఉత్కంఠగా సాగిన ఈ ఎన్నికలు భారత కాలమానం ప్రకారం మంగళవారం రాత్రి 9.30గంటలకు అధికారికంగా మొదలై, బుధవారం ఉదయం 10.30 గంటలకు ముగుస్తాయి. ఎన్నికలు జరుగుతుండగానే ఎగ్జిట్ పోల్స్ వెలువడుతూనే ఉన్నాయి.

11/09/2016 - 08:37

ఐరాస, నవంబర్ 8: జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజార్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించే విషయంలో ఐరాస భద్రతా మండలిలో జరుగుతున్న జాప్యంపై భారత్ మండిపడింది. అంతర్జాతీయ ఉగ్రవాదుల జాబితాలో మసూద్‌ను చేర్చడానికి సాంకేతిక కారణాలు చూపుతూ నెలలు తరబడి తాత్సారం చేయడంపై ఐరాసలో భారత రాయబారి సయ్యద్ అక్బరుద్దీన్ తప్పుపట్టారు. జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థను నిషేధించిన ఐరాసా మసూద్‌ను ఎందుకు ఉపేక్షిస్తోందని ఆయన నిలదీశారు.

11/09/2016 - 07:33

వాషింగ్టన్, నవంబర్ 8: అమెరికా అధ్యక్ష ఎన్నికలకు మంగళవారం ఓటింగ్ ప్రారంభమయింది. అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న డెమోక్రటిక్ పార్టీ అన్యర్థి హిల్లరీ క్లింటన్, రిపబ్లికన్ పార్టీ ప్రత్యర్థి డొనాల్డ్ ట్రంప్‌లలో ఎవరు దేశాన్ని పాలించనున్నారో దాదాపు 20 కోట్ల మంది ఓటర్లు మంగళవారం నిర్ణయించనున్నారు. భారత కాలమానం ప్రకారం మంగళవారం అర్ధరాత్రి ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమయింది.

11/08/2016 - 01:49

విదేశీ శక్తుల నుంచి
అమెరికాను కాపాడటం కోసం ఓట్లేయండి. దేశ
చరిత్రలో మునె్నన్నడూ లేని విధంగా అద్భుత
విజయాన్ని
సాధించబోతున్నాం.
-డొనాల్డ్ ట్రంప్

విభజన, ఐక్యత అన్న వాటిలో ఏదో ఒకటి ఎంచుకోవలసిన సమయం వచ్చింది. మన పిల్లలు, వారి పిల్లలకు ఎలాంటి దేశం ఇవ్వాలో నిర్ణయించుకోవాలి.
-హిల్లరీ క్లింటన్

11/08/2016 - 00:56

లాహోర్, నవంబర్ 7: భారత్‌పై తామూ సర్జికల్ దాడులకు దిగుతామని జమాతే ఉద్దవా చీఫ్, ముంబయిపై ఉగ్రదాడికి సూత్రధారి మహ్మద్ హఫీజ్ సయాద్ ప్రకటించాడు. భారత్‌కు సరైన రీతిలో గుణపాఠం చెబుతామని పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని మీర్‌లో జరిగిన ఓ సభలో వెల్లడించాడు. భారత ప్రధాని నరేంద్ర మోదీకి సరైన రీతిలో సమాధానం చెబుతామన్న హఫీజ్ ‘కాశ్మీర్ మిలిటెంట్లతోనే సర్జికల్ దాడులు చేయిస్తాం’ అని అన్నాడు.

11/08/2016 - 00:52

వాషింగ్టన్, నవంబర్ 7: అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సరిగ్గా ఎన్నికలకు ఒక్క రోజు ముందు డెమొక్రాట్ల అభ్యర్థి హిల్లరీ క్లింటన్ గెలుపు అవకాశాలను మరింత పెంచుతూ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇనె్వస్టిగేషన్ (ఎఫ్‌బిఐ) తీపి కబురు తెలిపింది. ఎన్నికల ప్రచారంలో హిల్లరీపై అత్యంత వివాదాస్పద ప్రచారాస్త్రంగా ట్రంప్ చేతిలో చిక్కిన ఈ మెయిల్స్ వ్యవహారంలో హిల్లరీకి ఎఫ్‌బిఐ క్లీన్‌చిట్ ఇచ్చింది.

11/08/2016 - 00:46

బీజింగ్, నవంబర్ 7: భారత్ ఆశలపై చైనా మరోసారి నీళ్లు చల్లింది. అణు సరఫరా దేశాల కూటమి (ఎన్‌ఎస్‌జి)లో భారత్‌కు సభ్యత్వం కల్పించే విషయమై తన వైఖరిలో ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేసింది. మరో నాలుగు రోజుల్లో శుక్ర, శనివారాల్లో వియన్నాలో ఎన్‌ఎస్‌జి ప్లీనరీ సమావేశాలు జరుగనున్న తరుణంలో చైనా సోమవారం ఈ ప్రకటన చేసింది.

Pages