S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

09/20/2016 - 00:41

విజయనగరం (్ఫర్టు), సెప్టెంబర్ 19: జిల్లాలో ఎన్‌ఎస్‌ఎస్ ద్వారా సేవా కార్యక్రమాలను మరింత విస్తృతం చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని ఎన్‌ఎస్‌ఎస్ జిల్లా ప్రోగ్రామ్ అధికారి డాక్టర్ చొప్ప సూర్యనారాయణ అన్నారు. స్థానిక ఆంధ్రవిశ్వవిద్యాలయం ప్రాంగణం (ఎయుకేంపస్)కు చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్, ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం అధికారి డాక్టర్ ఎన్‌విఎస్ సూర్యనారాయణను జిల్లా సహాయ ప్రోగ్రాం అధికారిగా నియమించారు.

09/20/2016 - 00:41

విజయనగరం (్ఫర్టు), సెప్టెంబర్ 19: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ప్రకటించాలని, ప్రత్యేక ప్యాకేజీలు అవసరం లేదని ఆమ్‌ఆద్మీపార్టీ జిల్లా కన్వీనర్ జి.పుష్పనాధం అన్నారు. సోమవారం పార్టీ కార్యాలయంలో విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రత్యేక ప్యాకేజీల వల్ల ప్రయోజనం లేదని చెప్పారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పిస్తేనే అన్నివిధాలా ఉపయోగం ఉంటుందని తెలిపారు.

09/20/2016 - 00:40

విజయనగరం (్ఫర్టు), సెప్టెంబర్ 19: పట్టణ శివారులో ఉన్న వైఎస్సార్ కాలనీలో సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నవయువ సమాఖ్య(ఎన్‌వైఎస్) ఆధ్వర్యంలో సోమవారం మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. సమస్యల పరిష్కారంలో ఎందుకు జాప్యం చేస్తున్నారంటూ మున్సిపల్ చైర్మన్ ప్రసాదుల రామకృష్ణను నిలదీశారు.

09/20/2016 - 00:40

విజయనగరం(టౌన్), సెప్టెంబర్ 19: వ్యాధుల నిర్మూలనకు ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో కృషిచేయాలని కలెక్టర్ వివేక్‌యాదవ్ కోరారు. ఈనెల 29వ తేదీ వరకు గ్రామాల్లో నిర్వహించే ప్రత్యేకపారిశుద్ధ్య కార్యక్రామాన్ని ఆయన డెంకాడ మండలం పెదతాడివాడలో ప్రారంభించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సీజనల్ వ్యాధుల కారణంగా ఏ ఒక్కరూ రోగాల బారిన పడకుండా ఉండాలంటే ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు.

09/20/2016 - 00:39

విజయనగరం(టౌన్), సెప్టెంబర్ 19: గ్రామాల్లో ప్రజా సమస్యలపై స్పందించని సిబ్బందిపై చర్యలు తప్పవని జాయింట్ కలెక్టర్ శ్రీకేష్ బాలాజీ లఠ్కర్ హెచ్చరించారు. సోమవారం కలెక్టరేట్ నుండి ప్రతి సోమవారం నిర్వహించే డయల్ యువర్ కలెక్టర్ ద్వారా ప్రజల సమస్యలు తెలుసుకున్నారు.

09/20/2016 - 00:39

విజయనగరం(టౌన్), సెప్టెంబర్ 19: సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అప్రమత్తంగా ఉండి వాటిని నిరోధించాలని స్ర్తిశిశుసంక్షేమ శాఖ మంత్రి పీతల సుజాత చెప్పారు. వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన ప్రచార వాహనాన్ని ఆమె సోమవారం ప్రారంభించారు.

09/20/2016 - 00:37

తాడేపల్లిగూడెం, సెప్టెంబర్ 19: పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు పెంచాలని దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు పేర్కొన్నారు. సోమవారం రూరల్ మండలం పుల్లాయిగూడెం గ్రామంలో రోడ్డుకిరువైపులా మంత్రి మాణిక్యాలరావు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాలుష్యరహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు మొక్కలు అధిక సంఖ్యలో పెంచాలన్నారు.

09/20/2016 - 00:37

ఏలూరు, సెప్టెంబర్ 19 : ఒకప్పుడు పశ్చిమ జడ్పీ అంటే నిధులతో కళకళలాడే పెద్ద సంస్థగా అందరికీ తెలుసు. కానీ ఆ పరిస్థితి చాలా వరకు మారిపోయింది. ప్రస్తుతం జిల్లా పరిషత్ ఆర్ధిక ఇబ్బందుల్లో వుందనే చెప్పుకోవచ్చు. ఒకప్పటి నిధుల రాక పూర్తిగా రూటు మారిపోవడంతో జడ్పీకి జమ అవుతున్న ప్రభుత్వ నిధుల పరిమాణం దారుణంగా పడిపోయింది.

09/20/2016 - 00:36

ఏలూరు, సెప్టెంబర్ 19 : విజయవాడ రైల్వేస్టేషన్ ఆధునీకరణ నేపధ్యంలో ఈ నెల 21వ తేదీ నుంచి 28వ తేదీ వరకు వివిధ రైళ్ల రాకపోకల మార్పులు, మళ్లింపుల నేపధ్యంలో జిల్లాలోని అయిదు డిపోల నుంచి ప్రయాణీకులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆర్‌టిసి సర్వీసులను ఏర్పాటుచేస్తున్నామని సంబంధిత ఆర్ ఎం ఎస్ ధనుంజయరావు తెలిపారు.

09/20/2016 - 00:36

ఏలూరు, సెప్టెంబర్ 19 : విజయవాడ రైల్వేస్టేషన్ ఆధునికీకరణ నేపధ్యంలో కాకినాడ నుంచి బెంగుళూరు వెళ్లే శేషాద్రి ఎక్స్‌ప్రెస్ ఈ నెల 21, 22, 23, 24 తేదీల్లో దారి మళ్లిస్తున్నామని, లూప్‌లైన్ నుంచి మెయిన్ లైన్ మీదుగా వెళుతుందని ఏలూరు రైల్వే స్టేషన్ మాస్టర్ ఎవి సత్యనారాయణరావు తెలిపారు.

Pages