S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

08/27/2016 - 16:10

చిత్తూరు: పట్టాదారు పాస్ పుస్తకం ఇచ్చేందుకు రెండేళ్లుగా తనను వేధిస్తున్నారంటూ ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదుపై ఎపి రెవెన్యూ మంత్రి, డిప్యూటీ సిఎం కెఇ కృష్ణమూర్తి తీవ్రస్థాయిలో స్పందించారు. మహిళను వేధించినందుకు చిత్తూరు జిల్లా రామచంద్రాపురం తహశీల్దార్‌ను వెంటనే సస్పెండ్ చేయాలంటూ ఆయన రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శిని శనివారం ఆదేశించారు.

08/27/2016 - 16:09

హైదరాబాద్: తెరాస అధికారంలోకి వచ్చాక తెలంగాణలో ఆడబిడ్డలను బోనాలు, బతుకమ్మ పండగలకు పరిమితం చేశారని, పాలనలో మహిళలకు భాగస్వామ్యం లేకుండా పోయిందని టిడిపి నేత రేవంత్ రెడ్డి అన్నారు. శనివారం ఎన్టీఆర్ ట్రస్ట్భువన్‌లో తెలంగాణ తెలుగుమహిళ కమిటీ ప్రమాణ స్వీకారం సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కెసిఆర్ క్యాబినెట్‌లో ఒక్క మహిళ కూడా లేకపోవడం దారుణమన్నారు.

08/27/2016 - 16:08

హైదరాబాద్: గ్యాంగ్‌స్టర్ నరుూం అకృత్యాలపై ఫిర్యాదు చేసేందుకు వచ్చిన బాధితులను వేధించినందుకు రంగారెడ్డి జిల్లా చేవెళ్ల సిఐ ఉపేందర్, చెంగోముల్ ఎస్‌ఐ శేఖర్‌లను ‘సిట్’ చీఫ్, ఐజి నాగిరెడ్డి సస్పెండ్ చేశారు. పోలీసు శాఖలో కింది స్థాయి నుంచి ఉన్నతస్థాయి వరకూ ఎంతోమంది అధికారులు నరుూంకు సహకరించి భారీగా ఆస్తులు కూడపెట్టుకున్నారన్న ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే.

08/27/2016 - 16:08

దిల్లీ: దిల్లీ ప్రభుత్వ వ్యవహారాల్లో పదే పదే జోక్యం చేసుకుంటున్న ప్రధాని మోదీ మరిన్ని అరెస్టులకు ఆదేశాలిస్తారేమోనని సిఎం కేజ్రీవాల్ మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ, దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్‌ల ఆదేశాలపై ఇటీవల ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలు, నేతలపై కేసులు పెడుతున్నారని ఆయన ఆరోపించారు.

08/27/2016 - 16:07

గుంటూరు: ఎపికి ప్రత్యేకహోదా సాధించేవరకూ తమ ప్రభుత్వం పోరాడుతుందని వ్యవసాయశాఖ మంత్రి పి.పుల్లారావు శనివారం తెలిపారు. వెలగపూడి తాత్కాలిక సచివాలయంలో వ్యవసాయ శాఖ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. జనసేన పార్టీ అధినేత, నటుడు పవన్‌కల్యాణ్ ప్రత్యేక హోదా కోసం కేంద్రంతో పోరాడినా మంచిదేనన్నారు. హోదా సాధనకు ఎవరు ప్రయత్నించినా ప్రజలకు మేలు జరుగుతుందన్నారు.

08/27/2016 - 16:07

హైదరాబాద్: విపక్షాలను చులకనగా చూడడం, జైలులో పెట్టిస్తానని హెచ్చరించడం సిఎం హోదాలో ఉన్న కెసిఆర్‌కు తగదని కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ అన్నారు. ప్రజల కోసం పోరాడుతున్న విపక్షాలపై కెసిఆర్ వైఖరి ఇకనైనా మారాలన్నారు. ప్రజలంతా పోరాడి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకుంటే, తన కుటుంబం కోసమే రాష్ట్రం ఏర్పడిందని కెసిఆర్ భావిస్తున్నారన్నారు.

08/27/2016 - 16:07

కోల్‌కత: పశ్చిమబెంగాల్‌లోని బంకురా జిల్లా బిషన్‌పూర్ సమీపంలో శుక్రవారం రాత్రి రైల్వే ట్రాక్ దాటుతుండగా ఖరగ్‌పూర్-అద్రా పాసింజర్ రైలు ఢీకొనడంతో రెండు పిల్ల ఏనుగులు, తల్లి ఏనుగు మృత్యువాత పడ్డాయి. దీంతో ఈ మార్గంలో సుమారు రెండు గంటల సేపు రాకపోకలు నిలిచిపోయాయి. రైల్వే అధికారులు కూలీలను రప్పించి ఏనుగుల కళేబరాలను ట్రాక్‌పై నుంచి తొలగించారు.

08/27/2016 - 16:06

మాస్కో: రష్యా రాజధాని మాస్కో నగరంలో శనివారం ఓ కోల్డ్ స్టోరేజీలో ఆకస్మికంగా మంటలు వ్యాపించి 16 మంది ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేసేందుకు చర్యలు ప్రారంభించారు.

08/27/2016 - 16:06

హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలను మొక్కుబడిగా నిర్వహిస్తున్నారని, ప్రజా సమస్యలపై చర్చించేందుకు కనీసం 15 రోజులైనా సమావేశాలు జరపాలని బిజెపి శాసనసభా పక్షం నేత కిషన్ రెడ్డి అన్నారు. ఆయన శనివారం బిజెపి పక్ష నాయకుడిగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా మాట్లాడుతూ, తెరాస ప్రభుత్వం అన్ని విషయాల్లో ఏకపక్షంగా వ్యవహరిస్తోందన్నారు. జిల్లాల విభజనలో ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారన్నారు.

08/27/2016 - 15:47

ఢిల్లీ: ఏఐసీసీ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో పాటు మరో ఐదుగురికి నేషనల్ హెరాల్డ్ కేసులో ఢిల్లీ కోర్టు నోటీసులు జారీచేసింది. రెండు వారాలలోపు సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. తదుపరి విచారణను అక్టోబరు 4వ తేదీకి వాయిదా వేసింది. నేషనల్ హెరాల్డ్ పత్రిక నిధులను సోనియా, రాహుల్ దుర్వినియోగం చేశారని బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి కేసు పెట్టిన సంగతి తెలిసిందే.

Pages